గజవాహనంపై ఆదిదంపతులు
- కాళరాత్రి రూపంలో భ్రామరి
శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు కాళరాత్రిరూపంలో దీవెనలు అందించారు. శ్రీశైలమల్లన్న దేవేరి భ్రామరితో కలిసి గజవాహనాన్ని అధిష్టించి విశేషపూజలందుకున్నారు. అక్కమహదేవి అలంకార మండపంలో అమ్మవారి అలంకార రూపాన్ని గజవాహనంపై అధిష్టించిన స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలను నిర్వహించిన అనంతరం మూడుమార్లు ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడంతో వాన పడుతుందనే ఉద్దేశంతో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. దీంతో ఉత్సవం ఆలయప్రదక్షిణకే పరిమితమైంది.