వచ్చే నెలలో భారత్ - ఇంగ్లాండ్ స్నేహ సంబంధ వేడుక
ప్యారిస్, న్యూస్‌లైన్: భారత్, ఇంగ్లాండ్ మధ్య స్నేహం మెరుగుపడేలా చెన్నైలో వచ్చే నెలలో ‘ది గ్రేట్ బ్రిటీష్ వేడుక’ పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నామని కొత్తగా నియమితులైన దౌత్యాధికారి భరత్ జోషి వెల్లడించారు. భరత్ జోషి భారత సంతతికి చెందిన వారు. ఆయన దక్షిణ భారతదేశానికి ఇంగ్లాడ్ దౌత్యాధికారిగా నియమితులయ్యా రు. ఈ పదవిలో భారత సంతతికి చెందిన వారు నియమితులుకావడం ఇదే తొలిసారి. ఇటీవల చెన్నైలో ఉన్న బ్రిటీష్ దౌత్య కార్యాలయంలో భరత్ జోషి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లాండ్‌కు, భారత్‌కు మధ్య స్నేహం కొనసాగుతోందని తెలిపారు. భారత సంతతికి చెందిన తనను ఇంగ్లాండ్ దేశ దౌత్యాధికారిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు.
భారత్‌కు చెందిన 40 వేల మంది విద్యార్థులు ఇంగ్లాండ్‌లోని పలు యూనివర్సిటీలలో చదువుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యాపా రం, పర్యాటకం అంటూ పలు కారణాల వల్ల భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు వచ్చే వారి కోసం వీసా అందించే పద్ధతులను సులభతరం చేసినట్టు తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే వీసా అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇంగ్లాండ్, భారత్ స్నేహ పటిష్టంగా ఉండేలా ది గ్రేడ్ బ్రిటీష్ వేడుక పేరుతో ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ వేడుక డిసెంబర్ 11వ తేదీ చెన్నై శాంతోమ్ ఎంఆర్సీ నగర్లో ఉన్న ప్రముఖ హోటల్ లో చేపడుతున్నామని వెల్లడించారు. ఈ వేడుకలో వ్యాపారవేత్తలు, విద్యాశాఖ అధికారులతోపాటు పలువురు పాల్గొననున్నారన్నారు. ఈ వేడుకల్లో ఇం గ్లాండ్ రకరకాల ఆహార పదార్థాలు, అక్కడి సాం స్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.