హీరోయిన్ కోసం వెయిటింగ్!
‘అత్తారింటికి దారేది’ సినిమా మరో మూడు రోజుల్లో వంద రోజులు పూర్తి చేసుకోబోతోంది. కానీ ఇంతవరకూ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది ఇప్పటికే శక్తిమంతమైన స్క్రిప్టు సిద్ధం చేశారు. ‘గబ్బర్ సింగ్’కి ఇది సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌కి సన్నిహితుడైన శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకునిగా, జయనన్ విన్సెంట్ ఛాయాగ్రాహకునిగా ఖరారయ్యారు. ఒక్క కథానాయిక మినహా ఇతర తారాగణం, సాంకేతిక బృందం ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసింది. సరైన కథానాయిక కోసం చిత్రబృందం గత కొంతకాలంగా తలమునకలై ఉంది. మొదట్లో పాపులర్ బాలీవుడ్ కథానాయికల పేరు వినిపించింది కానీ, కొత్త హీరోయిన్ కోసమే అన్వేషిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ముంబైలో ఆడిషన్స్ జరుగుతున్నాయి.