Female Athletes
-
Tokyo Olympics: ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి..
అంతర్జాతీయ క్రీడా వేడుకల వేదిక ఒలింపిక్స్‌కు ఓ చరిత్ర ఉంది. అయితే ఆ చరిత్రలో వివాదాలు, విమర్శలకు సైతం చోటు దక్కింది. ముఖ్యంగా ఆటల్లో లింగ వివక్ష గురించి ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే వస్తోంది. ఈ తరుణంలో టోక్యో ఒలింపిక్స్ తొలిసారి ఓ అర్హత సాధించింది. ఇప్పటివరకు రికార్డుకానీ రీతిలో ఫిమేల్ అథ్లెట్లతో సందడి చేయబోతోంది ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్. సాక్షి, వెబ్‌డెస్క్: ‘లింగ సమతుల్యపు ఒలింపిక్స్’గా టోక్యో ఒలింపిక్స్‌కి ఓ అరుదైన ఘనత దక్కబోతోంది. విశేషం ఏంటంటే.. ఐదు అగ్ర దేశాలు పురుషుల కంటే మహిళా అథ్లెట్లు పంపించడం. బ్రిటన్, యూఎస్, చైనా, ఆస్ట్రేలియా, కెనెడాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాయి. ఇక రష్యా కూడా ఇదే బాటను అనుసరించింది. చైనా 298 మహిళలు..133 పురుషులు, అమెరికా 329 మహిళలు.. 284 పురుషులు, యూకే నుంచి 376 మంది బరిలోకి దిగుతుండగా అందులో 201 మంది మహిళలే ఉన్నారు. ఇక కెనడా అయితే 225 మంది మహిళలను.. 145 మంది పురుష అథ్లెట్లను బరిలోకి దింపింది. ఆస్ట్రేలియా నుంచి 471 మంది ఒలింపిక్స్‌లో పోటీపడుతుండగా.. 252 మంది మహిళలు, 219 మంది పురుషులు ఉన్నారు. రష్యా నుంచి మొత్తం 329లో 183 మంది మహిళలు, 146 మంది పురుషులు పాల్గొంటున్నారు. అధికారికంగా ప్రకటన ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)అధికారికంగానే టోక్యో ఒలింపిక్స్‌ను జెండర్ బ్యాలెన్స్డ్ ఒలింపిక్స్‌గా ప్రకటించింది. అంతేకాదు ఆరంభ వేడుకల్లో జెండా మోయడం దగ్గరి నుంచి అది ప్రారంభం కావాలని అభిప్రాయపడింది. లింగ సమానత్వం లక్క్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొంది. ఇక ఈ దఫా 49 శాతం మహిళలు, 51 శాతం పురుషులు ఇందులో పాల్గొంటున్నారని ప్రకటించింది. భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా, 56 మంది మహిళలే ఉన్నారు. ఆతిథ్య జపాన్ మాత్రం 259 మహిళలు, 293 పురుషులతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే.. మొత్తం ఈసారి 48.8 శాతం మహిళా పోటీదారులు పాల్గొనబోతున్నారు. అంటే.. అది 50 శాతం కంటే తక్కువగా ఉందన్నమాట. ఆ లెక్కన ఐవోసీ లక్క్ష్యం సాధనకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే.. ఆధునిక మొదటి ఏథెన్స్ ఒలింపిక్స్(1896)లో మహిళలను పాల్గొనకుండా నిషేధించారు. అయితే 1900 ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి మహిళా అథ్లెట్లను అనుమతిస్తున్నారు. అందులో మొత్తం 997 మంది పోటీదారుల్లో 22 మంది మాత్రమే మహిళలు(ఐదు ఈవెంట్స్) ఉన్నారు. *2012 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళా అథ్లెట్ల శాతం 44.2 *2016 రియో ఒలింపిక్స్ పాల్గొన్న వాళ్ల శాతం 45 (టోక్యో వరకు మెరుగైన ఫలితమే కనిపిస్తోంది) *రియో పారాఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళల శాతం 38.6 *టోక్యో పారాఒలింపిక్స్‌లో అది 40.5 శాతంగా ఉండబోతోంది. -
అమ్మాయిలకు మంత్రి వివాదాస్పద ప్రశ్నలు
తమిళనాడు క్రీడలు, యవజన సర్వీసుల శాఖ మంత్రి సుందర్ రాజ్.. విద్యార్థినుల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. జవాబులు చెప్పడానికి ఇబ్బందికరమైనటువంటి వివాదాస్పద ప్రశ్నలను మహిళా అథ్లెట్లను అడిగారు. సుందర్ రాజ్ ఇటీవల పుదుకొట్టాయ్లోని పాఠశాలను ఆకస్మింగా సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా అథ్లెట్లతో మంత్రి మాట్లాడారు. హాకీ క్రీడాకారిణులను ఉద్దేశించి మీకు తగినన్ని లోదుస్తులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్ని పతకాలు గెలిచారని అడిగిన మంత్రి ఆ తర్వాత ఏ పతకం కూడా గెలవకుంటే భోజనం ఎందుకు పెట్టాలని అన్నారు. మంత్రి మరో విద్యార్థిని.. 'నీవు బరువు పెరిగావా, లేదా? నీకు భోజనం కోసం రోజు 250 రూపాయలు ఇస్తున్నాం. కాలేజీ విద్యార్థులకు నెలకు 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. వారి కంటే మీకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. మీ భోజనం కోసం మాత్రమే ఇస్తున్నాం' అని అన్నారు. మరో విద్యార్థిని దగ్గరికి వెళ్లి.. హాస్టల్లో చేరిన తర్వాత పెద్దమనిషివి అయ్యావా? అని ప్రశ్నించారు. విద్యార్థులను మంత్రి ఇలా ప్రశ్నించడం దుమారం రేపింది. అయితే తాను ఇలాంటి ప్రశ్నలను విద్యార్థులను అడగలేదని, వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించానని మంత్రి చెప్పారు. -
‘సాయ్’లో ఘోరం
► నలుగురు మహిళా అథ్లెట్ల ఆత్మహత్యాయత్నం ► ఒకరు మృతి క్రీడా శాఖ విచారణ న్యూఢిల్లీ : భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)లో దారుణం చోటు చేసుకుంది. కేరళలోని అళెప్పీ సాయ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో నలుగురు మహిళా అథ్లెట్స్ ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో 15 ఏళ్ల అపర్ణా రామభద్రన్ మృతి చెందగా మిగతా ముగ్గురు టీనేజర్ల పరిస్థితి విషమంగానే ఉంది. వీరంతా విషపూరిత పండు (సెర్బెరా ఒడోలమ్)ను తిని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇంటర్ చదువుతున్న అపర్ణ పదో తరగతిలోనే సాయ్కు ఎంపికైంది. సీనియర్ల, కోచ్, సిబ్బంది వేధింపులు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమతో తెలిపిందని అపర్ణ తల్లి గీత ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను సాయ్ హాస్టల్ వార్డెన్ ఖండించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నలుగురి సంతకంతో కూడిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు సంఘటన జరగ్గా రాత్రి 9 గంటలకు ఆస్పత్రికి తీసుకురావడం వెనుక గల కారణంపై విచారణ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పద్మకుమార్ తెలిపారు. ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమని డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది.