తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతోఓ వ్యక్తి మరో వ్యక్తిపై వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన అనంత జిల్లా హిందూపురం బస్టాండ్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
వివరాలు.. హిందూపురం మండలం గుడ్డెంనాగేపల్లి గ్రామానికి చెందిన నర్సింహమూర్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి వలస వచ్చి మగ్గం పనులు చేసుకుంటూ బతుకుతున్న గంగప్ప అనే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నాడు. దీంతో ఆగ్రహించిన గంగప్ప... హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిల్చొని ఉన్న నర్సింహమూర్తి పై వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేస్తున్నారు.
వ్యక్తిపై వేట కొడవలితో దాడి
Published Sat, Jan 2 2016 12:34 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement