'సుష్మా మీరు మా ప్రధానైతే బాగుండేది'
న్యూఢిల్లీ: భారత్‌లో వైద్యం కోసం దరఖాస్తు పెట్టుకున్న వెంటనే అనుమతినిచ్చిన భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై అర్జీ పెట్టుకున్న మహిళ ప్రశంసలు కురిపించారు. దీనిపై మాట్లాడిన హిజబ్ ఆసిఫ్.. ఇంత తొందరగా స్పందిస్తారని కలలో కూడా అనుకోలేదని అన్నారు. సుష్మా మా దేశానికి(పాకిస్తాన్) ప్రధానమంత్రి అయితే బాగుండేదని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు మంత్రి సుష్మాకు ట్వీట్ చేశారు. 'మిమ్మల్ని ఏమని పిలవాలి?. సూపర్ విమెన్ అనా?. దేవత అనా?. మీ ఉదార స్వభావం గురించి ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. లవ్ యూ మేమ్. మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను.' ఇది ఆసిఫ్ చేసిన మొదటి ట్వీట్ సారాంశం.
రెండో ట్వీట్లో.. 'నా గుండె మీ కోసమే కొట్టుకుంటోంది. మీరు మా ప్రధానమంత్రి అయితే బాగుండేది. మా దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చేవారు.' అని పోస్టు చేశారు. కాగా, పాకిస్తాన్ విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్.. వీసా కోసం ఆసిఫ్‌కు రికమండిషన్ లెటర్ ఇవ్వడానికి ససేమీరా అన్నారు. దీంతో ఆమె సుష్మాకు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన సుష్మా.. పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌కు ఆసిఫ్‌కు సాయం చేయాలని ఆదేశించారు.