got
-
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
-
ఆ స్టార్ 'ఎలుగుబంటి' ఇకలేదు..
Bart The Bear 2 Is Dead In Utah: సినిమాల్లో అప్పుడప్పుడు అలరించే జంతువులపై చిన్న పిల్లలకు, పెద్దవారికి ఒకరకమైన ఇష్టం ఏర్పడుతుంది. తెలుగు చిత్రం 'సిసింద్రీ'లో కనపడే జంతువులు ప్రేక్షకులకు ఎంత నచ్చాయో అందరికీ తెలిసిందే. కీలక పాత్రల్లో నటించే ఈ యానిమల్స్ అంటే పిల్లలకు మహాసరదా. హాలీవుడ్లో అయితే ఏకంగా వాటినే హీరోలుగా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది ఆ ఎలుగుబంటి. తనదైన యాక్టింగ్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. అనేకమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఎలుగు ఇకలేదు. అనారోగ్య సమస్యలతో 'బార్ట్ ది బేర్ 2' మరణించింది. 2000 సంవత్సరంలో అలాస్కాలోని అడవుల్లో ఈ ఎలుగు చిన్న వయసులోనే అధికారులకు దొరికింది. వేటగాడికి బలైన తన తల్లిపక్కన ఉన్న ఈ చిన్న ఎలుగును తీసుకొచ్చి సంరంక్షించారు. దీంతోపాటు 'బార్ట్ ది బేర్ 2' సిస్టర్ ఎలుగు 'హనీ బంప్' కూడా ఉంది. 'బార్ట్ ది బేర్ 2' పెరిగాక అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. చిత్రాల్లోనే కాకుండా అనేక టీవీ షోలు, ప్రకటనల్లో తళుక్కుమంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షాధరణ పొందిన హాలీవుడ్ మెగా వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ (జీవోటీ)'తో ఎంతోమంది అభిమానులను కూడగట్టుకుంది. అంతకుముందు కూడా చాలా సినిమాల్లో నటించిందీ ఎలుగు. యాన్ అన్ఫినిష్డ్ లైన్, విత్ఔవుట్ ఏ ప్యాడిల్, డాక్టర్ డూ లిటిల్ 2, ఇంటూ ది గ్రిజ్లీ మేజ్, హార్స్ క్రేజీ టూ, ఇంటూ ది వెస్ట్, ఇంటూ ది వైల్డ్, ఈవాన్ ఆల్మైటీ, జూకీపర్, హేవ్ యూ హియర్డ్ అబౌట్ మోర్గాన్స్, పీట్స్ డ్రాగన్, వీ బాట్ ఏ జూ వంటి చిత్రాల్లో మెరిసింది. 'బార్ట్ ది బేర్ 2' మరణంపై జీవోటీలో దానితో యాక్షన్ సీన్ చేసిన గ్వైండాలీన్ క్రిస్టీ విచారం వ్యక్తం చేసింది. ఎలుగు ఆత్మకు శాంతి కలగాలని కోరింది. తన సినీ కెరీర్లో అత్యుత్తమ కో-స్టార్ అని తెలిపింది. షూటింగ్లో ఎలుగుని శాంతింపజేయడానికి అది నటించిన సినిమా ట్రైలర్లు, పాశ్చాత్య సంగీతాన్ని సెట్స్‌లో ప్లే చేస్తుండేవారని గుర్తు చేసుకుంది. దాంతో నటించిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించానని, జీవోటీలో బార్ట్‌తో ఫైట్ చేసిన ఫొటోను షేర్ చేసింది. 'బార్ట్ ది బేర్ 2' ఒక గొప్ప ఎలుగని, దాంతో ఇన్నాళ్లు కలిసి ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నామని 'ది వైటల్ గ్రౌండ్ ఫౌండేషన్' తెలిపింది. ఎలుగు సంరక్షణ బాధ్యతలు చేపట్టిన ఈ సంస్థ యూటాలోని డేనియల్ క్రీక్ ఒడ్డున ప్రశాంతంగా బార్ట్ కన్నుమూసిందని వెల్లడించారు. -
నాన్నపై కవిత్వానికి రామకృష్ణకు పురస్కారం
రాజమహేంద్రవరం రూరల్: ప్రముఖ కవి, చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణను ‘గూటం తాతారావు విశిష్ట సాహిత్య పురస్కారం–2016’కు ఎంపిక చేసినట్టు పురస్కార కమిటీ న్యాయనిర్ణేతలు డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, ఎస్ఆర్ పృథ్వి, గిడ్డి సుబ్బారావు, ఫణినాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు రామకృష్ణ నాన్నపై రాసిన దీర్ఘకవిత ‘అవ్యక్తం’ కవితా సంపుటి ఎంపికయ్యిందన్నారు. రెండేళ్లుగా నాన్న వస్తువుగా కవిత్వం రాసిన వారికి కీ.శే. గూటం తాతారావు కళావేదిక పురస్కారాలు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఆత్మకూరు రామకృష్ణ ¯ð ల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన వారు. చిత్రకారుడుగా సుప్రసిద్ధుడు. ఆయన కేంద్రీయ విద్యాలయం, విజయవాడ–2లో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంతవరకు నాలుగు కవితా సంపుటులను వెలువరించారు. సూర్యనారాయణకు గిడుగు భాషా సేవా సత్కారం తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన కవి, తెలుగుభాషోపాధ్యాయుడు ముంగండి సూర్యనారాయణకు గిడుగు రామ్మూర్తి పంతులు భాషా సేవా సత్కారం చేయనున్నట్టు వారు వెల్లడించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం ఆనంరోటరీ హాల్లో జరిగే గూటం తాతారావు జయంత్యుత్సవంలో వీటిని ప్రదానం చేస్తామని డాక్టర్ గూటం స్వామి, ఫణినాగేశ్వరరావు తెలిపారు. -
మాజీ ఎంపీ రాజయ్య కుటుంబానికి బెయిల్
వరంగల్ లీగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్‌లకు గురువారం నాల్గవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి జడ్జి రఘునాథ్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గతేడాది నవంబర్ 4న రాజయ్య కోడలు సారిక ఆమె ముగ్గురు కుమారులు సజీవదహనం అయిన ఘటనలో రాజయ్య, అనిల్‌కుమార్, మాధవి, అనిల్ రెండో భార్య సనా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నిందితులు పలుమార్లు మున్సిఫ్ కోర్టు, జిల్లా కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్నా పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జ్యుడీషియల్ కస్టడీలో ఉండి 90 రోజులు గడిచినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేసుకోగా షరతులతో కూడిన బెరుుల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటలలోపు సుబేదారి పోలీసుస్టేషన్లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. అలాగే, ఈనెల 15 వరకు ముగ్గురు నిందితులకు ఎలాంటి పాసుపోర్టులు ఉన్నా కోర్టుకు అందజేయాలని షరతు విధించింది. నాల్గవ నిందితురాలు అయిన సనా ఇప్పటి వరకు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోలేదు.