పట్టణాలకూ మరుగుదొడ్లు మంజూరు
ఏలూరు : పట్టణాల్లోనూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. సుమారు పదేళ్ల క్రితం వరకూ ఈ పథకం పట్టణాల్లో అమలైంది. ఆ తరువాత నిలిపివేశారు. తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) కింద ఏలూరు నగరంతోపాటు ఏడు పురపాలక సంఘాలు, ఓ నగర పంచాయతీకి కలిపి మొత్తం 13,098 మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇప్పటివరకు 8,970 వరకు దరఖాస్తులు అందాయి. ఇంకా గడువు ఉండటంతో దరఖాస్తులు పెరుగుతాయని అధికారులు అంటున్నారు. రానున్న ఆర్ధిక సంవత్సరం నుంచి వీటి నిర్మాణాలు మొదలువతాయి.ఆదాయ పరిమితితో పనిలేదుస్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద రూ.15వేల వ్యయంతో మరుగుదొడ్డిని నిర్మిస్తారు. దీనికి చేయాల్సిందల్లా లబ్ధిదారులు దరఖాస్తుతోపాటు ఆధార్ జిరాక్సు, పోన్ నంబర్ ఇస్తే సరిపోతుంది. దీనికి ఆదాయ పరిమితి లేదు. నిర్ణీత నమూనాలో ఆయా పురపాలక సంఘాల్లో దరఖాస్తులను పూరించి ఇస్తే సరిపోతుంది.