సరిహద్దులో రెండుసార్లు పాక్ కాల్పులు
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులో కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా కృష్ణగాటి సెక్టార్ వద్ద పాక్ బలగాలు సోమవారం కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. పాక్ భద్రతా బలగాలు రెండుసార్లు కాల్పులకు దిగాయని వెల్లడించింది. కాల్పుల్లో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు.