first general elections
-
నెహ్రూ హవా
స్వాతంత్య్రం సిద్ధించి అప్పటికి దశాబ్దం గడిచింది. నెహ్రూ పాలనే సాగుతోంది. ముప్పిరిగొన్న సమస్యల నడుమే రెండో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పి ఓటేసేలా చేయడం ఎన్నికల సంఘానికి కీలక సవాలుగా నిలిచింది. అయితే 1952 తొలి ఎన్నికల నిర్వహణ తాలూకు అనుభవం ఈసారి బాగా పనికొచి్చంది. పాకిస్తాన్ రాజ్యాంగ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉండగానే మనం రెండో ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం గట్టిగా వేళ్లూనుకుందని ప్రపంచానికి చాటాం. దేశాన్ని ఎన్నో సమస్యలు వేధిస్తున్నప్పటికీ రెండో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి నెహ్రూకే పట్టం కట్టారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడమే దీనికి కారణం. 1952లో తొలి ఎన్నికల్లో 364 లోక్‌సభ సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం ఈసారి 371 స్థానాలకు పెరిగింది. ఓట్ల శాతం కూడా 45 శాతం నుంచి 47.8 శాతానికి పెరిగింది. సీపీఐ 27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 1952తో పోలిస్తే 11 స్థానాలు పెరిగినా ఓట్ల శాతం మాత్రం 32.65 నుంచి 24.55కు క్షీణించింది. కాంగ్రెస్ తర్వాత అధిక స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులే నెగ్గడం విశేషం! వారు 19.3 శాతం ఓటింగ్‌తో 42 స్థానాలు గెలుచుకున్నారు. రాష్ట్రాల స్థాయిలో జనతా, ఫార్వార్డ్ బ్లాక్, గణతంత్ర పరిషత్, అఖిల భారతీయ హిందూ మహాసభ, జార్ఖండ్ పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, ప్రజాపార్టీ, పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పోటీ చేశాయి. సమస్యలు ఎన్నున్నా... నిరుద్యోగం, ఆహార కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదల, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ప్రజల్లో అసంతృప్తి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆశించిన అభివృద్ధి లేకపోవడం, భూ సంస్కరణల నత్తనడక, రాష్ట్రాల్లో పాలనా సామర్థ్యం లోపించడం, ఉత్తరాధి ఆధిపత్యంపై దక్షిణ భారతీయుల్లో ఆగ్రహం... ఇలాంటి పలు సమస్యలను రెండో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీలు బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాయి. ఇన్ని సమస్యలున్నా కాంగ్రెస్‌ను ఢీకొట్టే బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పోటీ ఏకపక్షమేనని ముందే తేలిపోయింది. నెహ్రూ సర్కారుకు ఎన్ని స్థానాలొస్తాయన్నదే కాస్త ఆసక్తి కలిగించిన అంశం. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చన సీట్లలో మూడింట రెండొంతులు ఉత్తరాది చలవే! ఒక్క యూపీయే కాంగ్రెస్‌కు ఏకంగా 70 సీట్లు కట్టబెట్టింది! ఒక స్థానం.. ఇద్దరు ప్రజాప్రతినిధులు బహుళ అభ్యర్థుల నియోజకర్గాలకు చివరి ఎన్నికలుగా 1957 లోక్‌సభ ఎన్నికలు చరిత్రలో గుర్తుండిపోతాయి. 1957లో 91 స్థానాలు ద్వంద్వ నియోజకవర్గాలున్నాయి. జనరల్ కోటా నుంచి ఒకరు, ఎస్సీ/ఎస్టీ కోటా నుంచి ఒకరు చొప్పున ఆ స్థానాల్లో ఇద్దరు విజేతలుండేవారు. ఆ తర్వాత ఈ విధానాన్ని తొలగించారు. 1952 తొలి ఎన్నికల్లోనైతే పశి్చమబెంగాల్లో ముగ్గురు అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఉంది...! వాజ్‌పేయి అరంగేట్రం... దిగ్గజ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 ఎన్నికల్లో నెగ్గి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయనను గొప్ప వక్తగా నెహ్రూ కొనియాడారు. అంతేకాదు, ‘ఏదో ఒక రోజు ప్రధాని అవుతాడు’ అంటూ కచి్చతంగా భవిష్యద్దర్శనం కూడా చేశారు! ఇక, సీఈసీగా వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సుకుమార్ సేన్ 1958 డిసెంబర్ 19న కన్నుమూశారు. విశేషాలు ఎన్నెన్నో ... ► 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు మొత్తం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగాయి. ► ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, బాంబే, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూరు, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, జమ్మూ అండ్ కశీ్మర్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్–మినీకాయ్– మినిందివిల్లో పోలింగ్ జరిగింది. ► మొత్తం 494 లోక్‌సభ స్థానాలకు గాను ఒక్కో చోట సగటు ముగ్గురు అభ్యర్థుల కంటే బరిలో లేరు. ► కాంగ్రెస్ మినహా మరో బలమైన జాతీయ పార్టీ లేనే లేదు. ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. ► జాతీయ స్థాయిలో నాలుగే పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. రాష్ట్రాల్లో మరో 15 పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ► 1957 ఫిబ్రవరి 24 నుంచి జూన్ 9 దాకా మూడున్నర నెలల పాటు ఎన్నికల నిర్వహణ క్రతువు సాగింది. ► ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈసీ ఎంతో కృషి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ► 1952 తొలి ఎన్నికల్లో 44.87 శాతం ఓటింగ్ నమోదవగా 1957లో 45.44 శాతానికి పెరిగింది. 19,36,52,179 మంది ఓటేశారు. ► ఈ ఎన్నికలూ తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్ సారథ్యంలోనే జరిగాయి. ► ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని బాగా తగ్గించడంతో పాటు వాటిని మరింత సమర్థంగా నిర్వహించారాయన. ► దాంతో సుడాన్ తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సేన్‌కే అప్పగించడం విశేషం...! ► పోలింగ్ బూత్‌లను ఆక్రమించే పెడ ధోరణి 1957 ఎన్నికల్లోనే తొలిసారిగా కనిపించింది! -
India First General Elections: ఆరంభం అదిరింది
స్వాతంత్య్రం వచ్చి అప్పటికి ఐదేళ్లు కూడా దాటలేదు. దేశాన్ని కుదిపేసిన విభజన తాలూకు గాయాల పచ్చి ఇంకా ఆరనే లేదు. ఎటు చూసినా ఇంకా బాలారిష్టాలే. పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న అనేకానేక సమస్యలే. వయోజనుల్లో చదవను, రాయను వచి్చన వారి సంఖ్య చూస్తే అతి స్వల్పం. ఇలా... ఒకటా, రెండా! 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలకు ఎటు చూసినా సవాళ్లే. ఇన్ని పెను సవాళ్లనూ విజయవంతంగా అధిగమిస్తూ ఆ ఎన్నికలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. దాంతో... ఇది అయ్యేదా, పొయ్యేదా అంటూ పెదవి విరిచిన ఎంతోమంది పాశ్చాత్య విమర్శకుల నోళ్లు మూతలు పడ్డాయి. తొలి ఎన్నికల ఫలితాలొచ్చేదాకా భారత్ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగానే కొనసాగింది! లార్డ్ మౌంట్‌బాటెన్ గవర్నర్ జనరల్‌గా కొనసాగారు. నెహ్రూ సారథ్యంలోని రాజ్యాంగ సభే మధ్యంతర పార్లమెంటుగా వ్యవహరించింది. ఎందుకంటే స్వాతంత్య్రం సిద్ధించిన కొన్నేళ్ల దాకా ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై ఓ స్పష్టతంటూ లేదు. నియమ నిబంధనలు గానీ విధివిధానాలు గానీ లేవు. అంబేడ్కర్ సారథ్యంలోని డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1949లో ఆమోదం పొంది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చాకే ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓ స్పష్టత ఏర్పడింది. ఆ వెంటనే తొలి ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు మొదలైంది. ఆ క్రమంలో ఎన్నో సమస్యలు. మరెన్నో సవాళ్లు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు పోలింగ్ సిబ్బందిని, సామగ్రిని చేర్చడమైతే పెద్ద యజ్ఞాన్నే తలపించింది. ఇలాంటి అనేకానేక సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. పార్టీలు, అభ్యర్థులకు గుర్తులు పారీ్టలకు గుర్తులు కేటాయించాలని తొలి సార్వత్రిక ఎన్నికలప్పుడే ఈసీ నిర్ణయించింది. ఆలయం, ఆవు, జాతీయ పతాకం, రాట్నం వంటి సున్నితమైన గుర్తులు కాకుండా సులభంగా గుర్తించే ఇతర గుర్తుల వైపు మొగ్గు చూపింది. కాంగ్రెస్ అనగానే గుర్తుకొచ్చే హస్తం గుర్తు ఆ పార్టీకి 1980లో వచి్చంది. 1952లో కాంగ్రెస్ కాడెద్దుల గుర్తుపై పోటీ చేసింది. విడిపోయిన వేళ్లతో కూడిన హస్తం గుర్తు ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ (రుయ్‌కార్ గ్రూప్)కు దక్కడం విశేషం! సోషలిస్ట్ పార్టీకి చెట్టు, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీకి గుడిసె, అఖిల భారతీయ రామరాజ్య పరిషత్‌కు ఉదయించే సూర్యుడు వంటి గుర్తులు దక్కాయి. ఫలితాలిలా... భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో పాటు సోషలిస్టు పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, అఖిల భారతీయ హిందూ మహాసభ వంటి మొత్తం 53 పార్టీలు తొలి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే అనూహ్యమేమీ జరగలేదు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెసే విజయం సాధించింది. 45 శాతానికి పైగా ఓట్లతో 489 స్థానాలకు గాను ఏకంగా 364 చోట్ల నెగ్గింది. దేశ తొలి ఎన్నికైన ప్రధానిగా కూడా నెహ్రూయే నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ 16 స్థానాలు నెగ్గి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అంబేడ్కర్‌కు ఓటమి రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ ఆంబేడ్కర్‌కు తొలి ఎన్నికలు చేదు అనుభవమే మిగిల్చాయి. నార్త్ సెంట్రల్ బోంబే స్థానం నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సహాయకుడే అయిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణసబోద కజ్రోల్కర్ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! సోషలిస్ట్ పార్టీ మద్దతున్నా సీపీఐ అభ్యర్థి డంగే అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశారు. దీనికి నెహ్రూ గాలి తోడవడంతో కజ్రోల్కర్ నెగ్గారు. 1954లో బండారా లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. చివరికి జన్‌సంఘ్ సాయంతో అంబేడ్కర్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ► దేశ తొలి ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్ 25న మొదలైంది. 1952 ఫిబ్రవరి 21 దాకా ఏకంగా నాలుగు నెలల పాటు కొనసాగింది. ► అప్పట్లో మొత్తం 489 లోక్‌సభ స్థానాలుండేవి. ► 17.3 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ► 53 పారీ్టల తరఫున 1,874 మంది బరిలో నిలిచారు. ► అప్పట్లో భారత్‌లో అక్షరాస్యత కేవలం 16.6 శాతమే! ► దేశవ్యాప్తంగా 1,32,560 పోలింగ్ స్టేషన్లు, 1,96,084 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ► ముందుగా హిమాచల్‌ప్రదేశ్‌లో తొలి దశలో పోలింగ్ జరిగింది. ► మొత్తమ్మీద 51 శాతం పోలింగ్ నమోదైంది. 8,86,12,171 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అప్పట్లో ఓటరుగా నమోదయ్యేందుకు కనీస వయో పరిమితి 21 ఏళ్లుగా ఉండేది. ► అప్పటికి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఓటింగ్ ప్రక్రియ 1952 ఎన్నికలు రికార్డులకెక్కాయి. నాటినుంచి నేటిదాకా ఈ రికార్డు భారత్పేరిటే కొనసాగుతూ వస్తోంది. ఒకే ఒక్కడు... తొలి ఎన్నికల క్రతువు దిగ్విజయంగా సాగిందంటే అందుకు ప్రధాన కారకుడు దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయిన ఆయన 1950లో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. అనేక ప్రతికూలతలను అధిగమిస్తూ దేశాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఏకంగా 36 కోట్ల జనాభా, 17 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లు! వారందరికీ ఓటరు కార్డుల జారీ, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్ల వంటి అనేకానేక సవాళ్లను సేన్ విజయవంతంగా ఎదుర్కొన్నారు. 84 శాతానికి పైగా ప్రజలు నిరక్షరాస్యులే కావడంతో వారిని గుర్తించి, ఓటర్లుగా నమోదు చేయించడమే ఓ భారీ యజ్ఞాన్ని తలపించింది. 1951 జనగణన ఆధారంగా లోక్‌సభ స్థానాలను ఖరారు చేశారు. రాజస్తాన్‌లోని జైసల్మేర్, జో«ద్‌పూర్ వంటి ప్రాంతాలకైతే ఎన్నికల సామగ్రి తరలింపునకు ఒంటెలను వాడాల్సి వచ్చింది! డాటరాఫ్, వైఫాఫ్...! ఓటర్ల నమోదు సందర్భంగా ఓ సన్నివేశం అప్పట్లో పరిపాటిగా మారింది. ఎన్నికల సిబ్బందికి తమ పేరు చెప్పేందుకు మహిళలు ససేమిరా అనేవారు. అపరిచితులకు తమ పేర్లను చెప్పేందుకు వారు వెనుకాడేవారు. ఫలానా వారి భార్య అనో, కూతురు అనో మాత్రమే చెప్పేవారు. దాంతో విధిలేక ఓటర్ లిస్టులో వారి పేర్లను కూడా అలాగే నమోదు చేయాల్సి వచి్చంది. కానీ ఇలా పేర్లు లేకుండా ఓటరు కార్డులు జారీ చేసేందుకు ఈసీ నిరాకరించింది. అసలు పేర్లతో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కలి్పంచింది. నాడు 8 కోట్ల మహిళా ఓటర్లు ఉంటే, 20–80 లక్షల మంది తమ అసలు పేర్లను వెల్లడించేందుకు అంగీకరించలేదు. దాంతో వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. నాడు తీసుకున్న నిర్ణయం కఠినమైనదే అయినా, ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు ఢిల్లీ మాజీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చంద్రభూషణ్ కుమార్ పేర్కొనడం గమనార్హం. అభ్యర్థికో బ్యాలెట్ బాక్సు...! 84 శాతం మంది నిరక్షరాస్యులే. దాంతో ఓటేయాల్సిన అభ్యర్థిని వారు గుర్తించడమెలా అన్నది పెద్ద సమస్యగా నిలిచింది. ఒక్కో అభ్యర్థికీ ఒక్కో రంగు బ్యాలెట్ బాక్సు కేటాయించడం ద్వారా దీన్ని అధిగమించారు. ఆ రంగుపైనే సదరు అభ్యర్థి పేరు, గుర్తు ముద్రించారు. ప్రచార సమయంలో ప్రతి అభ్యర్థీ తన బ్యాలెట్ బాక్సు రంగు ఫలానా అంటూ ప్రముఖంగా ప్రస్తావించేవాడు! ఎన్నికలు.. విశేషాలు ► 1993లో మొదటిసారి ఓటర్ ఐడీని ప్రవేశపెట్టారు. ► ఈవీఎం మెషిన్లపై అభ్యర్థుల ఫొటోలను 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెట్టారు. ► నోటా (నన్ ఆఫ్ ద ఎబోవ్/పైన ఎవరూ కాదు) ఆప్షన్‌ను తొలిసారి 2013లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి (ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్) అమల్లోకి తీసుకొచ్చారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నోటా అమలుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాను ఎంపిక చేసుకోవచ్చు. ► దేశ తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎస్. రమాదేవి 1990 నవంబర్ 26 నుంచి 1990 డిసెంబర్ 11 వరకు పనిచేశారు. ► ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 7 జాతీయ పారీ్టలు, 27 రాష్ట్ర పార్టీలు, 2,301 నమోదు చేసుకున్న గుర్తింపు లేని పారీ్టలు ఉన్నాయి. ► 31,83,325 ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా మాల్కాజ్‌గిరి ఉంది. 46,909 మంది ఓటర్లతో లక్షద్వీప్ అతి చిన్న లోక్‌సభ స్థానంగా ఉంది. ► విస్తీర్ణపరంగా 1,73,266 చదరపు కిలోమీటర్లతో లద్దాఖ్ అతిపెద్ద లోక్‌సభ స్థానం. 10 కి.మీ. విస్తీర్ణంతో చాందినీ చౌక్ అతి చిన్న నియోజకవర్గంగా ఉంది. ► లోక్ఐసభకు యూపీ అత్యధికంగా 80 మంది ఎంపీలను పంపుతోంది. అంతేగాక దేశానికి ఎనిమిది మంది ప్రధానులను కూడా అందించింది. ► 2009లో బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి జేడీ (యూ)కు చెందిన రాంసుందర్ దాస్ 88 ఏళ్ల వయసులో గెలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన అతి పెద్ద వయసు్కనిగా రికార్డు సృష్టించారు. ► 2014లో లోక్‌సభ సభ్యునిగా నెగ్గిన అతి పిన్న వయసు్కనిగా (26 ఏళ్లు) దుష్యంత్ చౌతాలా రికార్డులకెక్కారు. హరియాణాలోని హిసార్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ చరిత్ర ఓటు సిరాతో...
1952.. భారతావనిలో తొలి ఎన్నికల పండుగ. అరకొర ఏర్పాట్లు.. చాలీచాలని సిబ్బందితోనే ఎన్నికలు జరిగాయి. రూ.10 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు 15 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలో ఏకపార్టీ ప్రభుత్వాలు సుస్థిర పాలనను అందించగా, ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఆవిర్భావంతో సంకీర్ణాల యుగం మొదలైంది. ఎన్నికల భారతం: అధికార పార్టీ /కూటమి గెలిచిన సీట్లు * ప్రభుత్వాల పదవీ కాలం సంవత్సరాల్లో * ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 1. స్వతంత్ర భారతంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు. ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్పూర్ నుంచి విజయం సాధించిన నెహ్రూ మొదటి ప్రధానిగా పీఠాన్ని అధిష్టించారు. బొంబాయి నుంచి పోటీ చేసిన రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓటమి పాలయ్యారు. 2. ఈ ఎన్నికల ద్వారా ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి గెలుపొందారు. భారతీయ జనసంఘ్ తరఫున యూపీలోని బలరామ్‌పూర్ నుంచి పోటీ చేసి వాజ్‌పేయి తొలిసారి నెగ్గారు. 3. కాంగ్రెస్ 361 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టింది. సీపీఐ 29 సీట్లను గెల్చుకుంది. దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. నెహ్రూ 1964 మేలో కన్నుమూయగా.. తర్వాతి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1966లో మరణించారు. 4. సీట్ల సంఖ్య బాగా తగ్గినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందిర ప్రధాని అయ్యారు. 1969లో కాంగ్రెస్ రెండుగా చీలింది. కాంగ్రెస్ (ఓ-ఆర్గనైజైషన్) నుంచి కాంగ్రెస్ (ఆర్) ఆవిర్భవించింది. 5. మొట్టమొదటి మధ్యంతర ఎన్నికలివి. మొత్తం 518 సీట్లకుగాను కాంగ్రెస్(ఆర్) 352 సీట్లను నెగ్గి వరుసగా ఐదోసారి అధికార పీఠంపై కూర్చుంది. ఇందిర ప్రధాని అయ్యారు. ఆమె ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదంతో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. 1967 ఎన్నికలతో పోలిస్తే 69 సీట్లను అదనంగా గెల్చుకుంది. 6. మూడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పలికిన ఎన్నికలివి. 1975-77 మధ్య 19 నెలలపాటు ఇందిర విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పరాజయానికి కారణమైంది. ఇందిరతోపాటు సంజయ్ ఓటమిని మూటగట్టుకున్నారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ గద్దె నెక్కారు. 7. దేశంలో రెండోసారి జరిగిన మధ్యంతర ఎన్నికలు. ఇందిర నాలుగోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ మద్దతిస్తా మనడంతో 1979లోచరణ్ సింగ్ ప్రధానిగా ప్రమాణం చేశారు. పార్లమెంట్ మొహం చూడకుండానే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 8. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలివి. రాజీవ్‌గాంధీ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో 404 సీట్లు గెల్చుకుని కాంగ్రెస్ విజయం సాధించింది. రాజీవ్ ప్రధాని పీఠమెక్కారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభంజనంతో టీడీపీ 30 స్థానాల్లో నెగ్గింది. 9. రెండోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం కొలువు దీరింది. రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ను బోఫోర్స్ స్కాం దెబ్బతీసింది. 197 స్థానాలే గెల్చుకుంది. వీపీసింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. 10. రామాలయం కోసం రథయాత్ర చేసిన అద్వానీని వీపీ సింగ్ ప్రభుత్వం.. అరెస్టు చేసింది. దీంతో నేషనల్ ఫ్రంట్‌కు బీజేపీమద్దతు ఉపసంహరించు కుంది. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ పగ్గాలు చేపట్టారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చింది. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. 11.ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కలేదు. బీజేపీ 161 ఎంపీ స్థానాలు గెల్చుకుంది. పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజులకే వాజ్‌పేయి గద్దె దిగారు. తర్వాత దేవెగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు ఏర్పడ్డా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. 12. ఈ ఎన్నికల తర్వాత వాజ్‌పేయి ప్రధాని పీఠమెక్కారు. ఎన్డీయే నుంచి అన్నా డీఎంకే వైదొలగడంతోఅవిశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది. వాజ్‌పేయి 13 నెలలే ప్రధానిగా ఉన్నారు. 13. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం బీజేపీకి కలిసొచ్చింది. ఎన్డీఏ కూటమికి 299 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు 139 సీట్లు వచ్చాయి. థర్డ్‌ఫ్రంట్ 41 సీట్లతో సరిపెట్టుకుంది. వాజ్‌పేయి సర్కారు 6 నెలల ముందే ఎన్నికలకు వెళ్లింది. 14. కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. మన్మోహన్సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పీవీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన రెండో వ్యక్తి మన్మోహన్ సింగ్. 15. యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. కాంగ్రెస్ 206 సీట్లు (28.6% ఓట్లు), బీజేపీ 116 సీట్లు(18.8% ఓట్లు) గెల్చుకున్నాయి.ఈ ఎన్నికల్లో మొత్తం 71.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా 41.70 కోట్ల ఓట్లు పోలయ్యాయి.