Gmail
-
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్‌డౌన్! నిజమేనా?
ప్రపంచవ్యాప్తంగా చాలామందికి జీమెయిల్ లాగిన్ చేయడంతోనే రోజు ప్రారంభమవుతుంది. మరి కొందరు రోజుకు ఒక్కసారైనా జీమెయిల్ చూస్తుంటారు. అలాంటి జీమెయిల్ సర్వీస్ త్వరలో నిలిచిపోనున్నట్లు నెట్టింట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది యూజర్స్ ఆందోళనకు గురయ్యారు. గూగుల్ కంపెనీ దీనిపై స్పందిస్తూ.. జీమెయిల్ యూజర్స్ భయపడాల్సిన అవసరం లేదని, కేవలం HTML ఫీచర్ మాత్రమే నిలిచిపోనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ గత సెప్టెంబర్‌లోనే ధ్రువీకరించింది. జీమెయిల్ సర్వీసు నిలిచిపోనున్నట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దంటూ సంస్థ అధికారికంగా వెల్లడించింది. Gmail is here to stay. — Gmail (@gmail) February 22, 2024 నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లోనే జీమెయిల్ సర్వీసులో HTML ఫీచర్ నిలిపివేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు, ఇదే స్టాండర్డ్ వ్యూకు మారుతుందని సంస్థ స్పష్టం చేసింది. గూగుల్ సర్వీస్ మరింత మెరుగుపడాలనే ఉద్దేశ్యంతోనే కంపెనీ చిన్న అప్డేట్స్ జోడించనున్నట్లు, అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం జీమెయిల్ పనిచేయకపోవడం అనేది ఉండదని, సంబంధిత అధికారులు ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలిపింది. ఇదీ చదవండి: దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా.. this is insane. I hate this company pic.twitter.com/pXBRezPAyX — Daniel (@growing_daniel) February 22, 2024 -
రిస్క్‌లో లక్షలాది జీమెయిల్ అకౌంట్లు.. డిలీట్ చేయనున్న గూగుల్!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గూగుల్ అకౌంట్లు రిస్క్‌లో ఉన్నాయి. తరచుగా ఉపయోగించని లక్షలాది అకౌంట్లను గూగుల్ వచ్చే డిసెంబర్లో తొలగించనుంది. ఇనాక్టివ్ అకౌంట్లు తొలగించే ప్రక్రియలో భాగంగా గత రెండేళ్లుగా ఉపయోగించని అకౌంట్లను గూగుల్ డిలీట్ చేయనుంది. గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రుత్క్రిచెలీ దీని గురించి గత మే నెలలోనే బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. రిస్క్‌ను తగ్గించడంలో భాగంగా రెండేళ్లకు పైగా వినియోగంలో లేని అకౌంట్లను తొలగించేలా గూగుల్ అకౌంట్ల ఇనాక్టివిటీ పాలసీని అప్డేట్ చేస్తున్నట్లు వివరించారు. దీని ప్రకారం.. రెండేళ్లకు పైగా ఉపయోగించని గూగుల్ అకౌంట్లు డిలీట్ కానున్నాయి. అంటే ఆయా అకౌంట్లకు సంబంధించిన జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్‌తోపాటు గూగుల్ ఫొటోలు కూడా డిలీట్ అయిపోతాయి. అలాంటి అకౌంట్లతో ముప్పు గూగుల్ అకౌంట్ యూజర్ల తరచూ తమ అకౌంట్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పుడప్పుడు రెండంచల వెరిఫికేషన్ చెక్‌ను గూగుల్ అనుసరిస్తూ ఉంటుంది. ఇలా ధ్రువీకరించని అకౌంట్ల ద్వారా ముప్పు ఉండే అవకాశం ఉంటుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే తొలగింపు వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తించనుంది. స్కూళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. వెంటనే యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ గూగుల్ అకౌంట్లు ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఇలా ఎక్కువ అకౌంట్లను క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత వాటి గురించి మరచిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అకౌంట్లన్నీ డిలీట్ కాబోతున్నాయి. అలా కాకూడదంటే వాటిని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఆయా అకౌంట్లను ఉపయోగించి ఈమెయిల్ చేయడం, గూగుల్ డ్రైవ్ ఉపయోగించడం, యూబ్యాబ్ వీడియోలు చూడటం, గూగుల్ ప్లే స్టోర్ యాప్‌ను డౌన్లోడ్ చేయడం, గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా సంబంధిత అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవచ్చు. -
గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్‌బాట్‌ను గూగుల్‌కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్టెన్షన్స్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ ప్లాట్‌ఫాం చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను గూగుల్ రూపొందించింది. -
జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్!
మీకు జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయా.. క్రియేట్ చేసి చాలా కాలం అవుతోందా.. తరచూ ఉపయోగించడం లేదా.. అయితే ఆ అకౌంట్లు త్వరలో డిలీట్ అయ్యే అవకాశం ఉంది. మనలో చాలా మందికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కొంత మంది అవసరంకొద్దీ రెండు.. మూడు.. ఇలా లెక్కకు మించి జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ అకౌంట్లను ఒకసారి కూడా ఓపెన్ చేయరు. రెండేళ్లకుపైగా ఉపయోగంలో లేని అలాంటి ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ త్వరలో డిలీట్ చేయనుంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు సంబంధించి గూగుల్ కొత్త విధానాలను ప్రకటించింది. ప్రతి 24 నెలలకు ఒకసారి లాగిన్ అవ్వాలని, పాత గూగుల్ అకౌంట్లను సమీక్షించాలని యూజర్లను కోరింది. రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేయని అకౌంట్లలో స్టోర్ అయిన డేటా డిలీట్ అయ్యేలా ఇప్పటికే గూగుల్ ఒక విధానాన్ని కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని పూర్తిగా తమ సర్వర్ల నుంచి డిలీట్ చేయనుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గూగుల్ అకౌంట్ల కోసం ఇన్‌యాక్టివ్ విధానాన్ని మరో రెండేళ్లకు అప్డేట్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. యూట్యూబ్, గూగుల్ ఫొటోస్పైనా ప్రభావం కొత్త విధానం డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుందని ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్, గూగుల్ ఫోటోస్ సహా ఇనాక్టివ్ అకౌంట్లలో స్టోర్ మొత్తం మొత్తం కంటెంట్ తొలగించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు 2020లో ప్రకటించిన విధానం ప్రకారం.. ఇనాపరేటివ్ అంకౌంట్లలోని కంటెంట్‌ను మాత్రమే తొలగించేది. ఇప్పుడు తీసుకొచ్చిన విధానంలో అకౌంట్లను కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ విధానం వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు లేదా వ్యాపార సంస్థల అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని గూగుల్ పేర్కొంది. తొలగించే ముందు నోటిఫికేషన్లు ఉపయోగంలో లేని అకౌంట్లను గూగుల్ దశలవారీగా తొలగిస్తుంది. మొదటగా డిసెంబర్లో ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అకౌంట్ క్రియేట్ చేసి తర్వాత ఎప్పుడూ ఉపయోగించని అకౌంట్లను తొలి విడతలో తొలగించనుంది. ఇలా తొలగించే ముందు ఆ అకౌంట్లకు, దానికి సంబంధించి పేర్కొన్న రికవరీ అకౌంట్లకు నోటిఫికేషన్లు పంపుతుంది. కాబట్టి మీకు గూగుల్ అకౌంట్ ఉండి తరచూ ఉపయోగించకపోతే వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్‌తో ఇలా చేయండి!
బొత్తిగా అక్కర్లేని ఇ–మెయిల్స్ వస్తూనే ఉంటాయి. వాటి మానాన అవి పడి ఉంటాయిలే...అనుకోవడానికి లేదు. ఫ్రీ స్టోరేజ్ స్పేస్ నిండిపోతే సమస్య! ఈ నేపథ్యంలో వాటిని డిలీట్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. మాన్యువల్‌గా పాత ఇ–మెయిల్స్‌ను వన్–బై వన్ సెలెక్ట్ చేసుకొని, డిలీట్ చేయడం కష్టం అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకే టైమ్‌లో ఎక్కువ మొత్తంలో ఇ–మెయిల్స్‌ను డిలీట్ చేయడానికి ఒక ఫిల్టర్‌ను సెట్ చేసుకోవాలి. సెర్చ్బార్లో ఇ–మెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాక ‘ఆల్’ ట్యాబ్‌ను సెలెక్ట్ చేసుకొని ‘డిలీట్’ ఐకాన్‌ను నొక్కాలి. ఇక లార్జ్ ఇ –మెయిల్స్ డిలీట్ చేయడానికి... ►జీమెయిల్ ఓపెన్ చేసి ‘ఎటాచ్మెంట్ లార్జర్: 10ఎమ్’ అని టైప్ చేయాలి. ►లార్జ్ ఇ– మెయిల్ ‘మెయిల్ బాక్స్’లో కనిపిస్తాయి. ►వీటిని సెలెక్ట్ చేసుకొని, ముఖ్యమైనవి, డిలీట్ వద్దనుకుంటున్నవి ‘అన్మార్క్’ చేయాలి ►డిలీట్ బటన్ నొక్కాలి. ►‘ఎంప్టీ ట్రాష్’ బటన్ నొక్కాలి. -
వావ్! గూగుల్ యూజర్లకు శుభవార్త!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఇంటర్నెట్తో అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో జీ మెయిల్‌ను ఉపయోగించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. జీమెయిల్. పరిచయం అక్కర్లేని పేరు. గూగుల్‌కు చెందిన ఈమెయిల్ సర్వీస్‌ను 18శాతం ఈమెయిల్ క్లయింట్ మార్కెట్ షేర్‌తో గతేడాది 1.8 బిలియన్ల మందికిపై గా వినియోగించారు. 75శాతం మందికి పైగా వినియోగదారులు స్మార్ట్ఫోన్లలో జీమెయిల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ తరుణంలో రూరల్ ఏరియాలు, నెట్ స్లోగా ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీమెయిల్‌ను ఆఫ్ లైన్లో వినియోగించుకోవాలంటే ♦ముందుగా జీమెయిల్ సెట్టింగ్ ఆప్షన్లో ట్యాప్ చేయాలి. ♦కాగ్ వీల్ బటన్ పై క్లిక్ చేసి అందులో సీ ఆల్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ♦మీరు ఆన్లైన్లో ఉంటే అక్కడ ఆఫ్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦అనంతరం చెక్ బాక్స్ ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ క్లిక్ చేయండి. ♦మీరు చెక్ బాక్స్ ను క్లిక్ చేసిన మరుక్షణం, జీమెయిల్ కొత్త సెట్టింగ్ లను చూపుతుంది. ♦ఆ సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తే జీమెయిల్ ఆఫ్‌లైన్ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. -
మీ ఫోన్లో యాప్స్ డిలీట్ చేసిన తర్వాత ఈ పని చేస్తున్నారా!
సాధారణంగా మన అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటుంటాం. వాటితో మన అవసరం తీరిపోయిన వెంటనే డిలీట్ చేస్తాం. కానీ యాప్స్ డిలీట్ చేసినా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కొన్నిసార్లు ఇరిటేషన్ తెప్పిస్తుంటాయి. అరె! యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసినా నోటిఫికేషన్లు ఎందుకొస్తున్నాయని కంగారు పడిపోతుంటాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే యూజర్లు యాప్స్ డిలీట్ చేసిన వెంటనే ఇంకో పనిచేయాల్సి ఉంటుంది. అదేంటంటే! స్మార్ట్ ఫోన్‌కి జీమెయిల్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. మరి యాప్స్ డిలీట్ చేస్తే..ఆ యాప్స్‌కు అటాచ్ అయిన జీమెయిల్ అకౌంట్ డిస్ కనెక్ట్ అవుతుందని అనుకుంటాం. కానీ అలా జరగదు. దీంతో ఈజీగా జీమెయిల్లో ఉన్న మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది. అందుకే యాప్స్‌ను అన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మ్యాన్యువల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్‌కు కనెక్ట్ అయిన జీమెయిల్ అకౌంట్‌ను డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో యాప్స్‌కు కనెక్టైన జీమెయిల్‌ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ►ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి ►అనంతరం సెట్టింగ్‌లో ఉన్న గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి ►గూగుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద భాగంలో సెట్టింగ్స్ పర్ గూగుల్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే కనెక్టెడ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ కనెక్టెడ్ యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ యాక్టీవ్‌గా జీ మెయిల్‌కు ఏ యాప్స్ అటాచై ఉన్నాయో తెలుస్తోంది. వెంటనే ఆ యాప్స్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అకౌంట్‌ను డిస్ కనెక్ట్ చేసుకోవచ్చు. -
గూగుల్ సెట్టింగ్స్‌లో ఈ మార్పు చేస్తే మీ ఖాతా మరింత భద్రం..!
గూగుల్ అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది జీమెయిల్, వెబ్ బ్రౌజింగ్ ఇవేకాకుండా డ్రైవ్ స్టోరేజ్, వీడియో కాలింగ్, మెసేజింగ్, మ్యాప్స్, ఫొటోస్, క్యాలెండర్, కాంటాక్ట్స్, యూట్యూబ్, షాపింగ్, న్యూస్ ఇలా ఎన్నో రకాల సేవలను గూగుల్ అందిస్తోంది. అయితే, ఈ సేవలన్నీ అందించడానికి మనం కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఇచ్చే పేరు, ప్రొఫైల్ ఫొటో, మెయిల్ ఐడీ, పుట్టిన తేది, జెడర్,ఉద్యోగం, నివసించే ప్రాంతం వంటి వివరాలు ఇతర యూజర్లకు కనిపించే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు మనం మన వ్యక్తి గత వివరాలను ఇతరులకు కనిపించకుండా చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ మీ సమాచారం కనిపించదు. మీ వివరాలను ఇతరులు చూడకుండా ఉండటానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదట పీసీ/కంప్యూటర్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు దానిపై క్లిక్ చేస్తే మేనేజ్ యవర్ గూగుల్ అకౌంట్ అనే అప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేస్తే గూగుల్ ఖాతా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ మీ ఇన్ఫో సెక్షన్‌పై క్లిక్ చేస్తే చూజ్ వాట్ అథర్స్ సీ అనే ఆప్షన్ ఓపెన్ చేయాలి. అందులో అబౌట్ మీ లపై క్లిక్ చేస్తే యాడ్(Add), ఎడిట్, రిమూవ్ అనే ఆప్షన్లు ఉంటాయి. మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఏదైనా సమాచారం అదనంగా చేర్చాలన్నా, ఉన్నది తొలగించాలన్నా, పేరులో మార్పులు చేయాలన్నా వాటిపై క్లిక్ చేసి మారిస్తే సరిపోతుంది. మీ సమాచారం ఎవరికి కనబడకూడదు అనుకుంటే Only Me అనే ఆప్షన్ ఎంచుకోవాలి. (చదవండి: బీజీఎంఐ గేమ్ ఆడి రూ.12.5 లక్షలు గెలుచుకున్న కుర్రాళ్లు..!) -
జీమెయిల్ సరికొత్త రికార్డు..! ప్రపంచజనాభా కంటే ఎక్కువగా..!
గూగుల్ రూపొందించిన ఈ-మెయిల్ సర్వీస్ జీ మెయిల్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అత్యధికంగా ఇన్స్టాల్ఐనా నాల్గవ యాప్‌గా జీ-మెయిల్ నిలిచింది. 10 బిలియన్ల మైలు రాయి..! ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోజీమెయిల్ యాప్ 10 బిలియన్(1000 కోట్ల) ఇన్‌స్టాల్‌లను సాధించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్లకు పైగా ఇన్స్టాల్ఐనా మైలురాయిని గూగుల్‌కు చెందిన మరో మూడు యాప్స్ గూగుల్ ప్లే సర్వీసెస్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ నిలిచాయి. ఇక్కడ విశేషమేమిటంటే ప్రపంచ జనాభా కంటే అధికంగా యాప్స్ డౌన్లోడ్స్ జరిగాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో..! జీమెయిల్ పేరుతో ఈమెయిల్ సేవలను గూగుల్ ఏప్రిల్ 2004 ప్రారంభించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ భారీ ఆదరణను సాధించింది. కాలానుగుణంగా జీమెయిల్ అత్యధిక సంఖ్యలో అద్బుతమైన ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మీట్స్‌ను యాప్‌కు జోడించింది. అంతేకాకుండా యూజర్లు ఆడియో, వీడియో కాల్స్‌ను చేసుకునే ఫీచర్నుకు అందుబాటులోకి తెచ్చింది జీమెయిల్. చదవండి: ఓలాపై ‘గుత్తాధిపత్య ధరల’ ఆరోపణలు కొట్టివేత -
మొన్న ఫేస్బుక్ డౌన్..! ఇప్పుడు జీ మెయిల్..!
Gmail Services Down In India: ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో జీమెయిల్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జీమెయిల్ సేవలు డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటలనుంచి జీమెయిల్ సేవలు పనిచేయడం లేదంటూ ట్విటర్ వేదికగా యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! ఊక్లాకు చెందిన డౌన్ డిటెక్టర్ వెబ్సైట్లో సుమారు 68 శాతం మంది యూజర్లు జీమెయిల్ పనిచేయడం లేదంటూ రిపోర్ట్ చేశారు. 18 శాతం యూజర్లు సర్వర్ సమస్యలను, 14 శాతం మంది యూజర్లకు లాగిన్ సమస్యలు తలెత్తిన్నట్లు డౌన్ డిటెక్టర్‌లో వెల్లడించింది. కొంత మంది యూజర్లు #GmailDown పేరిట ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా నిలిచిపోయిన జీమెయిల్ సేవలపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. గూగుల్ ఈ సమస్యలకు పరిష్కారం వెంటనే గూగుల్ చూస్తోందని యూజర్లు భావిస్తున్నారు. #gmaildown Sending or receiving mails is being difficult for the past hour. — M.r Kamessh (@Rkamesh97) October 12, 2021 🔔 #Gmail down? 🔗 Real-time status: https://t.co/zJn0p8lynr 🔁 RETWEET if you are affected too.#GmailDown #GmailOutage (Possible problems since 2021-10-12 04:37:05) — Services Down (@servicesdown_) October 12, 2021 చదవండి: ముంచుకొస్తున్న సౌర తుఫాన్..! అదే జరిగితే అంధకారమే...! -
యూజర్లకు భారీ ఊరట..! జీ-మెయిల్లో ఆ సమస్యకు చెక్‌పెట్టనున్న గూగుల్..!
Gmail Rolling New Feature: నేటి టెక్నాలజీ యుగంలో ఉత్తరాలు, ఇన్ల్యాడ్ లెటర్స్ పూర్తిగా మరుగనపడిపోయాయి. వాటిస్ధానంలో జీ-మెయిల్ పూర్తిగా భర్తీ చేసింది. పలు కార్పోరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సేవలను అందించే యాప్స్ కూడా పూర్తిగా మెయిల్స్‌తోనే ప్రత్యుత్తరాలను జరుపుతున్నాయి. మనలో చాలా మంది జీ-మెయిల్ సేవలను వాడుతున్న వాళ్లమే...! చదవండి: మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే.. జీ-మెయిల్‌ను మెరుగుపర్చడం కోసం పలు ఫీచర్స్‌తో గూగుల్ ఎప్పటికప్పుడు ముందుకు వస్తోంది. కొద్ది రోజుల క్రితం జీ-మెయిల్ యాప్‌లో గూగుల్‌మీట్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో జీ-మెయిల్‌తో నేరుగా గూగుల్ మీట్ యాప్ లేకుండానే పాల్గొనే సదుపాయాన్ని గూగుల్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా జీ-మెయిల్లో మరో సూపర్ ఫీచర్‌ను గూగుల్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. సెర్చ్‌చేయడం మరింత సులువు..! మనకు కావాల్సిన ఫలానా ఈ-మెయిల్‌ను వెతకడం కోసం ఏం చేస్తాం..! సింపుల్‌గా జీ-మెయిల్లో మనకు కావాల్సిన దాని గురించి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే.. మనకు ఆయా అంశానికి సంబంధించిన సజెషన్స్ను జీ-మెయిల్ చూపిస్తోంది. ఇక్కడ సరైన టర్మ్‌తో వెతికినా, ఒక వేళ నిర్థిష్టమైన మెయిల్‌తో వెతికితే మనకు వెంటనే సెర్చ్ రిజల్ట్స్‌ను కన్పిస్తాయి. ఒకవేళ సజెషన్స్ ఒక పది, ఇరవై ఉంటే ఒకే..!కానీ.. మనం సెర్చ్ చేసే అంశం కొన్ని వందలుంటే మాత్రం మనకు చికాకు పక్కగా వస్తోంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోన్న వారిమే. ఈ సమస్యకు చెక్ పెడుతూ గూగుల్ సరికొత్తగా సెర్చ్ చేసే సమయంలో పలు ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫిల్టర్ల సహయంతో మనకు కావాల్సిన అంశం తొందరగా దొరికే ఛాన్స్ ఉంది. సెర్చ్ ఇన్ మెయిల్స్‌లో భాగంగా గూగుల్ త్వరలోనే ‘ఫ్రమ్’, ‘సెంట్ టూ’, ‘డేట్’ , ‘అటాచ్మెంట్’ అనే ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సూపర్ఫీచర్ వచ్చే నెలలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందరికి అందుబాటులోకి వస్తోందని తెలుస్తోంది. చదవండి: Forgotten Password: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! -
గూగుల్, యూట్యూబ్.. ఏవీ పని చేయవు! రేపటి నుంచే..
లక్షలాది డివైజ్‌లలో! జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ ఇతరత్ర సౌకర్యాలను బ్లాక్ చేసేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. రేపటి(సెప్టెంబర్ 27) నుంచి పాత స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సంబంధిత అకౌంట్లను శాశ్వతంగా పనిచేయకుండా నిలిపివేయనుంది. గూగుల్ అకౌంట్ బ్లాక్ కాకుండా ఉండాలంటే.. ఫోన్లను అప్‌గ్రేడ్ చేయడం లేదంటే కొత్త మొబైల్‌కు మారిపోయి లాగిన్ అవ్వాల్సిందే. ఇలా చేయకపోతే జీమెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇతర గూగుల్ సేవలను పొందలేరని(యాప్స్ ద్వారా) గూగుల్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27 నుంచి 2.3 వెర్షన్ డివైజ్‌లలో ఆయా గూగుల్ యాప్స్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఎర్రర్ వస్తుంది. అది కరెక్ట్ మెయిల్, పాస్వర్డ్ అయినా సరే. చదవండి: ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఇక లీక్ కావా? ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌తో నడుస్తోన్న స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సైన్ ఇన్ సపోర్ట్, ఇతరత్ర సేవలను నిలిపివేయనుంది. యూజర్ల భద్రత, డాటా పరిరక్షణ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం డివైజ్ తయారీదారులు చాలాకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ గూగుల్ మొండిగా ముందుకు పోతోంది. అయితే ఆ ఫోన్ బ్రౌజర్లో మాత్రం ఈ సర్వీసులను యూజర్లు పొందే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. చదవండి: గూగుల్ ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ చేస్తున్నారా? ఫోన్ సాఫ్ట్‌వేర్‌ని అప్డేట్ చేయమని లేదా ఫోన్లనే మార్చేయమని గత కొంతకాలంగా గూగుల్, యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది కూడా. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను కల్గి ఉన్న స్మార్ట్ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈరోజుల్లో ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్.. అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ వెర్షన్స్‌నే వాడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఒకవేళ వాడుతుంటే గనుక తక్షణమే ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్(అప్‌గ్రేడ్) చేస్కోమని సూచిస్తోంది. చదవండి: గూగుల్ క్రోమ్‌ను బీభత్సంగా వాడుతున్నారా? ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్, ఐఫోన్లలో ఐవోఎస్ 15 వెర్షన్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి గూగుల్ ఒక్కో వెర్షన్‌ను రిలీజ్ చేస్తూ వస్తోంది. 2017లో ఆండ్రాయిడ్ 2.3 ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ పే సేవలను నిలిపివేసింది. అయితే ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్‌తో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఫోన్లు ఇవి.. Sony Xperia Advance, Lenovo K800, Sony Xperia Go, Vodafone Smart II, Samsung Galaxy S2, Sony Xperia P, LG Spectrum, Sony Xperia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532 చదవండి: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..! -
జీమెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్...!
జీమెయిల్ యూజర్లకు గూగుల్ గుడ్‌న్యూస్‌ను అందించింది. జీమెయిల్ మొబైల్ యాప్‌ను లేదా వెబ్ యాప్స్‌ను ఉపయోగించి నేరుగా గూగుల్ మీట్ యూజర్లకు వాయిస్, వీడియో కాల్స్‌ను చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుంగా జీమెయిల్ యూజర్లు ఒకరికొకరు వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్గించనుంది. భవిష్యత్తులో వాయిస్ఇంటర్నెట్ ప్రొటోకాల్స్‌ను చేసే సామర్థ్యాన్ని కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. జీమెయిల్ యాప్స్‌లో గ్రూప్ చాట్ సర్వీసులను కూడా యూజర్లు పొందే సౌకర్యాన్ని గూగుల్ అందించనుంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! గూగుల్ ప్రకటించిన కొత్త ఫీచర్లలో భాగంగా జీమెయిల్ యాప్స్‌లో చాట్, స్పేసెస్, గూగుల్ మీట్ వంటి మూడు ట్యాబ్‌లను వర్క్‌స్పేస్ టూల్స్‌కు మరింతగా అనుసంధానంగా ఉండనున్నాయి. గూగుల్ మీట్ బటన్‌పై క్లిక్ చేసిన తరువాత జనరేట్ ఐనా లింక్‌ను ఇతరులకు పంపడం ద్వారా వీడియో కాలింగ్‌ను చేయవచ్చును ప్రస్తుతం తెచ్చిన ఫీచర్‌తో నేరుగా జీమెయిల్ ఖాతాతో గూగుల్ మీట్ పాల్గొనే సదుపాయం కల్గనుంది. తాజాగా గూగుల్ మీట్ కంపానియన్ మోడ్‌ను నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ ప్రయత్నిస్తుంది. గూగుల్ క్యాలెండర్, డ్రైవ్, డాక్స్, షీట్, స్లయిడ్లు, మీట్, టాస్క్‌లతో సహా ఇతర గూగుల్ వర్క్‌స్పేస్ టూల్స్ సహకారంతో టీమ్ మీటింగ్‌లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ చాట్ లాంటి ఫీచర్లో భాగంగా పాల్గొనేవారికి డాక్యుమెంట్లను షేర్ చేయడానికి సులువుగా ఉండనుంది. యూజర్ల మధ్య జరిగిన కన్వర్సేషన్ను పూర్తిగా సేవ్ చేసుకోవచ్చును. గూగుల్ అదనంగా గూగుల్ క్యాలెండర్ పలు కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ వర్క్ డే లోకేషన్ స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. చదవండి: మైక్రోసాఫ్ట్ తర్వాత మరో రెండు స్టార్ట్ మెనూలు.. ఎబ్బెట్టుగా ఉందని ఫీడ్‌బ్యాక్! -
జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!
జీ-మెయిల్ యూజర్లకు హెచ్చరిక. ఇటీవల ఒక కొత్త ఈ-మెయిల్ స్కామ్ బయట పడింది. అమాయక వినియోగదారులు లక్ష్యంగా చేసుకొని ఈ-మెయిల్ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. తాజా ఈ-మెయిల్ కుంభకోణం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. యూజర్లను మోసం చేయడానికి నెరగాళ్లు పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికోసం మీరు నకిలీ లింక్ లపై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మాల్ వేర్ ను మీ ఫోన్లలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ జీ-మెయిల్ స్కామ్ భిన్నమైనది.(చదవండి: నాలుగు టెస్లా మోడల్ కార్లకు భారత్ ఆమోదం..!) సైబర్ నెరగాళ్లు ఇప్పుడు అమెజాన్,పే పాల్ వంటి పెద్ద కంపెనీల పేరుతో ఈ-మెయిల్స్ పంపుతున్నారు. అందులో ‘‘మీ అమెజాన్ ఖాతా నుంచి మీరు యాపిల్ వాచ్ / గేమింగ్ ల్యాప్‌టాప్ వంటి ఖరీదైన వస్తువులను పేపాల్ ద్వారా కొనుగోలు చేశారు. ఒకవేళ మీరు ఈ కొనుగోలు చేయనట్లయితే, దయచేసి కింద సూచించిన నంబర్‌కి ఫోన్ చేయండి’’ అని అందులో ఉంటుంది. నిజానికి ఆ నెంబర్ అమెజాన్/పే పాల్ సంస్థకు చెందినది కాదు. సైబర్ నెరగాళ్లు మీ పాస్ వర్డ్లు, బ్యాంకు వివరాలతో సహా సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వెంటనే ఆ ఈ-మెయిల్స్ తొలగించండి నకిలీ ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. అంతేగాక ఫోన్ చేసినప్పుడు యూజర్ కంప్యూటర్లలో వైరస్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చేసి అందులోని డేటా దొంగిలిస్తున్నట్లు ఒక సైబర్ భద్రత సంస్థ కాస్పర్ స్కై పేర్కొంది. ఈ కొత్త ఈ-మెయిల్ కుంభకోణానికి 'విషింగ్' అని పేరు పెట్టారు. జీ-మెయిల్ కస్టమర్లకు ప్రతి రోజు ఈమెయిల్స్ పంపిస్తున్నట్లు కాస్పర్ స్కైలోని ఒక బృందం చెప్పింది. అందుకే యూజర్స్ ఇలాంటి ఈ-మెయిల్స్ వస్తే ఓపెన్ చేయకుండా ముందు జాగ్రత్తగా అమెజాన్ లేదా పేపాల్ ఖాతాలను ఓపెన్ చేసి వాటి నుంచి లావాదేవీ జరిగిందా లేదా అనేది చూసుకోవాలని సూచించారు. ఒకవేళ సదరు మెయిల్ మోసపూరితమని అనుమానం కలిగితే వెంటనే డిలీట్ చేయాలని భద్రత నిపుణులు సూచిస్తున్నారు. -
మీకు నచ్చిన సమయానికే ఈ-మెయిల్‌ను ఇలా సెండ్ చేయండి...!
నేటి టెక్నాలజీ యుగంలో ఉత్తర ప్రత్యుత్తరాలను పంపడానికి జీ-మెయిల్, యాహూ, వంటి మెయిల్ ప్రొవైడర్స్‌పై కచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. కంప్యూటర్ వచ్చిన తొలినాళ్లలో ఆర్కూట్ వంటి ఈ-మెయిల్ సేవలు అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా ఆర్కూట్ స్థానంలో యాహూ, గూగుల్ వంటి సంస్థలు తమ సొంత మెయిల్ సర్వీస్‌లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం మనలో చాలా మంది జీమెయిల్ సర్వీస్‌లనే ఎక్కువగా వాడుతుంటాం. మొదట్లో జీ-మెయిల్ షెడ్యూల్డ్ సమయానికి పంపే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో బూమ్‌ర్యాంగ్ వంటి థర్డ్‌పార్టీ మెయిల్ యాప్స్‌ను ఉపయోగించి యూజర్లు అనుకున్న సమయానికి మెయిల్స్‌ను పంపేవారు. జీ-మెయిల్ తన యూజర్ల కోసం షెడ్యూల్డ్ ఈ-మెయిల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఫలానా సంస్థలకు లేదా కార్యాలయాలకు మీకు నచ్చిన సమయానికి ఈ-మెయిల్స్‌ను ఇలా పంపండి. చదవండి: Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..! బ్రౌజర్నుపయోగించి జీ-మెయిల్ నుంచి ఇలా మెయిల్ సెండ్ చేయండి. మీ జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. ముందుగా కంపోస్ మెయిల్‌ను సెలక్ట్చేసి మీ సమాచారాన్ని, రెసిపెంట్ మెయిల్ అడ్రస్‌ను టైప్ చేయండి. తరువాత సెండ్ ఆప్షన్ పక్కనే ఉన్న డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ సింబల్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత మీకు ‘షెడ్యూల్డ్ సెండ్ ఆప్షన్’ మీకు కన్పిస్తోంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఫలానా సమయంలో మెయిల్స్ వెళ్లే ఆప్షన్‌ను జీమెయిల్ డిఫాల్ట్‌గా చూపిస్తుంది. ఒక వేళ డిఫాల్ట్ సమయానికి కాకుండా మీకు నచ్చిన సమయం కోసం పిక్ అండ్ డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన సమయాన్ని ఎంచుకోవాలి. మీ మెయిల్ షెడ్యూల్ అయ్యిందని జీ-మెయిల్ డ్రాఫ్ట్‌లో సేవ్ అయి ఉంటుంది. ఒక వేళ మెయిల్లో ఏవైనా పొరపాట్లు వచ్చినా తిరిగి మెయిల్‌ను సేవ్ చేసుకునే సౌకర్యం మీకు ఉంటుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ నుంచి ఇలా మెయిల్ సెండ్ చేయండి..! మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో జీమెయిల్ యాప్‌ను సెలక్ట్ చేయండి. కింద కన్పించే కంపోస్ అప్షన్‌పై క్లిక్ చేయండి. మెయిల్ కంపోస్ చేసిన తరువాత పక్కనే ఉన్న త్రీడాట్స్‌పై క్లిక్ చేయండి. త్రీడాట్స్‌ను ఎంపిక చేసిన వెంటనే మీకు షెడ్యూల్ టై అనే ఆప్షన్ మీకు కన్పిస్తోంది. దానిపై క్లిక్ చేసి పైనా చెప్పిన విధంగా మీ ఈ-మెయిల్‌ను షెడ్యూల్ చేసుకోండి. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
మొరాయించిన గూగుల్: యూజర్లు పరేషాన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజీన్ సంస్థ గూగుల్, దాని సంబంధిత సేవలు పనిచేయకపోవడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. ఆల్ఫాబెట్ సొంతమైన సెర్చ్ ఇంజన్ గూగుల్‌తో పాటు దాని స్ట్రీమింగ్, ఈమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందంటూ చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మానిటరింగ్ వెబ్సైట్ డౌన్డెక్టెక్టర్ ఈ విషయాన్ని నివేదించింది. ఈ సమస్యకు గల కారణాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. డౌన్డెక్టెక్టర్ అందించిన సమాచారం ప్రకారం గూగుల్, యూట్యూబ్, జీమెయిల్‌తో కొన్ని గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లు సోమవారం సాయంత్రంనుంచి మొరాయించాయి. ఉత్తర అమెరికాలోని కొన్నిప్రాంతాల్లోకి లాగిన్ అయ్యేందుకు, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలు తలెత్తాయంటూ ఫిర్యాదు చేసినట్లు డౌన్‌డెక్టర్ తెలిపింది. ఒక దశలో వెయ్యి మందికి పైగా వినియోగదారులు గూగుల్ సేవల అంతరాయంతో గగ్గోలు పెట్టారని తెలిపింది. దీంతో పాటు యూట్యూబ్ టీవీ , గూగుల్ డ్రైవ్‌తో కూడా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చదవండి : ఫేస్బుక్, గూగుల్‌కు సమన్లు ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా తప్పించుకోండి!
గూగుల్ మీ కదిలకలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది అనే విషయం మీకు తెలుసా? మీరు షాపింగ్ కోసం ఏదైనా సేర్చ్ చేసిన, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిన, మీరు యూట్యూబ్ లో వీడియొలు చూసిన ఇలా ప్రతి చిన్న విషయాన్ని గూగుల్ మన కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాక్ చేయడం ద్వారా మన అభిరుచులు, ఇష్ట ఇష్టాలు తెలుసుకొని దానికి తగిన విదంగా ప్రకటనలు అందజేస్తుంది. ఎక్కువ శాతం మన డేటాను ప్రకటనల కోసం వాడుకుంటుంది. అలాగే, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని హెచ్చరిస్తుంది. మీ ప్రతి కదలికలను గమనించకూడదు అంటే మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మై యాక్టివిటీ గూగుల్ స్పెసిఫిక్ పేజీని సందర్శించాల్సి ఉంటుంది. అసలు మై యాక్టివిటీ అంటే ఏంటి? మీరు గూగుల్ నుంచి సేకరించిన సమాచారన్ని మొత్తం చూసేందుకు ఇక్కడే నిక్షిప్తమై ఉంటుంది. గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది. దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయి.ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తుంటాయి. డిలీట్ చేయడం ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ ప్రపంచంలో విహరించే వాళ్లకు దాదాపు జీ-మెయిల్ ఉంటుంది. అంటే మీకు గూగుల్‌లో ఒక ఖాతా ఉందన్నమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో ఈ ఖాతా అనుసంధానమై ఉంటుంది. గూగుల్‌లో మీరు ఏం వెతికినా, ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది. ఈ డేటాను తొలగించాలంటే మేను బార్ లో "డిలీట్ యాక్టివిటీ బై" అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఒక స్పెసిఫిక్ డే నుంచి గత వారం, గత నెల, మొత్తం డేటాను ఎప్పటికప్పుడు తొలగించే ఆఫ్షన్‌ను ఎంచుకోవచ్చు. యూట్యూబ్‌లో మీరు వెతికే ప్రతి వీడియో సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. ఈ చరిత్రను కూడా సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ లింక్‌పై క్లిక్ చేయండి. ఎడమ వైపున "హిస్టరీ" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ", "క్లియర్ వాచ్ హిస్టరీ" వాటిని ఎంచుకోవాలి. లేదా మీరు కోరుకున్న సమాచారాన్ని డిలీట్ చేయొచ్చు. అలాగే, లొకేషన్ హిస్టరీ కూడా గూగుల్ ట్రాక్ చేయకుండా నిలిపివేయవచ్చు. ఇలా ప్రతి విషయాన్ని గూగుల్ ఏమి ట్రాక్ చేయాలో, వద్దో అనేది మనం నిర్ణయించుకోవచ్చు. మీరు మీ డేటాను తొలగించిన మాత్రాన ప్రకటనలు మాత్రం ఆగిపోవు. కానీ, మీ డేటాను డిలీట్ చేయడం వల్ల సైబర్ నెరగాళ్ల భారీన పడకుండా ఉంటుంది. చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు! -
మొరాయించిన గూగుల్ సేవలు
న్యూఢిల్లీ: జీమెయిల్‌తో సహా ఇతర గూగుల్ సేవల్లో సోమవారం సాయంత్రం 5.17 గంటలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ డాక్స్, క్యాలెండర్, డ్రైవ్, మీట్ వంటి వాటిలోకి లాగిన్ అయినవారికి స్క్రీన్‌పై టెంపరరీ ఎర్రర్ అంటూ మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. దాదాపు 45 నిమిషాలపాటు గూగుల్ సేవలు నిలిచిపోయాయి. ‘ఇంటర్నల్ స్టోరేజీ కోటా’లో సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు గూగుల్ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. సాయంత్రం 6.02 గంటలకల్లా సేవలను పునరుద్ధరించగలిగామని తెలిపారు. అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఇబ్బంది పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్ సేవలు నిలిచిపోవడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. జీమెయిల్ డౌన్, యూట్యూబ్ డౌన్ అంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్లో షేర్ చేశారు. మరికొందరు ‘ఇది యుగాంతం’ అంటూ సరదాగా కామెంట్లు చేయడం విశేషం. -
యూట్యూబ్ డౌన్: స్పందించిన గూగుల్
న్యూఢిల్లీ: బ్రేకింగ్ న్యూస్... ప్రపంచవ్యాప్తంగా సోమవారం సాయంత్రం గుగూల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, గూగుల్ హోం, గూగుల్ డ్రైవ్‌తో పాటు యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్ కావడంతో అన్ని ఆన్‌డ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌లలో ఈ అప్లికేషన్ల సేవలు నిలిచిపోయాయి. కాగా, సేవల అంతరాయంపై గూగుల్ స్పందించింది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల సర్వర్లు డౌన్ అయ్యాయని, కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) అప్డేట్: దాదాపు 20 నిమిషాల అంతరాయం తర్వాత గూగుల్ తన సేవలను తిరిగి పునరుద్ధరించింది. -
వచ్చే జూన్ నుంచి గూగుల్ కొత్త పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల సౌలభ్యం కోసం వారి ఖాతాలో జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌లోని క్రియా రహితంగా, పరిమితికి మించి ఉన్న వాటి కోసం టెక్ దిగ్గజం గూగూల్ కొత్త పాలసీ తీసుకురానుంది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న గూగుల్ కొత్త పాలసీతో డాక్స్, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్లు, జూమ్‌బోర్డు ఫైల్స్, ఫొటో పరిశ్రమలకు సేవలు ఇక నుంచి సాధారణ పద్ధతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్ తెలిపింది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్ తొలగించనుంది. అదేవిధంగా మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్, డ్రైవ్, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. మేమేదైనా కంటెంట్ తొలగించడానికి ముందు మీకు చాలా సార్లు సమాచారం ఇస్తామని పేర్కొంది. అందువల్ల మీరు ఆలోపే స్పందించే అవకాశం ఉంటుందని గూగుల్ వెల్లడించింది. మీ ఖాతాను చురుగ్గా ఉంచడానికి మీరు ఎప్పటికప్పుడు జీమెయిల్, డ్రైవ్, ఫొటోలను చూస్తూ ఉండాలని సూచించింది. సైన్ ఇన్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేశారని గూగుల్ ఒక రికార్డు చేసుకుంటుందని తెలిపింది. ఇనాక్టివ్ అకౌంట్ మేనేజర్ నిర్ధిష్ట కంటెంట్‌ను నిర్వహించడానికి మీకు సహయ పడుతుందని పేర్కొంది. -
జీమెయిల్ సర్వీసులకు అంతరాయం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి చాలాసేపు జీమెయిల్ సహా గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ మొదలైన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. లాగిన్ కాలేకపోవడం, అటాచ్మెంట్స్ చేయలేకపోవడం, మెసేజ్‌లు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జీమెయిల్ హ్యాష్‌ట్యాగ్ చాలాసేపు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిల్చింది. మరోవైపు, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఉదయం వెల్లడించిన గూగుల్ ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు సాయంత్రానికి ప్రకటించింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఓర్పు వహించినందుకు, మద్దతుగా నిల్చినందుకు ధన్యవాదాలు. వ్యవస్థ విశ్వసనీయతకు గూగుల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఎప్పటికప్పుడు మా వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నాం‘ అని పేర్కొంది. సర్వీసులకు అంతరాయం కలగడంపై దర్యాప్తు చేస్తున్నట్లు తమ సేవల వివరాలను తెలియజేసే ’జీ సూట్’ స్టేటస్ డ్యాష్‌బోర్డు ద్వా రా ఉదయమే గూగుల్ వెల్లడించింది. కొందరు యూజర్లకు సర్వీసులను పునరుద్ధరించినట్లు, మిగతా యూజర్ల సమస్యలనూ సత్వరం పరిష్కరించనున్నట్లు పేర్కొంది. గూగుల్ వివరణ ప్రకారం.. ఈ–మెయిల్స్, మీట్ రికార్డింగ్, డ్రైవ్‌లో ఫైల్స్ క్రియేట్ చేయడం, గూగుల్ చాట్‌లో మెసేజ్‌లు పోస్ట్ చేయడం వంటి అంశా ల్లో సమస్యలు తలెత్తాయి. అయితే, సేవల అంతరాయానికి కారణమేంటన్నది తెలియరాలేదు. కంపెనీ నిర్దిష్టంగా వివరాలు వెల్లడించనప్పటికీ డౌన్‌డిటెక్టర్ (వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంల సేవల్లో అంతరాయాల వివరాలను తెలిపే సంస్థ) డేటా ప్రకారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా యూజర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. -
జీమెయిల్ డౌన్ కలకలం : యూజర్లు గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం కలగడం కలకలం రేపింది. జీమెయిల్ సేవల్లో మరోసారి సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, ప్రధానంగా భారతీయ యూజర్లు ఇబ్బందులు పాలయ్యారు. కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. జీమెయిల్‌తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం మానేశాయి. జీమెయిల్ లాగిన్ కాలేకపోవడంతోపాటు, లాగిన్ అయినా, ఫైల్స్ అప్లోడ్, డౌన్లోడ్ నిలిచిపోవడం లాంటి సమస్యలను నివేదించారు. భారత్ సహా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూజర్లు జీమెయిల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ సంస్థ తెలిపింది. గూగుల్ మీట్, గూగుల్ వాయిస్, గూగుల్ డాక్స్‌తో కూడా సమస్యలు తలెత్తడంతో గూగుల్ స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్‌డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో సాంకేతిక సమస్యకారణంగా జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. User reports indicate Gmail is having problems since 1:12 AM EDT. https://t.co/pTPsDoNKxQ RT if you're also having problems #Gmaildown — Downdetector Canada (@downdetectorca) August 20, 2020 Gmail is down for more than an hour. Can't send attachments. Aaaaaaaaaaaahhhhhh#Gmail #gmaildown pic.twitter.com/hQSMNizX3K — Sourav Bhunia (@souravbhunia415) August 20, 2020 How long before its set right @gmail? #GmailDown pic.twitter.com/j1OQ8lz7AZ — Prashanth ಪ್ರಶಾಂತ್ 🇮🇳 (@pvaidyaraj) August 20, 2020 After 1 Hour #Gmail Down all employment person 😤😖😫😭😬 But, Unemployment Persons to cooooooolllll✌️🤞✌️ pic.twitter.com/1tumoosd8B — Karthi Durai (@akkmrc12) August 20, 2020 -
గూగుల్ సెర్చ్ హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థలో మరో భారతీయుడు కీలక పదవిని అలంకరించారు. భారతీయ అమెరికన్ అయిన ప్రభాకర్ రాఘవన్ గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టుల హెడ్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న బెన్‌గోమ్ నూతన బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. ప్రభాకర్ ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేయగా, యూసీ బెర్క్లే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ అందుకున్నారు. ప్రభాకర్ రాఘవన్ గూగుల్‌లో 2012లో చేరగా, 2018లో గూగుల్ అడ్వర్టయిజింగ్ అండ్ కామర్స్ విభాగ హెడ్‌గా ఎంపికయ్యారు. అంతకుముందు గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్‌కు వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వృద్ధిలో ప్రభాకర్ పాత్ర కూడా ఉంది. ‘మన ఉత్పత్తుల విభాగాల్లో చాలా వాటిల్లో ఆయన పనిచేయడం వల్ల వాటి మధ్య అంతరాలను కచ్చితంగా గుర్తించగలరు. గూగుల్‌తో ఆయన అనుబంధం గూగుల్‌ను ముందుంచుతుంది’ అంటూ ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో గూగుల్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. -
జీమెయిల్ ద్వారా కూడా వీడియో కాల్స్
సాక్షి, న్యూఢిల్లీ: మీకు జీ-మెయిల్ అకౌంట్ ఉంటే ఇక మీరు వీడియో కాల్ మాట్లాడోచ్చు. అవును గూగుల్ ఇప్పడు గూగుల్ మీటింగ్ ఆప్‌ను జీ-మెయిల్‌కు డైరెక్టుగా అనుసంధానం చేసింది. ఇక భారతదేశంలోని జీమెయిల్ వినియోగదారులంతా తమ వారు ఎక్కడున్న వారితో వీడియో కాల్, కాన్ఫరెన్స్ కాల్స్, చాట్ చేయోచ్చు. ఈ రోజు నుంచి మీ జీ-మెయిల్ ఖాతాను తెరవగానే మీకు ఎడమ వైపు మీట్ పాప్ అప్ కనిపిస్తుంది. మీట్ సెస్సన్ కింద, “స్టార్ట్ మీటింగ్ లేదా జాయిన్ మీటింగ్” అనే రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇది ఇక జీ-మెయిల్ ఖాతాదారులకు చాలా సులభంగా ఉంటుంది. ఏలాంటీ శ్రమ లేకుండా డైరెక్టుగా ఈ ఆప్‌ను మీ జీమెయిల్ నుంచి సులభం ఉపయోగించుకోవచ్చు. (5జీ కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే..) ఇటీవల గూగుల్ ప్రీమియం మీట్ యాప్‌ను వినియోగదారులందరికీ ఉచితం చేసింది. ఇది నేరుగా మీ జీమెయిల్ కనెక్ట్ అవుతుందని ప్రకటించింది. కాగా జూమ్, స్కైప్ వంటి వీడియో కాన్పరెన్స్ కాల్ ప్లాట్‌ఫాంలా జీమెయిల్ మీట్ ఆప్‌ను కూడా కనుగొన్నారు. ఇక ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికీ జీమెయిల్ ఖాతా ఉన్నందున గూగుల్ మీట్ ఇతర వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాంల కంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ మీకు జీ మెయిల్ ఖాతా లేకపోతే మీ గూగుల్ అకౌంటుకు గూగుల్ మీట్ ఆప్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. (ఒకే వాట్సప్ ఖాతా మల్టీ డివైస్ కూడా!) జీమెయిల్లో గూగుల్ మీట్ వీడియో కాల్‌ను ఏలా కనెక్ట్ చేయాలంటే.. మొదట మీరు మీ జీమెయిల్‌ను ఒపెన్ చేయగానే డ్రాప్ట్ కింద గూగుల్ మీట్ సెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీరు స్టార్ట్ ఏ మీటింగ్, జాయిన్ ఏ మీటింగ్’ అని రెండు అప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరు స్టార్ట్ మీటింగ్ క్లిక్ చేస్తే.. గూగుల్ మీట్ మీమ్మల్ని ల్యాప్‌ట్యాప్ కెమారా లేదా మైక్రో ఫోన్స్ పర్మిషన్ యాక్సస్ ఇస్తుంది. కెమారా యాక్సన్‌ను ఒకే చేస్తే.. కెమరా క్షణాల్లో సెట్అప్ అవుతుంది. ఒక్కసారి అది ఒకే అవ్వగానే మీకు మీటింగ్ రెడీ అని మెసెజ్ వస్తుంది. గూగుల్ మీట్ మీమ్మల్ని.. మీరు కాల్లో చేరాలనుకుంటున్నారా లేదా ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు జాయిన్ క్లిక్ చేస్తే వీడియో చాట్ కోసం లింక్‌తో కూడిన న్యూ పాప్-అప్ విండో ఒపెన్ అవుతుంది. ఈ లింక్‌ను మీరు ఎవరితో మాట్లాలనుకుంటున్నారో వారికి కాపి లేదా సెండ్ చేయోచ్చు లేదా పాల్గొనే వారిని కాల్‌కు మాన్యువల్‌గా జోడించవచ్చు. హోస్ట్ మీకు పంపించిన మీటింగ్ ఐడిని నమోదు చేసి ఇర మీటింగ్‌లో జాయిన్ అవ్యోచ్చు. అంతేగాక గూగుల్ మీట్ ఆప్‌లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. షెడ్యూలింగ్, షేరింగ్ స్క్రీన్ షాట్స్, రియల్ టైం క్యాప్షన్స్, అవసరానికి అనుగుణంగా మీరు ఎంచుకోగల లే అవుట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. -
మన ఆన్లైన్ కొనుగోళ్లపై గూగుల్ కన్ను
శాన్ఫ్రాన్సిస్కో: ఆన్లైన్లో చేసే ప్రతి కొనుగోలును జీమెయిల్ అకౌంట్ ద్వారా గూగుల్ ట్రాక్ చేస్తోంది. ఓ ప్రైవేట్ వెబ్ టూల్ ద్వారా వినియోగదారులకు ఈ సమాచారం అందుబాటులో ఉంచుతామని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటనల ట్రాకింగ్ కోసం వినియోగించట్లేదని తెలిపింది. వ్యక్తిగత ప్రకటనల కోసం జీమెయిల్ మెసేజ్‌ల నుంచి సమాచారాన్ని సేకరించడం ఆపివేసినట్లు గూగుల్ 2017లో ప్రకటించింది. కొనుగోళ్లు, బుకింగ్‌లను సులభంగా చూడటానికి, ట్రాక్ చేయడానికి ప్రైవేట్ వెబ్ టూల్‌ను సృష్టించినట్లు పేర్కొంది. అందులోని సమాచారాన్ని ఎప్పుడైనా తొలగించే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. మొబైల్ యాప్‌లోని హోమ్ పేజీలో యాడ్ల ప్రదర్శనకు అనుమతిస్తున్నట్లు మే 14న కంపెనీ ప్రకటించింది. ఇకపై గూగుల్ షాపింగ్ హోమ్ పేజీలో కూడా యాడ్లు ప్రదర్శిస్తామని, వాటి ఆధారంగా వినియోగదారులు తాము ఇష్టపడే బ్రాండ్లు వెతికి పట్టుకోవచ్చని తెలిపింది. -
నిలిచిపోయిన జీమెయిల్; అనుమానాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో సోమవారం జీమెయిల్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జీమెయిల్ పనిచేయకపోవడంతో సమాచార మార్పిడి నిలిచిపోయింది. ఫలితంగా ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెక్రటేరియట్ నెట్వర్క్ ఐపీలో బ్లాక్ చేయడం వల్లే జీమెయిల్ ఆగిపోయిందని ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి. జీమెయిల్ పనిచెయ్యకపోవడంపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలన్నీ జీమెయిల్ ద్వారానే అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా జీమెయిల్ నిలిపివేయడంపై అనుమానాలు రేగుతున్నాయి. జీమెయిల్‌ను కావాలనే నిలిపివేశారా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సివుంది. -
ఒకే ఒక్క డాలర్ కు.. హ్యాకింగ్ అకౌంట్లు అమ్మకం
ఫ్రాంక్‌పర్ట్ : హ్యాక్ చేసిన వందల మిలియన్ల యూజర్ పేర్లు, పాస్ వర్డులు, ఈ-మెయిల్ అకౌంట్లు, వెబ్ సైట్లు రష్యా క్రిమినల్ వరల్డ్ లో వాణిజ్యం జరుగుతున్నాయట. 272.3 మిలియన్ అకౌంట్లు(2723 లక్షల అకౌంట్లు) చోరీ అయ్యాయట. వాటిలో ఎక్కువగా రష్యా ప్రముఖ ఈ-మెయిల్ సర్వీసు మెయిల్.రూ అకౌంట్లే ఉన్నాయని సెక్యురిటీ నిపుణులు చెబుతున్నారు. మిగతా అకౌంట్లు గూగుల్, యాహు, మైక్రోసాప్ట్ యూజర్లకు సంబంధించినవి ఉన్నాయని హోల్డ్ సెక్యురిటీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసర్ అలెక్స్ హోల్డెన్ తెలిపారు. నిగూఢంగా భధ్రపరిచిన సమాచారాన్ని దొంగలించబడటంలో ఇదే అతి పెద్దదని, రెండేళ్ల క్రితం అమెరికాలో బ్యాంకుల, రిటైలర్లపై సైబర్ అటాక్ ఇలానే జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే రష్యాకు చెందిన ఓ యువకుడు ఈ క్రైమ్ కు పాల్పడాడని హోల్డ్ సెక్యురిటీ కనుగొన్నది. కేవలం ఒకే ఒక్క డాలర్ కు దొంగలించబడిన అకౌంట్లను అమ్మకానికి పెట్టినట్టు పేర్కొంది. వీటిలో 570 లక్షల అకౌంట్లు మెయిల్.రూ కు సంబంధించినవి ఉంటే, 400 లక్షల యాహు అకౌంట్లు, 330 లక్షల హాట్ మెయిల్ అకౌంట్లు, 240 లక్షల జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయని హోల్డ్ సెక్యురిటీ చెప్పింది. ఈ హ్యాకింగ్ డేటాసెట్ లో వేల సంఖ్యలో అమెరికా బ్యాంకింగ్, తయారీ, రిటైల్ కంపెనీల ఉద్యోగులకు సంబంధించిన యూజర్ పేరు, పాస్ వర్డులు ఉన్నాయని హోల్డ్ వెల్లడించింది. -
జీమెయిల్లో ఇక బ్లాకింగ్ ఫీచరు
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈమెయిల్ సర్వీస్ జీమెయిల్లో ఇకపై ‘బ్లాక్’, ‘అన్‌సబ్‌స్క్రయిబ్’ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్ ఫీచర్‌ను ఉపయోగించి ...అవాంఛిత ఈమెయిల్ అడ్రస్‌ల నుంచి వచ్చే మెయిల్స్‌ను బ్లాక్ చేయొచ్చని గూగుల్ పేర్కొంది. ఆయా మెయిల్ ఐడీల నుంచి ఇకపై వచ్చే మెయిల్స్ నేరుగా స్పామ్ ఫోల్డర్లోకి వెడతాయి. భవిష్యత్‌లో కావాలంటే సెటింగ్స్‌లోకి వెళ్లి సదరు ఐడీలను అన్‌బ్లాక్ చేయొచ్చు. అలాగే ఏదైనా మెయిల్ ఐడీ నుంచి అన్‌సబ్‌స్క్రయిబ్ కూడా చేసే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యాప్‌లోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ తెలిపింది. గతంలో ఎప్పుడో సబ్స్క్రయిబ్ చేసినా ప్రస్తుతం అంతగా ఉపయోగించని న్యూస్‌లెటర్స్ మొదలైన వాటి బారి నుంచి తప్పుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది. -
ఈ ట్రిక్కులతో టైమ్ ఆదా...!
మీరు గూగుల్, జీమెయిల్ వాడుతున్నారా? వాటిల్లోని అన్ని ఫీచర్లు మీకు చిరపరచితమేనా? ఎందుకైనా మంచిది... ఈ కథనం పూర్తిగా చదివిన తరువాత మీ సమాధానాన్ని సరిచూసుకోండి. ఎందుకంటే ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న ఈ మెయిల్ సర్వీసులోనూ మీ టైమ్‌ను ఆదా చేసుకునేందుకు అనేక చిట్కాలు, ట్రిక్కులు దాగి ఉన్నాయి మరి. అవేమిటో మచ్చుకు కొన్నింటిని చూద్దాం... జీమెయిల్ ఆటో అడ్వాన్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇన్‌బాక్స్‌లోని బోలెడు మెయిళ్లను చకచక చూసేసి అవసరమైన వాటిని ఉంచుకునేందుకు, లేనివాటిని తొలగించేందుకు పనికొచ్చే చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇది. జీమెయిల్ ల్యాబ్స్‌లో ఉండే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మెయిల్ ఓపెన్ చేయకముందే దానితాలూకూ సబ్జెక్ట్, మొదటి కొన్ని లైన్లు చిన్న విండోలో కనిపిస్తుంది. దాన్నిబట్టి మెయిల్ ఉంచుకోవాలా? వద్దా? అన్నది మీరే నిర్ణయించుకోవచ్చునన్నమాట.మెయిల్ ఓపెన్ అయ్యేందుకు పట్టే సమయం ఆదా! రోజూ మనం చేయాల్సిన పనుల జాబితాను సిద్ధం చేసుకునేందుకు కూడా జీమెయిల్ ఉపయోగపడుతుంది. గూగుల్ టాస్క్స్ టూల్‌ను వాడితే చాలు. జాబితాకు మెరుగులు దిద్దుకోవాలన్నా, మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అలాగే గూగుల్ టాస్క్స్ టూల్‌ను కూడా మరింత మెరుగ్గా తయారు చేసుకోవచ్చు. కొత్త ట్యాబ్‌లను చేర్చుకోవడం, ముఖ్యమైన వాటికి లేబుల్స్ తగిలించుకోవడం వంటి ఫీచర్లతో నోట్స్, స్టికీలు రాసుకునే టైమ్ కలిసొస్తుందన్నమాట. ఫలానా వారి బర్త్‌డేలను కేలండర్లో నమోదు చేసుకుంటాం. ఆ రోజుకు ఓ మెసేజ్ పెట్టేస్తే చాల్లే అనుకుంటాం కూడా. అలాకాకుండా ఆ రోజున గూగుల్ హాంగౌట్ ద్వారా ఓ వీడియో మీటింగ్ పెట్టుకోవాలనుకోండి. గూగుల్ +లోకి వెళితే సరి. గూగుల్ కేలండర్లో ఈవెంట్‌ను క్రియేట్ చేసిన తరువాత ఆప్షన్స్‌లో ఉండే యాడ్ వీడియోకాల్ అన్నది క్లిక్ చేస్తే చాలు. బర్త్‌డే గ్రీటింగ్స్ కోసం ఈమెయిల్ రాసే, గ్రీటింగ్స్ వెతికే శ్రమ, సమయం మిగుల్చుకోవచ్చు. -
ఐబీఎం కొత్త మెయిల్ సర్వీస్
న్యూఢిల్లీ: ఐబీఎం సంస్థ వ్యాపార సంస్థల కోసం వెర్స్ పేరుతో కొత్త ఈ మెయిల్ సర్వీస్‌ను ఆవిష్కరించింది. ఫైల్స్ షేరింగ్, ఎనలిటిక్స్, సోషల్ మీడియాలను సమ్మిళితం చేస్తూ సంస్థల ఉత్పాదకతను మెరుగుపరచడానికి తోడ్పడే నిమిత్తం ఈ కొత్త యాప్‌ను అందిస్తున్నామని ఐబీఎం పేర్కొంది. ఈ ఆప్‌తో కంపెనీ ఉద్యోగులు ఈ మెయిల్స్, కేలండర్స్, ఫైల్ షేరింగ్, ఇన్స్టంట్ మెసేజింగ్, సోషల్ అప్డేట్స్, వీడియో చాట్స్.... ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై యాక్సెస్ చేసుకోవచ్చని వివరించింది. ఈ మెయిల్స్‌లో కావలసిన కంటెంట్ ఉన్న మెయిల్స్‌ను సరిగ్గా సెర్చ్ చేసే ఫేసెటెడ్ సెర్చ్ ప్రత్యేకత ఈ వెర్స్ ఈమెయిల్ సర్వీస్‌కు ఉందని పేర్కొంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌ను అందిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, గూగుల్ ఇన్‌బాక్స్ ఈ మెయిల్ సర్వీసులకు ఇది గట్టిపోటీనివ్వగలదని నిపుణులంటున్నారు. రోజుకు 10,800 కోట్ల ఈ మెయిల్స్‌ను ఉద్యోగులు పంపుతున్నారని, దీంతో ఉద్యోగులు గంటకు 36 సార్లు తమ ఈ మెయిల్స్‌ను చెక్ చేస్తున్నారని అంచనా. అయితే వీటిల్లో 14 శాతం ఈ మెయిల్స్ మాత్రమే ముఖ్యమైనవి కావడం విశేషం. -
ఆండ్రాయిడ్ లాలీపాప్ ముచ్చట్లు!
పొందికైన ఈ మెయిల్, మెరుగైన భద్రత, పొదుపైన బ్యాటరీ వాడకం..! ఇవీ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ లాలీపాప్ విశేషాలు. ఇటీవలే నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్, నెక్సస్ 9 టాబ్లెట్లలోకి చేరి సందడి చేస్తున్న ఈ తాజా ఓఎస్ త్వరలోనే స్మార్ట్ఫోన్లన్నింటికీ విస్తరించనున్న నేపథ్యంలో ఇందులో ఉన్న కొత్త ఫీచర్లు ఏమిటో ఒకసారి చూసేద్దామా...? జీమెయిల్ ఇన్‌బాక్స్ ఆప్ లాలీపాప్ ఓఎస్‌లో జీమెయిల్ అప్లికేషన్ సరికొత్త రూపు సంతరించుకుంది. డిజైన్‌తోపాటు కొన్ని అదనపు ఫీచర్లు కూడా వచ్చి చేరాయి. గతంలో మాదిరిగా కంపోజ్ ఆప్షన్ మెనూలో ఒకవైపున కాకుండా స్క్రీన్ అడుగున కుడివైపు ఫ్లోటింగ్ ఐకాన్‌లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జీమెయిల్, గూగుల్ క్యాలెండర్లను సింక్ చేసేందుకు ఇన్‌బాక్స్ పేరుతో మరో ఆప్‌ను విడుదల చేశారు. ఫలితంగా మెయిల్ సమాచారం ఆధారంగా మీకు రిమైండర్లు అందే వీలేర్పడింది. ఉదాహరణకు మీ ఫ్లైట్ టికెట్ మెయిల్ ఆధారంగా మీ ప్రయాణపు తేదీ ముందురోజు మీకు అలర్ట్ వస్తుందన్నమాట. బ్యాటరీ వాడకం తక్కువే ఎన్ని మంచి ఫీచర్లున్నా తగిన బ్యాటరీ బ్యాకప్ లేకపోతే అంతే సంగతులు. కానీ కిట్‌క్యాట్ ఓఎస్ ద్వారా బ్యాటరీ మేనేజ్మెంట్లో కొన్ని కొత్త మెలకువలు చేర్చిన ఆండ్రాయిడ్ లాలీపాప్లోనూ ఆ పంథాను కొనసాగించింది. ఈ కొత్త ఓఎస్‌లోని బ్యాటరీ సేవర్ కనీసం 90 నిమిషాల బ్యాటరీ సమయాన్ని ఆదా చేస్తుందని అంచనా. సెట్టింగ్స్ మార్పులూ సులువే! మీరు తరచూ ఉపయోగించే సెట్టింగ్స్‌ను మార్చుకోవడం కూడా లాలీపాప్ ఓఎస్‌లో సులువు. కేవలం స్క్రీన్‌ను కిందివైపునకు స్వైప్ చేస్తే చాలు ఇవి ప్రత్యక్షమవుతాయి. వైఫై, బ్యాటరీ ఐకాన్, బ్లూటూత్, లొకేషన్ వంటివన్నీ దీంట్లో ఉంటాయి. పరిసరాలకు తగ్గట్టుగా స్క్రీన్ ప్రకాశాన్ని మాన్యువల్‌గా మార్చుకునే సౌలభ్యమూ ఉండటం మరో విశేషం. మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు వైరస్లు, మాల్వేర్ల నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు లాలీపాప్‌లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. సమాచారం మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేసే అవకాశముండటం వీటిల్లో ఒకటి. ఫోన్ పోగొట్టుకుపోయినా లేదా ఎవరైనా దొంగిలించినా మొత్తం డేటా, అప్లికేషన్లు ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. ఇతరులు ఈ డేటాను అసలు చూసే అవకాశముండదు. సామ్సంగ్ సిద్ధం చేసిన నాక్స్ టెక్నాలజీలోని ఓ కీలకమైన అంశాన్ని లాలీపాప్ ఓఎస్‌లో చేర్చడం ద్వారా ఇది వీలైంది. అదనంగా 15 భాషలు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో స్థానిక భాషల వాడకం కొత్త కాకపోయినప్పటికీ లాలీపాప్తో ఈ భాషల జాబితాలోకి మరో 15 కొత్తగా చేరాయి. తెలుగు, బెంగాలీ, కన్నడలతోపాటు కొన్ని విదేశీ భాషలు ఉన్నాయి. అంతేకాదు... ఈ సరికొత్త ఓఎస్‌లోని ఆడియో, వీడియో ఫీచర్లలోనూ చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. 5.1, 7.1 ఛానెల్ ఆడియోలను సపోర్ట్ చేయడంతోపాటు యూఎస్బీ ఆడియో సపోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. కెమెరా ఫుల్ రెజల్యూషన్‌తో సెకనుకు 30 ఫ్రేములను బంధించగలదు. ప్రతి ఫ్రేమ్ తాలూకూ సెట్టింగ్స్‌లో వేర్వేరుగా మార్పులు చేసుకోగలగడం విశేషం. -
జీమెయిల్, యాహూలపై నిషేధం!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పరిరక్షించడానికిగానూ అధికారిక కార్యకలాపాల్లో జీమెయిల్, యాహూలాంటి ఈమెయిల్ సర్వీసుల వినియోగాన్ని నిషేధించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(డీఈఐటీవై) కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దీనిపై కేంద్ర మంత్రివర్గం ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు, హ్యాకింగ్ ఘటనలు పెరిగడంతో డీఈఐటీవై ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. గూగుల్‌కు సంబంధించిన 50 లక్షల జీమెయిల్ యూజర్ నేమ్‌లు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయన్న వార్తలూ దీనికి దోహదం చేశాయి. -
13 ఏళ్లలోపు వారికీ గూగుల్ సేవలు!
లండన్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తొలిసారిగా జీమెయిల్, యూట్యూబ్ తదితర సేవలను 13 ఏళ్లలోపు వారికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సేవలను చిన్నారులు వినియోగించుకోవడంపై తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ద టైమ్స్’ కథనం ప్రచురించింది. ప్రత్యేక డాష్‌బోర్డు ద్వారా కొన్ని రకాల సేవలను తల్లిదండ్రులు నియంత్రించే వెసులుబాటును గూగుల్ కల్పించనుందని పత్రిక తెలిపింది. -
బాలలకు కూడా జీమెయిల్,యూట్యూబ్ సేవలు!
లండన్: 13 ఏళ్లలోపు వారికి కూడా తొలిసారిగా చట్టపరంగా జీమెయిల్, యూట్యూబ్ తదితర సేవలను ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సేవలను చిన్నారులు వినియోగించుకోవడంపై తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ద టైమ్స్’ కథనం ప్రచురించింది. ప్రస్తుతం 13 ఏళ్ల లోపువారికి గూగుల్, ఫేస్బుక్ సేవలు అందుబాటులో లేవు. ప్రత్యేక డాష్‌బోర్డు ద్వారా కొన్ని రకాల సేవలను తల్లిదండ్రులు నియంత్రించే వెసులుబాటును గూగుల్ కల్పించనుందని పత్రిక తెలిపింది. అయితే ఈ కథనంపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది. 13 ఏళ్లలోపు వారికి చట్టపరంగా గూగుల్, ఫేస్బుక్ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం లేకపోయినా చాలా మంది వయోజనులుగా పేర్కొంటూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. -
ఆన్లైన్ శుభాకాంక్షలు
బడికి వెళ్లే పిల్లవాడితోపాటు పండు ముసలి వరకు నేడు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో నూటికి 90 శాతం మంది మొబైల్స్ వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అరుుతే.. నెట్వర్క్ కంపెనీల్లో పెరిగిన పోటీ సెల్పోన్ల వినియోగదారులకు వరంగా మారింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ ప్రకటిస్తోంది. సెకన్, నిమిషాల ప్రకారం కాల్ చార్జీలే కాకుండా ఎస్‌ఎంఎస్‌లకూ అనేక రారుుతీలు ఇస్తున్నారుు. అందుకే ఇప్పుడు ఉత్తరాల ద్వారా, కంప్యూటర్ల ద్వారా కన్నా.. సెల్ఫోన్ల ద్వారా సందేశాలు పంపుకోవడం ఎక్కువ అరుు్యందంటే నమ్మాల్సిందే. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్టణాలకే పరిమితం కాలేదు సరికదా నేడు అది పల్లెల నుంచి గల్లీ వరకు చేరుకుంది. విద్యార్థులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. వీటికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి ఉండడంతో ప్రపంచాన్ని పది నిమిషాల్లో చుట్టి వచ్చే పరిస్థితులు వచ్చాయి. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తెలిసిపోవడంతో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇలా వివిధ రకాల అప్లికేషన్లు ఇంటర్నెట్లో కదలాడుతూనే ఉన్నారుు. పలువురు సాంకేతికతను వీలైనంతగా వినియోగించుకుంటున్న విద్యార్థులు ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎక్కడికక్కడే గ్రీటింగ్స్ కోసం సందేశాలతో కూడిన చిత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. అనేక వెబ్సైట్లు.. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అనేక రకాల వెబ్సైట్లు దర్శనమిస్తాయి. గూగుల్‌తోపాటు యాహూ, జీ మెయిల్, రెడిఫ్ మెయిల్, వేటు ఎస్ఎంఎస్, ఫుల్‌ఆన్ ఎస్ఎంఎస్, 160బై2, సైట్2 ఎస్ఎంఎస్, అల్టూ, ఎస్ఎంఎస్ ఏబీసీ, యూమింట్, ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్‌తోపాటు అనేక రకాలు వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎక్కుడ వున్న వారికైనా వారి మొయిల్స్‌కు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులతో సహా పంపించడానికి అవకాశం ఉంది. ఇక స్కైప్, త్రీజీ సేవల ద్వారా నేరుగా చూస్తూ కూడా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు. తగ్గిన గ్రీటింగ్ కార్డుల హవా.. నూతన సంవత్సరం వచ్చిందంటే రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు హల్చల్ చేసేవి. వారం రోజుల ముందు నుంచి ఎక్కడ చూసినా అందమైన స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్స్ విక్రరుుంచే వారు. రూపారుు నుంచి మొదలు పెడితే రూ.1000 వరకు ధరల్లో గ్రీటింగ్ కార్డులు అందుబాటులో ఉండేవి. నిత్యం ఆ స్టాల్స్ వినియోగదారులతో కళకళలాడుతుండేవి. విద్యార్థిని, విద్యార్థులు, యువతి, యువకులు, స్నేహితులు, బంధువులు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అందమైన గ్రీటింగ్ కార్డుల ద్వారానే తెలియజేసేవారు. ఈ గ్రీటింగ్ కార్డులకు 180 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రీటింగ్‌లు ప్రస్తుతం ప్రాభవం కోల్పోయూరుు. క్రమక్రమంగా అవి కనుమరుగయ్యూరుు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ లు అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువయ్యూరు. ఆన్లైన్లోనే శుభాకాంక్షలు తెలుపుతున్న ఈ తరుణంలో గ్రీటింగ్ కార్డులపై క్రేజీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్న యువతీయువకులు తమ సెల్ఫోన్ల ద్వారా ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయరే కాదు అన్ని ప్రత్యేకతలు కలిగిన రోజులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి భావాలను వివిధ కోణాల్లో చాటుతున్నారు. -
సమైక్య ఉద్యమానికి మున్సిపల్ కమిషనర్ల మద్దతు
తెనాలిరూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మున్సిపల్ కమిషనర్ల సంఘం మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఉద్యోగులు ఈ నెల 13వ తేదీ నుంచి చేపట్టిన విధుల బహిష్కరణకు కమిషనర్లు పూర్తి మద్దతు తెలిపారు. సీమాంధ్రలోని 13 జిల్లాల పురపాలక సంఘ కమిషనర్లు ఈ నెల 26 నుంచి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొననున్నట్టు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల సంఘం వైస్ చైర్మన్, మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక రహదారి బంగళా ఆవరణలోని మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ల సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా చేపట్టనున్న కార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం శ్రీనివాసరావు విలేకర్లకు తమ ప్రణాళికను వివరించారు. ఈనెల 26న కమిషనర్లందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 27, 28 తేదీల్లో రెండు రోజుల మాస్ క్యాజువల్ లీవ్ పెడతామని, 27వ తేదీన పురపాలక సిబ్బందితో సమ్మెలో పాల్గొని, 28న సిబ్బందితో సహా ఆయా జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటారని చెప్పారు. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఎన్జీఓలు, మున్సిపల్ సిబ్బందితో కలసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలియజేస్తారని, సెప్టెంబర్ 2వ తేదీన రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వీధి దీపాలను ఆర్పి వేసి నిరసన తెలుపుతారన్నారు. 3, 4 తేదీల్లో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఈ-మెయిల్స్, పోస్ట్ కార్డులు పంపే కార్యక్రమాలు, 7, 8 తేదీల్లో ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు సమైక్యాంధ్ర పోస్టర్లు, స్టిక్కర్లు అంటించడం, 10, 11 తేదీల్లో స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్టు కమిషనర్ల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి.బాలస్వామి వివరించారు. పజలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తితే మినహా ఉద్యమాన్ని ఆపేది లేదని కమిషనర్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రేపల్లె పొన్నూరు, సత్తెనపల్లి, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట పురపాలక సంఘాల కమిషనర్లు, కమిషనర్ల సంఘం కో కన్వీనర్లు సంపత్‌కుమార్, జశ్వంత్‌రావు, భానుప్రసాద్, శ్రీనివాసరావు, శివారెడ్డి, ఏసుదాస్, తెనాలి అసిస్టెంట్ కమిషనర్ కల్లూరి వసంతలక్ష్మి, రెవెన్యూ అధికారి బి.విజయసారధి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.