grenade attack
-
గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలి జవాన్ మృత్యువాత
దంతెవాడ(ఛత్తీస్‌గఢ్): బీఎస్ఎఫ్ జవాను ఒకరు గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలడంతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ 70వ బెటాలియన్ జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా కాటేకల్యాణ్ పోలీస్‌స్టేషన్‌లో మకాం వేశారు. తనిఖీల కోసం బయలుదేరి వెళ్తున్న సమయంలో బల్బీర్ చంద్ అనే జవాను వద్ద పౌచ్‌లో ఉన్న గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలింది. తీవ్రంగా గాయపడిన బల్బీర్‌ను వెంటనే దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బల్బీర్ చంద్ స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. -
పూంఛ్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన ఆర్మీ
-
గ్రెనేడ్ దాడిలో సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
శ్రీనగర్ : కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సీఆర్పీఎప్ పెట్రోలింగ్ వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనైడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని బిజేహరాలో చోటుచేసుకుంది. కాగా గ్రనైడ్ దాడిలో ఇద్దరు గాయపడగా వారిలో హెడ్ కానిస్టేబుల్ శివలాల్ నీతమ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా మరొకరి పరిస్థితి బాగానే ఉందన్నారు. మంగళవారం సాయంత్రం బిజ్బెహరా ఏరియాలో సీఆర్పీఎఫ్ వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. -
సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి
శ్రీనగర్ : శ్రీనగర్‌లోని కవ్‌దారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనాలపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడగా వారు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా ద్వంసమయ్యాయి. అయితే ఈ దాడులు సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్లతో దాడులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులు కదలికలను గుర్తించేందుకు పరిశోధన నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఐదో విడత’లోనూ హింస
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం హింసాత్మకంగా ముగిసింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పోలింగ్ కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరగా, పశ్చిమబెంగాల్లో అధికారణ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.5 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. 8.75 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని వెల్లడించింది. ఐదో విడత పోలింగ్‌లో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ఈ జాబితాలో జమ్మూకశ్మీర్ చిట్టచివరి స్థానంలో నిలిచినట్లు ఈసీ చెప్పింది. తృణమూల్ నేతపై బలగాల దాడి.. ఐదో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో సోమవారం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బర్రాక్పోర్ సీటు నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు యత్నించగా, కేంద్ర బలగాలను ఆయన్ను అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలను స్వేచ్ఛగా ఓటేయనివ్వడం లేదని ఆరోపించారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను పోలీసులు అడ్డుకోవడం లేదని విమర్శించారు. బర్రాక్‌పోర్‌లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బన్గావ్ నియోజకవర్గంలో టీఎంసీ, బీజేపీ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు బాంబులు విసురుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బలిటికురి లోక్‌సభ స్థానంలో టీఎంసీ అభ్యర్థి, భారత ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు ప్రసూన్ బందోపాధ్యాయ పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించేందుకు యత్నించడంతో సాయుధ సిబ్బంది ఆయనపై చేయిచేసుకున్నారు. ప్రజల ఓట్లను బలవంతంగా వేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో ఓ ప్రిసైడింగ్ అధికారిని ఈసీ విధులనుంచి తప్పించింది. పోలింగ్ కేంద్రం పేల్చివేత.. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ సీటుకు ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని రహ్మూ పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ విసిరారు. అలాగే త్రాల్‌లోని మరో పోలింగ్ కేంద్రాన్ని పేల్చివేశారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనీ, ఎవ్వరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఎన్నికల్లో లడఖ్ నియోజకవర్గంలో 71.10 శాతం పోలింగ్ నమోదుకాగా, ఎన్నికలను బహిష్కరించాలని ఉగ్రవాదులు, వేర్పాటువాదులు హెచ్చరించిన నేపథ్యంలో అనంతనాగ్‌లోని పుల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో పోలింగ్ 3 శాతాన్ని దాటలేదు. దీంతో అనంతనాగ్‌లో మూడుదశల్లో కలిపి పోలింగ్ 8.76 శాతానికే పరిమితమయింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ గ్రామం షరీఫాబాద్లో ఎవ్వరూ ఓటేయలేదు. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలికొన్న ఆత్మాహుతి బాంబర్ ఆదిల్‌దార్ గ్రామమైన గుండీబాగ్లో 350 మంది ప్రజలుండగా కేవలం 15 మందే ఓటేశారు. ఉగ్రవాదులు జకీర్ ముసా గ్రామమైన నూరాబాద్, రియాజ్ నైకూ స్వగ్రామం బైగ్పొరా, ‘పుల్వామా’ సూత్రధారి ముదస్సీర్ ఖాన్ ఊరు షేక్‌పొరాలో సున్నా పోలింగ్ నమోదైంది. మరోవైపు ప్రాణభయంతో కశ్మీర్‌ను విడిచిపెట్టి పారిపోయిన పలువురు కశ్మీరీ పండిట్లు సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాహుల్ బూత్ క్యాప్చరింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడేలా పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా అమేథీకి చెందిన ఓ వృద్ధురాలు ‘నేను కమలం(బీజేపీ) గుర్తుకు ఓటేయబోతే, బలవంతంగా హస్తం(కాంగ్రెస్) గుర్తుకు వేయించారు’ అని చెబుతున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల ప్రధానాధికారి.. ‘ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపాం. ఆ వృద్ధురాలు చేసిన ఆరోపణలు నిరాధారమని తేలింది’ అని స్పష్టం చేశారు. రాహుల్ యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమేథీలో 53 శాతం పోలింగ్ నమోదుకాగా, రాయ్‌బరేలీలో 53.68 శాతం పోలింగ్ నమోదయిందని ఈసీ తెలిపింది. అలాగే లక్నోలో 53% పోలింగ్ నమోదయిందని పేర్కొంది. బిహార్‌లో ఈవీఎం ధ్వంసం బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. బిహార్‌లోని సరన్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సరన్‌లోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో, మధుబనీలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమయింది. సీతామర్హి, ముజఫర్‌పూర్ నియోజకవర్గాల్లో కూడా ఇదే సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఐదో విడత ఎన్నికలు ముగియడంతో మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు గానూ 424 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఐదు విడతల్లో ఇదే అత్యల్ప పోలింగ్ కావడం గమనార్హం. తొలి విడతలో 69.50 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 69.44 శాతం, మూడో విడతలో 68.40 శాతం, నాలుగో విడతలో 65.51 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్ హాజీపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు -
9వ తరగతి విద్యార్థి లంచ్‌బాక్స్‌లో గ్రెనేడ్ తీసుకొచ్చి
-
జమ్మూలో గ్రెనేడ్ దాడి చేసింది 9వ తరగతి విద్యార్థి!
జమ్మూ: జమ్మూలో గ్రెనేడ్ దాడి జరిపింది 9వ తరగతి విద్యార్థేనని నిఘావర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు గ్రెనేడ్‌ను లంచ్ బాక్స్‌లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్ లక్ష్యంగా దాడి జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాడి జరిపి తిరుగు ప్రయాణమైన దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు జమ్ముకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రేనేడ్ తయారు చేశాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక నిందితుడు జమ్ముకు రావడం ఇదే తొలిసారని, అతను కారులో బుధవారమే ఇక్కడికి చేరాడని పేర్కొన్నారు. అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కోసం కూడా గాలిస్తున్నామన్నారు. మైనర్ అయిన నిందితుడు ఒక్కడే 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు? అది వన్‌వే ట్రాఫిక్ కలిగిన శ్రీనగర్-జమ్ము నేషనల్ హైవేపై ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో నిందితుడు చెప్పాడన్నారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
జమ్మూలో గ్రెనేడ్ దాడి
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు. ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి. ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాది హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్‌గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూపీలో కశ్మీరీలపై దాడి చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్‌కు చెందిన యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్‌ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. -
గ్రెనేడ్ దాడి కేసులో నిందితుడి పట్టివేత
-
గ్రెనేడ్ దాడి కేసులో నిందితుడి పట్టివేత
ఢిల్లీ: జమ్మూ బస్టాండ్‌లో ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పలాయనం చిత్తగించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూ నుంచి పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం 11.45 గంటలకు జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు మృతిచెందగా..30 మందికి తీవ్రగాయాలైన సంగతి తెల్సిందే. పట్టుబడిన అనంతరం నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో నిందితుడిని త్వరగా పట్టుకోగలిగారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని జమ్మూ ఐజీ మనీష్ సిన్హా తెలిపారు. జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు -
మాజీ మంత్రులకు మరణశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్‌ఫోజ్మన్ బాబర్‌కు గ్రెనేడ్ దాడి కేసులో స్థానిక కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి బాబర్‌తో పాటు మరో 19 మందికి ఆ కేసులో మరణశిక్షను ఖరారు చేశారు. తీర్పు సందర్బంగా స్పెషల్ కోర్టు న్యాయమూర్తి షెహజాద్ నురుద్దిన్ ఆ సంఘటనను వివరిస్తూ.. ఈ నిందితులు ఇక జీవించే హక్కు లేదని ఉద్విగ్నభరితంగా తీర్పులు వెలువరించారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది. 2004, ఆగస్టు 21న జరిగిన గ్రేనేడ్ దాడిలో 20 మందికిపైగా మరణించారు. సుమారు 500 మంది గాయపడ్డారు. షేక్ హసీనాను టార్గెట్ చేస్తూ గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బంగ్లా ప్రధాని అయిన హసీనా.. దాడి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. బహిరంగ సభ కోసం వచ్చిన షేక్ హసీనా ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో దాడి జరిగింది. ఇదే కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూకు కూడా మరణశిక్షను ఖరారు చేశారు. బీఎన్పీ పార్టీలో కార్యదర్శిగా చేసిన హరిస్ చౌదరీకి జీవిత శిక్షను వేశారు. గ్రేనేడ్ దాడి కేసులో మరో 11 మంది ప్రభుత్వ అధికారులకు కూడా శిక్ష ఖరారైంది. -
అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం
ఉత్తర ప్రదేశ్ : మీరుట్లో బుధవారం అర్థరాత్రి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బుల్లెట్లు, హ్యాండ్ గ్రెనేడ్‌తో సంగీత్ ఇంటిపై దాడి చేశారు. సెక్యురిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. స్పాట్లో ఖాళీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ టీమ్ పరిశీలిస్తుందని మీరుట్ ఎస్ఎస్పీ తెలిపారు. హ్యాండ్ గ్రెనైడ్‌ను కూడా గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, సెక్యురిటీ గార్డు క్యాబిన్‌ను, ఎమ్మెల్యే ఇంటి మెయిన్ గేట్‌ను లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరో కనుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఎమ్మెల్యే సోమ్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే చెప్పారు. ఆ సమయంలో తనను గ్రెనైడ్ చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన బెదిరింపులేమీ రాలేదన్నారు. -
గ్రెనేడ్ దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు, గ్రెనేడ్‌తో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవంతిపురా పట్టణంలోని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరినట్లు పోలీసులు తెలిపారు. కార్యాలయం బయట గ్రెనేడ్ పేలడంతో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతమంతా ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టారు. అనుమానం వచ్చిన ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..మహిళ మృతి తుపాకీతో గుర్తుతెలియని వ్యక్తి, షమీమా అనే మహిళపై కాల్పులకు దిగాడు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో డ్రాబ్గాం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన షమీమా(38)ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని షమీమా చూసేందుకు వచ్చినపుడు ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. -
జింబాబ్వే అధ్యక్షుడిపై హత్యాయత్నం
బులవాయో: జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75) బాంబు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం బులవాయోలో జరిగిన అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్–పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను–పీఎఫ్)పార్టీ ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దేశ ఉపాధ్యక్షుడితోపాటు మరికొందరు నేతలు, ప్రజలు గాయపడ్డారు. ప్రసంగం ముగిసిన అనంతరం అధ్యక్షుడు మునగాగ్వా వేదిక దిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు కెమో మొహాది, జాను–పీఎఫ్ ఉపాధ్యక్షురాలు, క్యాబినెట్ మంత్రి ఒప్పా ముచింగురి–కషిరి, పార్టీ కార్యదర్శి ఎంగెల్బర్ట్ రుగెజె గాయపడ్డారని అధికార మీడియా తెలిపింది. అధ్యక్షుడు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందనీ, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని హోం మంత్రి ఒబెర్ట్ ముఫొఫు తెలిపారు. ఘటన అనంతరం అధ్యక్షుడిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. జూలై 30వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు గాను అధ్యక్షుడు శనివారం బులవాయోలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఇథియోపియా ప్రధానిపై కూడా.. అడిస్‌అబాబా: ఇథియోపియా ప్రధాని శనివారం గ్రెనేడ్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు. సంస్కరణల వాదిగా పేరున్న ప్రధాని అబియ్ అహ్మద్(42) శనివారం రాజధాని అడిస్అబాబాలో జరిగిన భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆయన్ను వెంటనే భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 83మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘ఇది పథకం ప్రకారం జరిగిన దాడి. ప్రజలను విడదీయటానికి జరిగే ప్రయత్నం విజయవంతం కాబోదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో అధికార పగ్గాలు చేపట్టిన అహ్మద్.. జైళ్లలో ఉన్న వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వ కంపెనీల్లో ప్రైవేట్ పెట్టుబడులకు దారులు తెరిచారు. -
ఆగని గ్రెనేడ్ దాడులు
శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్లో భద్రతాబలగాలు లక్ష్యంగా ఉగ్రవాదులు సోమవారం గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 8 మంది భద్రతా సిబ్బందితో పాటు 15 మంది పౌరులు గాయపడ్డారు. షోపియాన్ జిల్లాలో రద్దీగా ఉన్న మార్కెట్ సమీపంలో ఉన్న భదత్రాబలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. దీంతో నలుగురు పోలీసులు సహా 16 మందికి గాయాలయ్యాయి. పుల్వామా జిల్లాలోని తలాబ్ చౌక్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన గ్రెనేడ్ దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ముగ్గురు పౌరులు గాయపడ్డారు. గురువారం నుంచి ఇప్పటిదాకా భద్రతా బలగాలపై డజనుకుపైగా గ్రెనేడ్ దాడులు జరిగాయి. కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట శాంతిని నెలకొల్పేందుకు సోమవారం జరిగిన ఫ్లాగ్‌మీటింగ్‌లో భారత్, పాకిస్తాన్‌లు అంగీకరించాయి. బీఎస్ఎఫ్ డీఐజీ ధిమన్, పాక్ బ్రిగేడియర్ హుస్సేన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల అధికారులు పాక్‌లోని అక్ట్రాయ్ ఔట్‌పోస్ట్‌లో సమావేశమై చర్చలు జరిపారు. జూన్ 21న మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. -
పోలీస్ స్టేషన్‌పై గ్రనేడ్ దాడి
బారాముల్లా, కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. బారాముల్లా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌పై గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో స్టేషన్ ధ్వంసమైనట్లు సమావేశం. కశ్మీర్‌లోని పోలీస్ స్టేషన్లపై గత 24 గంటల్లో గ్రనేడ్ దాడి జరగడం ఇది రెండోసారి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది. -
పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ దాడి
శ్రీనగర్: పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ దాడి జరిగిన ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు ఓ పౌరునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. దమ్హాల్ హాంజిపుర పోలీస్ స్టేషన్‌పై గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఏం జరిగిందో గుర్తించే లోపే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్, ఓ కానిస్టేబుల్లతో పాటు తన పని నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన పౌరుడు తీవ్రంగా గాయాపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సీఆర్పీఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ దాడి
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్ దాడిలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్‌లోని పుల్వామ జిల్లా ట్రాల్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని అరిబల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసుల ఉమ్మడి క్యాంప్ పై గుర్తుతెలియని దుండగులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవానుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వని తొలి వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఉగ్రదాడి జరిపినట్లు హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూప్ ప్రకటించింది. -
మోదీ టూర్: శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పాత శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఆదివారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందగా, 11 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నౌహట్టా ప్రాంతంలోని గంజ్‌బక్ష పార్కు సమీపంలో పహరా కాస్తున్న పోలీసులు లక్ష్యంగా తీవ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పోలీసులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారని, ఈ క్రమంలోనే గ్రనేడ్ దాడి జరిగిందని అధికారులు చెప్తున్నారు. జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉధంపూర్‌లో దేశంలో అతి పెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా ఉధంపూర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఒకవైపు తప్పుదోవ పట్టిన కొంతమంది యువత రాళ్లు విసురుతున్నారు. మరోవైపు అకుంఠిత దీక్ష కలిగిన కశ్మీర్ యువత అవే రాళ్లను దేశ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. రక్తపాతం ద్వారా ఎవరూ లబ్ధిపొందరు. దానివల్ల ఎవరికీ ఎలాంటి మేలు ఒనగూడదు' అని హితబోధ చేసిన సంగతి తెలిసిందే. -
గ్రనేడ్ దాడిలో పోలీసులకు గాయాలు
పుల్వామా: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో బుధవారం జరిగిన గ్రనేడ్ దాడిలో 18మంది పోలీసులు గాయపడ్డారు. స్థానిక కళాశాల వద్ద పోలీసులు భద్రత నిర్వహిస్తుండగా ముష్కరులు గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. డిప్యూటీ ఎస్పీ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండురోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో భద్రత అధికారి మృతి చెందారు. -
కశ్మీర్లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లతో సహా నలుగురు గాయపడ్డారు. పుల్వామా జిల్లాలో శ్రీనగర్, జమ్ము జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ సిబ్బంది వెళ్తుండగా ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడినట్టు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసినవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి: ఐదుగురికి గాయాలు
జమ్మూకాశ్మీర్: దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని క్వాజీ బజార్లో పహారాలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇద్దరు పౌరులు ఉన్నారని వెల్లడించారు. అయితే దాడి చేసిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
గ్రెనేడ్ దాడిలో మంత్రి సోదరుడి హతం
పాకిస్థాన్‌లో సామాన్య పౌరులకే కాదు ప్రధానులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులకూ రక్షణ దొరకదనే వాస్తవం మరోసారి రుజువైంది. సింధ్ ప్రావిన్స్‌కు మంత్రిగా వ్యవహరిస్తోన్న అబాదీ జావెద్ నగోరి కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్స్, తుపాకులతో జరిపిన దాడిలో మంత్రి సోదరుడు అక్బర్ నగోరి దుర్మరణం చెందారు. లయారీ ప్రాంతంలోని మంత్రి కార్యాలయంపై దుండగులు జరిపినదాడిలో అక్బర్ సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంత్రి సోదరుడు అక్బర్ మరణించారు. పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రదాడి అనంతరం పాక్ సర్కార్ ముష్కరులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖయీమ్ అలీ షా ఆదేశాలు జారీచేశారు. -
కశ్మీర్ లో మళ్లీ చెలరేగిన తీవ్రవాదులు
పుల్వామా: జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ చెలరేగారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సీఐఎస్ఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ తో దాడికి పాల్పడ్డారు. నూర్పోరా త్రాల్ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు. ఈ ఘటనలో జవాన్ గాయపడ్డాడు. అతడిని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ లో పర్యటించనున్న నేపథ్యంలో తీవ్రవాదులు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈనెల 9న జమ్మూకాశ్మీర్ లో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
గ్రెనేడ్ దాడి: పార్లమెంట్ సభ్యులకు గాయాలు
కరాచీ: పాకిస్థాన్ తీర నగరం కరాచీలో దుండగులు విసిరిన గ్రెనేడ్ దాడిలో దాదాపు 20 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురు పార్లమెంట్ సభ్యులు మహ్మద్ హుస్సేన్, షేక్ అబ్దుల్లా, సైఫుద్దీన్ ఖలీద్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నగరంలో ముత్తహిదా ఖ్వామి మూమ్మెంట్ (ఎంక్యూఎం) పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ క్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రెనేడ్ రష్యాలో తయారైందని ఫొరెన్సిక్ నిపుణులు నిర్థారించారని చెప్పారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తెహ్రిక్ -ఐ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించిందని పోలీసులు తెలిపారు. ఈ గ్రెనేడ్ దాడి శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.