Entrepreneur of the Year Award
-
Sujata Seshadrinathan: ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్
సార్క్ రీజన్ ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని స్వీకరించిన సుజాత శేషాద్రినాథ్ వ్యాపార అనుభవాలే తన పాఠాలు అని చెబుతుంది... సాఫ్ట్వేర్, ఫైనాన్స్,అకౌంటింగ్ స్పెషలిస్ట్‌గా తనదైన ముద్ర వేసింది సుజాత శేషాద్రినాథన్. ఫండ్ బిజినెస్‌లో అకౌంటింగ్ అప్లికేషన్స్ కోసం ఆటోమేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ క్రియేట్ చేసింది. ‘అద్భుతమైన పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో సహకరించిన వ్యక్తులు, సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటయిన సంస్థ ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. భవిష్యత్తరం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. ఈ ఉద్యమంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది’ అంటుంది సుజాత శేషాద్రినాథన్. ఎస్పీజైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మెనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుజాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ చేసింది. సాఫ్ట్వేర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులలో సుజాతకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బసిజ్ ఫండ్ సర్వీస్ ప్రైవెట్ లిమిటెడ్‌కు సుజాత డైరెక్టర్. ఫండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వరకు ఈ సంస్థ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. రకరకాల విషయాలలో క్లయింట్స్‌కు సంబంధించి జటిలమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది. -
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
సాక్షి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు షార్ట్‌లిస్ట్ పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాక్షి మీడియా గ్రూప్ తొలిసారి అందజేయనున్న ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’లో భాగంగా ‘ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు షార్ట్ లిస్ట్ ప్రక్రియ పూర్తయింది. ఇన్నోవేషన్‌తో సహా 2014లో పారిశ్రామికవేత్తగా విజయం సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి నలుగురిని షార్ట్ లిస్ట్ చేశారు. ఫ్యాప్సీ అధ్యక్షుడు శివ్‌కుమార్ రుంగ్టా, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) అధ్యక్షుడు శ్రీనివాస్ అయ్యదేవర, సీఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ హరీష్ చంద్రప్రసాద్ ఈ ప్రక్రియకు జ్యూరీగా వ్యవహరించారు. జ్యూరీ షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాను... వివిధ రంగాలకు చెందిన నిపుణులుండే ఫైనల్ జ్యూరీ పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తుంది. పూర్తి పారదర్శకంగా... అవార్డుల ఎంపికలో పారదర్శకత కోసం ఆడిటింగ్ సంస్థ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఈ పాయింట్ సిస్టమ్ ఆధారంగా ‘ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ జాబితాను షార్ట్‌లిస్ట్ చేశారు. దీనిపై జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన ముగ్గురూ సంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా దరఖాస్తులు రావటం అభినందనీయమన్నారు. ఆహ్వానించదగ్గ పరిణామం ఈ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు ఎక్కువగా పోటీపడుతున్నాయి. వీటిలో అత్యధికం యువత నుంచి వచ్చినవే. వినూత్న ఆలోచనలు వీరి సొంతం. పది మందికీ ఉపాది కల్పిచే పారిశ్రామికవేత్తలనుప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక విభాగానికే కాకుండా సామాజిక కోణంలో అన్ని రంగాలను ప్రోత్సహించేలా ‘సాక్షి’ అవార్డులు ఉండడం ఆహ్వానించతగ్గది. -వై.హరీష్చంద్ర ప్రసాద్ సీఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ చైర్మన్ అన్ని విభాగాల నుంచీ... ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్‌తోపాటు పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని అవార్డులతో వెన్నుతట్టడం ఆనందంగా ఉంది. ఎక్సలెన్స్ అవార్డులతో ‘సాక్షి’ తీసుకున్న చొరవ అభినందనీయం. వినూత్న వ్యాపారాలను నిర్వహిస్తున్న స్టార్టప్‌లు ఇందులో పోటీపడుతున్నాయి. అన్ని వ్యాపార విభాగాల నుంచి నామినేషన్లు వచ్చాయి. చిన్న పట్టణాల నుంచీ దరఖాస్తులు వచ్చాయి. - శివ్ కుమార్ రుంగ్టా, ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరిన్ని విభాగాలుండాలిై రెతులు మొదలుకుని పారిశ్రామికవేత్తల వరకు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులివ్వడం అభినందనీయం. రానున్న రోజుల్లో మరిన్ని విభాగాలను అవార్డుల కింద జోడించాలని కోరుకుంటున్నాను. ఎక్సలెన్స్ అవార్డులు సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తాయి. ఏటా ఇలా అవార్డులు ఇచ్చి పారిశ్రామికవేత్తలను సత్కరించాలి. భారీ పరిశ్రమలకు అలాగే ఎంఎస్ఎంఈకి వేర్వేరుగా ‘ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇస్తే బాగుండేది. మొత్తంగా ‘సాక్షి’ తీసుకున్న ఈ చొరవను అభినందిస్తున్నాను. -శ్రీనివాస్ అయ్యదేవర,ప్రెసిడెంట్, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్