The Government of Karnataka
-
మేకదాటు ఉద్రిక్తత
ముట్టడిని అడ్డుకున్న పోలీసులు 1500 మంది రైతుల అరెస్ట్ హొసూరు/కెలమంగలం : కావేరి నదిపై మేకదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ వల్ల తమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ తమిళనాడుకు చెందిన రైతులు ఉద్యమించారు. రాష్ర్ట సరిహద్దులోని మేకదాటు ప్రాంతాన్ని ముట్టడించేందుకు రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, సంఘ సంస్థలు, రైతులు సుమారు రెండు వేలకు పైగా తరలి వచ్చారు. దీంతో శనివారం డెంకణీకోటలో ఉద్రిక్తత నెలకొంది. డెంకణీకోటకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేకదాటు వరకు రైతులు ర్యాలీగా వెళ్లి, కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవాలని కావేరి హక్కుల విడుదల సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు కావేరి నదీ పరివాహక ప్రాంతాలైన తిరుచ్చి, తిరువారూరు, తంజావూరు, నాగై, సేలం, క్రిష్ణగిరి, ధర్మపురి, నామక్కల్ తదితర జిల్లాల రైతులు శుక్రవారం రాత్రికి డెంకణీకోట, హొసూరుకు చేరుకున్నారు. శనివారం ఉదయం డెంకణీకోట పాతబస్టాండు నుంచి ర్యాలీ మొదలైంది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు పాడికట్టి దానిపై ఓ రైతును పడుకోబెట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ 50 మీటర్ల దూరం వెళ్లగానే భారీగా మొహరించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరిస్థితి విషమిస్తుండడంతో చేతికి చిక్కిన 1500 మంది రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని ఉంచేందుకు సరైన వసతి లేకపోవడంతో వెంటనే కల్యాణమంటపాలకు తీసుకెళ్లారు. -
మొదటి దశలో 40 సేవలు
8న మొబైల్ గవర్నెన్స్ ‘మొబైల్ వన్’ ప్రారంభం 161 నంబర్ కేటాయింపు : సీఎం బెంగళూరు : దేశంలో మొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం అమలు చేయనున్న మొబైల్ గవర్నెన్స్ ‘మొబైల్ వన్’లో మొదటి దశలో 40 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. దశలవారిగా వీటిని ప్రభుత్వం అందించే అన్ని సేవలకు మొబైల్వన్ను విస్తరించనున్నామన్నారు. దాదాపు 400 సేవలను అందించడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ మొబైల్వన్ సేవలను పొందడానికి ప్రభుత్వం 161 నంబర్‌ను కేటాయించిందన్నారు. ఈనెల ఏడున ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరగనున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాగా, మొబైల్ గవర్నెన్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 8న బెంగళూరులోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి మీడియా ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రికలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్వనిని ముందుగానే రికార్డ్ చేసి ఉండటం గమనార్హం -
ఆర్డీఎస్ ఎత్తు పెంపును అడ్డుకోవాలి
కోసిగి రూరల్: రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఎత్తును పెంచకుండా రాష్ట్ర ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య కోరారు. కోసిగి మండలం అగసనూరు సమీపంలోని ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చేపట్టడంతో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని శనివారం రామచంద్రయ్యతో పాటు సంఘం జిల్లా అధ్యక్షుడు బీజీ మాదన్న, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ య్ సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం సీడబ్ల్యూసీ అనుమతి లేకుం డా ఆర్డీఎస్ ఎత్తును పెంచడానికి వీలు లేదన్నారు. ఆర్డీఎస్ ఎత్తును అర అడు గు మేరకు పెంచితే దిగువనున్న కర్నూ లు, కడప జిల్లాల రైతులకు తాగు, సా గునీటి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు కలిసి ఆర్డీఎస్ ఎత్తు పెంపకంపై న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డీఎస్ను సందర్శించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గిడ్డయ్య, రైతు సంఘం ఉపాధ్యక్షుడు సత్యన్న, సీపీఐ కోసిగి మండలం నాయకులు పాల్గొన్నారు.