GG Krishna Rao
-
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు (87) మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన జీజీ కృష్ణారావు చెన్నై నుంచి సినీ ప్రయాణాన్నిప్రారంభించారు. ఎడిటర్‌గానే కాదు.. అసోసియేట్ డైరెక్టర్,ప్రొడక్షన్ డిజైనర్‌గానూ పని చేశారాయన. బాపు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ఎందరో ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్‌గా చేశారాయన. ‘శంకరాభరణం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ’ వంటి దాదాపు 300 సినిమాలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు కృష్ణారావు. డైరెక్టర్ కె. విశ్వనాథ్‌తో కృష్ణారావుకు మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలకు కృష్ణారావు పని చేశారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సప్తపది’కి కృష్ణారావు తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా నుంచే ఎడిటింగ్ విభాగంలో నంది అవార్డు ఇవ్వడంప్రారంభమైంది. అనంతరం ‘సాగర సంగమం, శుభ సంకల్పం’ చిత్రాలకు కూడా నంది అవార్డులు సొంతం చేసుకున్నారాయన. కృష్ణారావుకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బెంగళూరులోని తన కుమార్తె వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. జీజీ కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘ఎడిటింగ్ శాఖకు గౌరవాన్ని తెచ్చిన వారిలో కృష్ణారావుగారు ఒకరు. ఆయన మరణంతో తెలుగు ఫిలిం ఎడిటర్స్ ఒక పెద్ద దిక్కును కోల్పోయారు’’ అని తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె. వెంకటేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారకరత్న మరణాన్ని మరవకముందే మరో సినీ దిగ్గజం కన్నుమూయడం విచారకరం. టాలీవుడ్లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్ పని చేసిన జీజీ కృష్ణారావు(87) ఈ రోజు ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా జీజీ కృష్ణారావు పలు భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగులో దాసరి నారాయణరావు, కళాతపస్వి కె విశ్వనాథ్, బాపు, జంధ్యాల వంటి దిగ్గజ దర్శకుల సినిమాలకు పని చేసి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. కె విశ్వనాథ్ క్లాసికల్ హిట్స్ ‘‘శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభలేఖ, శృతి లయలు, సిరివెన్నెల, శుభ సంకల్పం, స్వరాభిషేకం’’ సినిమాలకు ఎడిటర్‌గా చేసిన అనుభవం ఆయన సొంతం. అలాగే దర్శక రత్న దాసరి నారాయణ రావు ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలకు కూడా పని చేశారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలతో ఆయన ఆస్థాన ఎడిటర్ అని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలతో పాటు కళాత్మక చిత్రాలకు కూడా ఎడిటింగ్ చేసి శభాష్ అనిపించుకున్నారు ఆయన. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం