చాంపియన్ హకీమ్
రాయదుర్గం: ఆలిండియా బీఎస్ఎన్ఎల్ సర్కిల్ క్యారమ్స్ టోర్నమెంట్లో తెలంగాణ రీజియన్‌కు చెందిన హకీమ్ చాంపియన్‌గా నిలిచాడు. గచ్చిబౌలిలోని ఆర్టీటీసీ ప్రాంగణంలో జరిగిన టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో హకీమ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో హకీమ్ 25–7, 17–8తో జిబాన్దేకా (అస్సాం)పై విజయం సాధించాడు. అస్సాంకే చెందిన అంజాన్ శర్మ కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో గీతాదేవి (ఒడిశా) 24–10, 25–20తో బంటిలాయిశ్రమ్ను ఓడించి పసిడిని అందుకుంది. మహారాష్ట్రకు చెందిన అనిత మూడో స్థానంలో నిలిచింది.
పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌ను అస్సాం దక్కించుకోగా... మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌ను నార్త్ఈస్ట్ గెలుచుకుంది. తమిళనాడు (పురుషులు), కర్ణాటక (మహిళలు) జట్లు రన్నరప్‌లుగా నిలిచాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముఫరఫ్ ఫారుఖీ, అంతర్జాతీయ క్యారమ్స్ క్రీడాకారిణి నిర్మల తదితరులు పాల్గొన్నారు.