జోగుళాంబ ఆలయంలో చండీహోమాలు
అలంపూర్రూరల్ : ఐదోశక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయంలో మంగళవారం సామూహిక చండీహోమాలు జరిగాయి. గురుపౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హోమాలకు తరలివచ్చారు. ప్రతి పౌర్ణమి, అమావాస్య నాడు చండీహోమాలను నిర్వహిస్తుంటారు. సుదూర ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులకు దేవస్థానం వారు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజనవసతి కల్పించారు. చండీహోమాలకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.