అంగన్వాడీల్లో వేయింగ్ మెషీన్లు
విజయవాడ: అంగన్వాడీల్లో ఎలక్టాన్రిక్ వేయింగ్ మిషన్లు æ ద్వారా నమోదు చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ బాబు. ఎ తెలిపారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ చక్రవర్తి, కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకుగాను వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఎ¯ŒSఐసీ అధికారులను కోరారు. ఎత్తు, వయస్సకు తగ్గ బరువులను కచ్చితమైన ప్రమాణాలతో నమోదు చేసిడివైజ్ నుంచి సర్వర్‌కు అనుసంధానించాలని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో 100 అంగన్వాడీల్లో
వాడీ కేంద్రాల్లో తక్షణమే ప్రవేశ పెడతామని వెల్లడించారు. అంగన్వాడీకేంద్రం సమీపంలోనే చౌకధరల దుకాణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో కాన్పరె¯Œ్సలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శివపార్వతి, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె. కృష్ణకుమారి, డీఎస్వో రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.