షాక్కు గురయ్యాను: కేటీఆర్
హైదరాబాద్: నగరంలో శుక్రవారం గాలివానం సృష్టించిన బీభత్సంపై తాజాగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. 'దాదాపు 12 గంటల క్రితం అమెరికా చేరుకున్నాను. హైదరాబాద్లో గాలివానం తీవ్ర బీభత్సం సృష్టించిందని తెలుసుకొని షాక్కు గురయ్యాను. జీహెచ్ఎంసీతోపాటు, ఇతర విభాగాలు నగరంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి తమ శాయశక్తులా కృషిచేస్తున్నాయి' అని ఆయన ట్వీట్ చేశారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ పునరుద్ధరించలేదని తెలిసిందని, ఆ ప్రాంతాల్లో త్వరలోనే పునరుద్ధరిస్తామని కేటీఆర్ అన్నారు. ఎమర్జెన్సీ డయల్ నంబర్ 100 పనిచేయడం, దానికి గవర్నర్ ఉపయోగించుకోవడం ఆనందం కలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు.
Reached US about 12 hours ago. Shocked to learn about gale & rain wreaking havoc in Hyderabad. @GHMCOnline & other depts trying best
— KTR (@KTRTRS) 21 May 2016