graphene
-
గుడ్ న్యూస్.. అదే జరిగితే ఫోన్ రేట్లు తగ్గడం ఖాయం!
సాధారణంగా స్మార్ట్ ఫోన్ తయారీలో డిస్ప్లే, కొన్ని ప్యానెల్స్ క్వాలిటీ విషయంలో ఫోన్ మేకర్లు కాంప్రమైజ్ అవ్వరు. ఇండియమ్ అనే అరుదైన ఎలిమెంట్‌ను ఇందుకోసం ఉపయోగిస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. అయితే ఇండియమ్ ప్లేస్‌లో మరో మెటీరియల్‌ను తీసుకొస్తే.. తమ భారం తగ్గుతుందని, తద్వారా ఫోన్ల రేట్లు తగ్గించి మార్కెట్ పెంచుకోవాలని దశాబ్ధం పైగా కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో గుడ్ న్యూస్ చెప్పారు యూకే రీసెర్చర్లు. భూమ్మీద దొరికే తొమ్మిది అరుదైన మూలకాల్లో Indium మూలకం ఒకటి. ఇండియంతో(Indium Tin Oxide రూపంలో) ఓఎల్ఈడీ(organic light-emitting diode) టచ్ స్క్రీన్లను, ఇతర ప్యానెల్స్‌ను తయారు చేస్తుంటారు. మొబైల్స్‌తో పాటు కంప్యూటర్, పీసీలు, టీవీలు, సోలార్ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్స్ తయారీలో సైతం ఈ మూలకాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది చాలా చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఫోన్ ధరల విషయంలో కొన్ని కంపెనీలు అస్సలు కాంప్రమైజ్ అవ్వవు. అయితే ఈ మెటీరియల్ ప్లేస్‌లోకి గ్రాఫిన్‌ను గనుక తీసుకొస్తే.. ఫోన్ మేకర్స్‌కి భారీ ఉపశమనం దొరుకుతుందనే ప్రయోగాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో.. యూకేకి చెందిన పేరాగ్రాఫ్ కంపెనీ, లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ప్రత్యామ్నాయ మెటీరియల్ విషయంలో స్పష్టత వచ్చింది. గ్రాఫిన్‌తో తయారు చేసిన ఓఎల్ఈడీ డిస్ప్లే, ప్యానెల్స్‌ను.. డెమోను విజయవంతంగా చూపించారు పరిశోధకులు. తద్వారా ఇండియమ్‌కు గ్రాఫిన్ సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ఇన్నాళ్లకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఇండియమ్ ప్యానెల్ వాస్తవానికి ఇండియమ్‌కు ఆల్టర్నేట్ కోసం చాలా కాలంగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఏదీ ఇండియమ్ ఇచ్చినంత అవుట్‌పుట్ ఇవ్వలేకపోయింది. ఈ తరుణంలో గ్రాఫిన్ రీప్లేస్ చేస్తుందన్న వార్త ఫోన్ మేకర్స్‌కు శుభవార్తే అని చెప్పొచ్చు. ఇక Grapheneను వండర్ మెటీరియల్ అని అభివర్ణిస్తుంటారు. ఇండియమ్‌తో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. సింగిల్ లేయర్ కార్బన్ అణువులు, తేనెపట్టులాంటి నిర్మాణంను పోలి ఉండే గ్రాఫిన్‌ను.. భూమ్మీద దొరికే బలమైన మెటీరియల్స్‌లో ఒకటిగా చెప్తుంటారు. కానీ, అవసరానికి అనుగుణంగా ఆకారాన్ని మార్చుకోవచ్చు.. పైగా కాపర్ కంటే మంచి విద్యుత్ వాహకంగా పని చేస్తుంది కూడా. మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఇప్పటిదాకా గ్రాఫిన్‌ను వాడింది లేదు. కాబట్టి.. తొలి అడుగు పడడానికి కొంచెం టైం పట్టొచ్చు(అన్నీ కుదిరితే 2023 తొలి భాగం అనేది ఒక అంచనా). అదే జరిగితే స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. కంప్యూటర్లు, టీవీల తయారీ ఖర్చు..మార్కెట్లో కొన్ని బ్రాండెడ్ ఫోన్ ధరలు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. చదవండి: జీమెయిల్ మెమెరీ ఫుల్ కాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి -
తాగారో...మీ బండి కదలదంతే..!
ఉత్తరాఖండ్ : మన దేశంలో గంటకి సగటున 16 యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలుపుతోంది. వీటి నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. సరైన ఫలితం మాత్రం ఉండటం లేదు. ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు తాగి వాహనాలు నడపడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, నిద్ర మత్తులో వాహనాలు నడపడం. దీంతో యాక్సిడెంట్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక మీద ఇలాంటి ప్రమాదాల నివారణకు ఉత్తరాఖండ్‌కు చెందిన విద్యార్థులు ఒక నూతన పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని వాహనాలలో అమర్చిన తరువాత తాగి వాహనాన్ని నడపాలని ప్రయత్నిస్తే అవి మోరాయించేలా చేస్తుంది ఈ పరికరం. అల్మోరాలోని ఉత్తరాఖండ్ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం, హల్ద్వానికి చెందిన ఆర్ఐ ఇనుస్ట్రుమెంట్స్ అండ్ ఇన్నోవేషన్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. ఆర్ పీ జోషి, ఆకాష్ పాండే, కుల్దీప్ పటేల్ కలిసి జట్టుగా ఏర్పడి వ్యర్థాలు, అడవి గడ్డి వంటి పదార్థాలను ఉపయోగించి గ్రాఫీన్‌ను తయారు చేశారు. ప్రమాదాల నివారణకు ఈ గ్రాఫీన్ పూత పూసిన ఎలక్ట్రోడ్లను వాహనాలలో అమర్చుతారు. ఈ ఎలక్ట్రోడ్లు ముఖ్యంగా మద్యంలో ఉన్న ఈథైల్ ఆల్కహాల్‌ను ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఎసిటిక్ ఆమ్లంగా మారుస్తుంది. పనిచేయు విధానం... ఈ సెన్సార్‌ను వాహనంలో డ్రైవర్ ముందు భాగంలో బిగిస్తారు. డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ముందు గ్రాఫీన్ సెన్సార్ మీద ఊదాలి. ఇలా ఊదగానే సెన్సార్ ఆక్టివేట్ అయ్యి రక్తంలో ఆల్కహాల్ ఎంత ఉందనే విషయాన్ని విశ్లేషిస్తుంది. ఒకవేళ ఆల్కహాల్ లిమిట్ మోటర్ వాహనాల చట్టం ప్రకారం నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఉంటే సెన్సార్‌లో ఎరుపు రంగు గుర్తు వస్తుంది. వాహనం స్టార్ట్ కాదు. ఒకవేళ గ్రాఫీన్ సెన్సార్‌పై ఊదకుండా వాహనాన్ని స్టార్ట్ చేద్దామన్న కూడా కదలదు. తప్పనిసరిగా గ్రాఫీన్ సెన్సార్‌పై ఊదిన తర్వాతే వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. సెన్సార్‌లోని ఇమాజింగ్ మాడ్యుల్, డ్రైవర్ కంటి కదలికలను విశ్లేషించి, అతను నిద్రపోతున్నట్టు అనిపిస్తే పక్కనే ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేస్తుంది. అంతేకాక ఈ ఇమాజింగ్ మాడ్యుల్ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నట్లయితే, అతని చుట్టుపక్కల వారికి అలర్ట్ ఇస్తుంది. మరిన్ని ప్రత్యేకతలు... ఇవేకాక ఈ పరికరంలో జీపీఆర్ఎస్ - జీఎస్ఎం, బయోమెట్రిక్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా రూపొందించారు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినట్లయితే 5 - 10 నిమిషాల్లో దానంతట అదే 100కు ఫోన్ చేసి ఎస్ఓఎస్ను కూడా పంపిస్తుంది. విద్యార్థులు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి ఉత్తరాఖండ్ గవర్నర్ కే. కే. పౌల్ అభినందనలు తెలిపారు. వెంటనే దీనికి పేటెంట్‌కు దరఖాస్తు చేసుకోమని సూచించారు. అంతేకాకుండా వాణిజ్య వాహనాలలో కూడా వాడుకునే విధంగా ఈ పరికరంలో మార్పులు చేయాల్సిందిగా కోరారు. ఈ పరికరాన్ని వాహనాలలో వాడడాని కంటే ముందు మనేసర్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, గురుగ్రాంలోని ఎస్.జీ.ఎస్ ల్యాబ్, పూణేలోని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వద్ద పరీక్షిస్తారు. ఆ తరువాతనే దీన్ని వాహనాలలో అమర్చడానికి అనుమతి ఇవ్వనున్నారు. -
ఎరువుల ఖర్చు తగ్గించే సరికొత్త గ్రాఫీన్.
రైతులకు ఉన్న అనేకానేక కష్టాల్లో ఎరువుల ఖర్చు ఒకటి. పోనీ ఇంత ఖర్చు పెట్టి వేసిన ఎరువులు పూర్తిస్థాయిలో ఫలితమిస్తాయా? అంటే అదీ లేదు. వానొస్తే లేదా నీళ్లల్లో కలిస్తే ఎరువులు వాటితో కొట్టుకుపోతాయి. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గ్రాఫీన్ ఆక్సైడ్ పదార్థం ఆధారంగా కొత్త రకం ఎరువులను తయారు చేశారు. భూమిలోకి చేరిన తరువాత ఇవి చాలా నెమ్మదిగా తమ లోపల ఉండే ఎరువులను విడుదల చేస్తాయి. సాధారణ ఎరువులు కేవలం 12 నుంచి 24 గంటల్లోపు వాటిలోని పోషకాలన్నింటినీ విడుదల చేసేస్తాయి. ఈ క్రమంలో అవసరమైన సమయంలో మొక్కలకు ఎరువులు అందే అవకాశం లేకుండా పోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైక్ మెక్లాగిన్ తెలిపారు. అయితే గ్రాఫీన్ ఆక్సైడ్ ఆధారంగా తయారైన ఎరువులు నెలరోజుల వరకూ పోషకాలను నెమ్మదిగా విడుదల చేసేలా తయారు చేసుకోవచ్చునని మైక్ తెలిపారు. తాము తమ పరిశోధనల్లో జింక్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలను గ్రాఫీన్ ఆక్సైడ్ ద్వారా గోధుమ పంటకు అందించారు. సాధారణ ఎరువులతో పండుతున్న పంటలతో పోల్చి చూసినప్పుడు గ్రాఫీన్ ఆక్సైడ్ ఎరువులు వాడిన పంటల్లో ఈ రెండు సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మైక్ వివరించారు. భూమిలో ఉండే సేంద్రియ కార్బన్ నిర్మాణాన్ని దగ్గరగా పోలి ఉండటం వల్ల గ్రాఫీన్ ఆక్సైడ్ వాడకం పర్యావరణపరమైన సమస్యలేవీ సృష్టించదని మైక్ అంటున్నారు. -
బుల్లెట్లను కూడా అడ్డుకోగలకొత్త పదార్థం!
గ్రాఫీన్ గురించి మీరెప్పుడైనా విన్నారా? వినకపోయినా ఫర్వాలేదు లెండి... పెన్సిల్ తీసుకుని కాగితాన్ని నలుపు చేయండి... ఆ నలుపు రంగు పొరనే గ్రాఫీన్ అంటారు. అయితే ఏంటి అంటారా? చాలానే ఉంది. ఈ రకమైన గ్రాఫీన్ పొరలు రెండింటిని సక్రమంగా అతికిస్తే చాలు... బుల్లెట్లను కూడా తట్టుకోగల వినూత్న పదార్థం రెడీ అయిపోతుంది! ఆశ్చర్యంగా ఉందా? కొంచెం వివరంగా చూద్దాం. వజ్రం మాదిరిగానే గ్రాఫీన్ కూడా కార్బన్‌తోనే తయారవుతుంది. ఒక పొర గ్రాఫీన్‌ను చూస్తే... అందమైన డిజైన్‌తో కూడిన ఇనుప ఫెన్సింగ్ మాదిరిగా ఉంటుంది. ఈ ఆకారం కారణంగానే గ్రాఫీన్‌కు కొన్ని అద్భుతమైన లక్షణాలు అలవడతాయి. అదలా ఉంచితే.. దీంట్లో మూడు ఎలక్ట్రాన్లు గట్టిగా బంధం ఏర్పరచుకుని ఉంటే.. నాలుగో ఎలక్ట్రాన్ విడిగా ఉంటుంది. ఇది కూడా ఇంకో కార్బన్ పరమాణవుతో ముడిపడితే... గ్రాఫీన్ కాస్తా వజ్రంగా మారుతుంది! ఈ నేపథ్యంలో సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు.. తగినంత బలంతో కొడితే రెండు పొరల గ్రాïఫీన్ కాస్తా వజ్రం వంటి దృఢమైన పదార్థంగా మారిపోయేలా చేశారు. అకస్మాత్తుగా వచ్చిపడే బలం కారణంగా గ్రాఫీన్‌లో విడిగా ఉన్న ఎలక్ట్రాన్లు ఇతర పరమాణవులతో బంధం ఏర్పరచుకోవడం దీనికి కారణం. ఇప్పుడు... రెండు గ్రాఫీన్ పొరల పూత ఉన్న ఓ జాకెట్‌ను ఊహించుకుందాం. దాని పైకి రయ్యిమని ఒక బుల్లెట్ దూసుకొచ్చిందనుకుందాం. ఆ శక్తి కాస్తా గ్రాఫీన్ పొరలను దృఢంగా మార్చేస్తుంది కాబట్టి... బుల్లెట్ లోపలికి దిగకుండా అక్కడే ఆగిపోతుంది! అతి పలుచగా ఉండటమే కాకుండా బుల్లెట్లను కూడా తట్టుకోగల జాకెట్ రెడీ అవుతుందన్నమాట! సూపర్ ఐడియా కదూ! -
గ్రాఫీన్‌తో వేగవంతమైన డయాలసిస్!
కిడ్నీలు పాడైతే డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. అయితే డయాలసిస్ చేయించుకోవాలంటే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఆ సమయంలో విపరీతమైన నొప్పి అనుభవించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఇంగ్లండ్‌లోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని కనుక్కున్నారు. గ్రాఫీన్ అనే పదార్థంతో తయారు చేసిన ఫిల్టర్లను ఉపయోగిస్తే.. డయాలసిస్ పదిరెట్లు ఎక్కువ వేగంతో జరుగుతుందని నిరూపించారు. దీంతో ఈ ప్రక్రియ అతితక్కువ సమయంలోనే పూర్తవుతుందన్న మాట. డయాలసిస్ యంత్రాల్లో ఉపయోగిస్తున్న ఫిల్టర్లు చాలా మందంగా ఉంటాయని, గ్రాఫీన్ ఒక నానోమీటర్ మందం మాత్రమే ఉండటం వల్ల రక్తంలోని వ్యర్థ పదార్థాలను సులువుగా, వేగంగా వేరు చేయొచ్చని మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన పిరన్ కిడాంబి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వేర్వేరు సైజుల గ్రాఫీన్ పొరలను తయారు చేసేందుకు కొత్త పద్ధతిని సిద్ధం చేశామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా కేవలం 0.66 నానోమీటర్ల సైజుండే పొటాషియం క్లోరైడ్ అణువులను కూడా ఫిల్టర్ చేయగల పొరలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు అడ్వాన్స్ మెటీరియల్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.