అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు!
రాబర్ట్ హేల్, కారోల్లు నాలుగు సంవత్సరాల వయసు నుంచి స్నేహితులు. హెల్స్వోవెన్ (ఇంగ్లండ్) నుంచి తమ తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ఇద్దరు వేరే వేరు ప్రాంతాలకు వెళ్లారు. ఇక ఉత్తరాలతోనే పలకరించుకునేవారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల ఉత్తరాలు కూడా తగ్గిపోయాయి. ఇద్దరు వేరే వ్యక్తులను వివాహం చేసుకున్నారు. 69 సంవత్సరాల వయసులో, సుదీర్ఘ కాలం తరువాత ఒకరినొకరు పలకరించుకున్నారు. బాల్య స్మతులను నెమరువేసుకున్నారు. ‘‘నాకు పెళ్లయింది. కానీ ఒంటరిని’’ అన్నాడు రాబర్ట్, ‘‘నా పరిస్థితి కూడా’’ అదే అంది ఆమె. ఇక ఆలస్యం ఎందుకు? 69 సంవత్సరాల వయసులో ఈ బాల్యస్నేహితులు పెళ్లి చేసుకున్నారు.