జీహెచ్ఎంసీ న్యూస్ !
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి ఫలితాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేం దుకు టీవీ చానల్‌ను వేదికగా చేసుకోవాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతి ఆదివారం రాత్రి ‘జీహెచ్ఎంసీ న్యూస్’ పేరిట ఒక బులెటిన్‌ను రన్ చేయాలని, ఇందుకు ఆయా న్యూస్ చానళ్ల నుంచి ఆర్‌ఎఫ్‌సీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో జరిగే కార్యక్రమాల సమాహారం‘రౌండప్’లా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నారు.
ముఖ్యంగా విశ్వనగరం దిశగా హైదరాబాద్ అనే థీమ్‌తో దీని ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8 గం టల నడుమ దీనిని నిర్వహిస్తే ఎక్కువమంది వీక్షించగలరని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యక్రమాలను వివిధ న్యూస్ చానళ్లు ప్రముఖంగానే ప్రసారం చేస్తున్నప్పటికీ, తాము చెప్పదలచుకున్నది మరింత స్పష్టంగా ప్రజ లకు చేరవేసేందుకు ఈ జీహెచ్ఎంసీ న్యూస్ బులెటిన్ ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు.
కాగా ఈ బులెటిన్ మధ్య విరామం లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు వినియోగించరాదని భావిస్తున్నారు. వాటి బదుల పర్యావరణం, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై ప్ర జలకు అవగాహన కలిగించే, పౌరస్పృహను పెంచే కార్యక్రమాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ‘జీహెచ్ఎంసీ న్యూస్’ ఆలోచన ఉన్నప్పటికీ అమలుకు ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పలేమని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు.