పంటల బీమా ఇలా..
జన్నారం : అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టాల పాల వుతుంటారు. అలాంటి వారికి చేయూతనందించేం దుకు ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేస్తోంది. జిల్లాలో ఏయే పంటలకు బీమా వర్తిస్తుం ది.. ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై మండల వ్యవసాయాధికారి మధులత వివరించారు. పంటల బీమా పథకాన్ని ఈ నెల 31వరకు పొడిగించారు.
మొక్కజొన్న, కందులు, పెస లు, పత్తి, వరి, పసుపు, సోయాబీన్ తదితర పంటలకు బీమా పథకం వర్తిస్తుంది. సోయాబీన్ పంటకు గ్రామాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. రైతులు భూమికి సంబంధించిన పట్టాదారు, పాసుపుస్తకం, పంటలు వేసినట్లు వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రంతో వ్యవసాయ కార్యాలయంలో అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకుల నుంచి రుణాలు పొందే రైతుల నుంచి బీమా ప్రీమియం మినహాయించుకుని ఇస్తారు. మిగితా రైతుల సోయాబీన్, పత్తి పంటలకు ఎకరాకు రూ.585 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు రైతు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్ అందజేయాలి. విపత్తుల ద్వారా పంట నష్టపోతే పత్తి, సోయాబీన్ పంటలకు ఎకరానికి రూ.12వేలు చొప్పున పరిహార అందుతుంది.
బీమా చేసుకున్న తీరు ఇదీ..
ఖానాపూర్ నియోజకవర్గంలో పదిశాతం మంది రైతులు కూడా పంటలకు బీమా చేసుకోలేదు. జన్నారం మండలంలో సుమారు ఐదు వేల మంది రైతులు ఉండగా ఒక్కరూ బీమా చేయించలేదు. కడెం మండలంలో 22,353 మంది రైతులకు గాను 30 మంది, ఉట్నూర్ మండలంలో 4 వేల మందికి గాను ఐదుగురు, ఇంద్రవెల్లి మండలంలో 8,210 మందికి గాను 22 మంది రైతులు బీమా చేయించారు.