త్రీడీ ప్రింటర్‌తో తాజా పండ్లు!
3డీ ప్రింటర్‌తో రకరకాల వస్తువులనే కాదు.. పిజ్జాలు, బర్గర్లు, ఇతర ఆహార పదార్థాలనూ ప్రింట్ చేసుకోవచ్చన్నది మనకు ఇదివరకే తెలుసు. అయితే పండ్లను కూడా తయారు చేసుకునేందుకు ఉపయోగపడే వినూత్న త్రీడీ ప్రింటర్‌ను కేంబ్రిడ్జిలోని డోవెటైల్డ్ అనే కంపెనీ రూపొందించింది. ఈ ప్రింటర్‌తోపాటు మన దగ్గర ఆయా పండ్ల ఫ్లేవర్లు ఉంటేచాలు.. కావల్సిన ఫలాలు చిటికెలో సిద్ధమైనట్లే. ఉదాహరణకు దానిమ్మ గింజలు తినాలని అనిపించిందనుకోండి.. దానిమ్మ ఫ్లేవర్‌ను ప్రింటర్లో వేసి బటన్ నొక్కితే చాలు ఫ్లేవర్‌ను గిన్నెలో చుక్కచుక్కలుగా పోస్తూ ఈ ప్రింటర్ తాజా గింజలను ప్రింట్ చేస్తుంది.
అలాగే యాపిల్, అరటి, ఇతర పండ్లను కూడా తాజాగా తయారు చేసుకోవచ్చు. హోటళ్లలో, ఇంట్లో కూడా ఈ ప్రింటర్ తో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా పండ్లను రుచిచూడొచ్చంటున్నారు దీని రూపకర్తలు. అంతేకాదండోయ్.. పండ్ల రుచి, ఆకారం, సైజులను కూడా మన ఇష్టమొచ్చినట్లు నిర్ణయించుకోవచ్చట. అంటే యాపిల్ పండును మామిడిలా, మామిడి పండును అరటి పండులా కూడా తయారు చేసుకోవచ్చన్నమాట!