తరువుకు బరువయ్యేలా..
పుడమితల్లి తన ప్రేమనంతా నింపినట్టు మధురాతిమధురంగా ఉండే పనస తొనల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ‘కొరుక్కు తినడానికి వీలైన తేనెముద్దలు’ అనొచ్చు. సాధారణంగా పనసచెట్టుకు నలభై నుంచి యాభై కాయలు కాస్తుంటాయి. చింతూరు మండలం సిరసనపల్లిలో కలుముల వెంకటేశ్వర్లు అనే గిరిజనుడికి చెందిన చెట్టుకు ఏకంగా 125 కాయలు కాశాయి. ఇది బురద పనస చెట్టని, దీని తొనలు పెద్దవిగా, ఎంతో తీయగా ఉంటాయని ఆయన తెలిపారు. గుత్తులు, గుత్తులుగా కాయలు కాసిన ఈ చెట్టు గ్రామస్తులకు కనువిందు చేస్తోంది.
– చింతూరు