'నిమిషంలోపే 4 టైర్లనూ మార్చేశారు'
కారు టైరును మార్చాలంటే ఎంత సమయం పడుతుంది? ఐదు నిమిషాలా? లేక పది నిమిషాలా? ఇక నాలుగు టైర్లను మార్చాల్సి వస్తే ఎంత సమయం తీసుకుంటారు? జర్మన్ టీమ్ మాత్రం చిటికెలో కాదు కాని నిమిషంలోపే నాలుగు టైర్లు మార్చి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
జర్మనీకి చెందిన నలుగురు మెకానిక్‌లు కలసి హ్యాండ్ టూల్స్‌తో 59.62 సెకన్లలో నాలుగు టైర్లనూ అమర్చారు. ప్రపంచంలో వేగంగా కారు టైర్లను మార్చిన రికార్డును సృష్టించారు. గతంలో ఉన్న (1:23:85) రికార్డును బద్దలు కొట్టారు. అంటే ఈ రికార్డు కంటే 24 సెకన్ల వేగంగా కారు టైర్లను మార్చారు. కారు విడిభాగాలను సప్లై చేసే ఓ సంస్ధ ఈ టీమ్‌ను స్పాన్సర్ చేసింది.