వచ్చే మార్చి కల్లా పూర్తి స్థాయలో రిలయన్స్ పెట్రోల్ బంకులు
- కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: పెట్రోల్ బంక్‌ల నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో మళ్లీ ప్రారంభించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి కల్లా 300 పెట్రోల్ పంపులు పనిచేస్తున్నాయని, వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం 1,400 పెట్రోల్ పంపుల నెట్‌వర్క్‌ను మళ్లీ ప్రారంభించనున్నామని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2006లో పెట్రోల్ పంపుల నెట్‌వర్క్‌ను రిలయన్స్ ప్రారంభించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు వచ్చినట్లు రిలయన్స్‌కు ఆ వెసులబాటు లేకపోవడంతో చాలావరకూ బంకుల్ని మూసేయక తప్పలేదు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై నియంత్రణను తొలగించడంతో ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలకు సమానఅవకాశాలు కల్పించినట్లయింది.