Gangappa
-
తూమకుంటలో 30 గొర్రెలు అపహరణ
హిందూపురం రూరల్ : మండలంలోని తూమకుంట గ్రామ శివార్లలో నివాసం ఉంటున్న గంగప్పకు చెందిన గొర్రెలను అపహరించుకొని వెళ్లినట్లు బాధితుడు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెల రొప్పానికి ఉన్న తలుపును పగులకొట్టి అందులో ఉన్న 25 గొర్రెలు, ఐదు మేకలను ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. సుమారు రూ.1.5 లక్షలు న ష్టం జరిగినట్లు ఆవేదన చెందాడు. పోలీసులు ఆచూకీ కనుగొని తనకు న్యాయం చేయాలని కోరాడు. -
వ్యక్తిపై వేట కొడవలితో దాడి
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతోఓ వ్యక్తి మరో వ్యక్తిపై వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన అనంత జిల్లా హిందూపురం బస్టాండ్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వివరాలు.. హిందూపురం మండలం గుడ్డెంనాగేపల్లి గ్రామానికి చెందిన నర్సింహమూర్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి వలస వచ్చి మగ్గం పనులు చేసుకుంటూ బతుకుతున్న గంగప్ప అనే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నాడు. దీంతో ఆగ్రహించిన గంగప్ప... హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిల్చొని ఉన్న నర్సింహమూర్తి పై వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేస్తున్నారు. -
భార్యాపిల్లలను హతమార్చి...
కోలారు:వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని బలిగొంది. వృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు... తాలూకాలోని కామధేనుహళ్లికి చెందిన గంగప్ప(30), దీప(24) దంపతులు. వీరికి నేహ(5), ప్రీతమ్(2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైన్యంలో పనిచేస్తున్న గంగప్ప, తన భార్యపిల్లలను గ్రామంలోనే వదిలి వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీప తన పక్కింటిలో ఉన్న కాలేజీ విద్యార్థితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ పెద్దలు ఆమెను కొన్ని రోజుల పాటు పుట్టినింటికి(బంగారు పేట తాలూకా కీలు కొప్ప) పంపారు. మూడు రోజుల క్రితం సెలవుపై గంగప్ప వచ్చాడు. బంగారుపేటకు వెళ్లి భార్యాపిల్లలను పిలుచుకుని వచ్చాడు. తన భార్య వివాహేతర సంబంధం తెలుసుకున్న అతను శనివారం రాత్రి భార్యాపిల్లల గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రెండు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ అజయ్ హిలోరి తెలిపారు.