క్వాలిఫయింగ్‌లో భారత్‌కు రెండో స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు క్వాలిఫయింగ్‌లో రాణించింది. టర్కీలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో జయంత తాలుక్దార్, తరుణ్‌దీప్ రాయ్, కపిల్‌లతో కూడిన భారత బృందానికి రెండో స్థానం దక్కింది.
మంగళవారం జరిగిన అర్హత రౌండ్లో తాలుక్దార్ 1331 పాయింట్లు, తరుణ్‌దీప్ 1330 పాయింట్లు, కపిల్ 1322 పాయింట్లు స్కోరు చేశారు. ఓవరాల్‌గా భారత జట్టు 3983 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 4057 పాయింట్లతో దక్షిణ కొరియా జట్టు తొలి స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో తాలుక్దార్, తరుణ్‌దీప్, కపిల్ వరుసగా 15వ, 16వ, 22వ స్థానాలను పొందారు. రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో ఎలిమినేషన్ రౌండ్స్ బుధవారం ప్రారంభమవుతాయి.