హైందవి జోష్..
కాచిగూడ: బర్కత్‌పురలోని హైందవి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకతో హోరెత్తించారు. జూనియర్లకు స్వాగతం పలుకుతూ సీనియర్స్ రాంకోఠిలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో సందడి చేశారు. ఫ్యాషన్ షో, ర్యాంప్‌వాక్, డ్యాన్సులతో అంతా ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డైరెక్టర్ జె.వి. ప్రేమ్‌రాజ్, ఏఓ కొండలరావు, వైస్ ప్రిన్సిపల్ రఫత్ తదితరులు పాల్గొన్నారు.