hockey tournaments
-
అంతర్జాతీయ టోర్నీలకు కోవిడ్–19 దెబ్బ
కౌలాలంపూర్: మనషుల ప్రాణాల్ని హరిస్తున్న కోవిడ్–19 వైరస్‌తో పెద్ద ముప్పే వచ్చిపడింది. ప్రపంచ వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటక, ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ ‘కోవిడ్–19’ క్రీడలతోనూ ఓ ఆటాడుకుంటోంది. దీని వల్ల ఆసియా చాంపియన్స్ లీగ్ (ఫుట్‌బాల్) నాకౌట్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. లీగ్‌లు సవ్యంగా సాగకపోవడంతో సుదీర్ఘ షెడ్యూల్ అవసరమైంది. మే దాకా కొన్ని లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అవి పూర్తయ్యాకే మే నుంచి ఆగస్టు నెలలో నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) జనరల్ విండ్సర్ జాన్ తెలిపారు. *స్క్వాష్ : కొవిడ్–19 దెబ్బకు రెండు స్క్వాష్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్, చైనాలో జూన్ 29 నుంచి జూలై 3 వరకు జరగాల్సిన ఆసియా జూనియర్ పోటీలు ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తారు. *అజ్లాన్ షా హాకీ: మలేసియాలోని ఐపోలో వచ్చే నెల 11 నుంచి 18 దాకా జరగాల్సిన అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీని సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహిస్తారు. *రేస్ వాక్: ఈ నెల 15 నుంచి జపాన్‌లో జరగాల్సిన ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాక్ వాయిదా పడింది. ఇందులో 13 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. -
‘డ్రా’తో సరిపెట్టుకున్నారు
ఇఫో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో తుదికంటా ఆధిపత్యం చలాయించిన భారత్ చివరకు 1–1తో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. గత మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో 2–3తో ఓటమి పాలైన సర్దార్ సింగ్ సేన ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. శైలానంద్ లక్రా (14వ ని.) తొలి అంతర్జాతీయ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా... డిఫెండర్లు ప్రత్యర్థిని నిలువరించడంతో ఆట 53వ నిమిషం వరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాల ముందు ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మార్క్ గ్లెగోర్న్ గోల్‌గా మలచడంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్లు లభించినా వరుణ్ కుమార్, అమిత్ రొహిదాస్ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. -
గుర్జీత్ హ్యాట్రిక్: సెమీస్‌లో భారత్
కకమిగహర (జపాన్): కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో భారత మహిళల హాకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో టీమిం డియా వరుసగా ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్‌తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 7–1 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది. ‘డ్రాగ్ ఫ్లికర్’ గుర్జీత్ కౌర్ (4వ, 42వ, 56వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించి భారత్ ఘనవిజయంలో కీలకపాత్ర పోషించింది. నవ్‌నీత్ కౌర్ (22వ, 27వ ని.లో), దీప్ గ్రేస్ ఎక్కా (16వ, 41వ ని.లో) రెండేసి గోల్స్ చేశారు. కజకిస్తాన్ జట్టుకు వెరా దొమషనెవా (2వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. ఆరం భంలోనే గోల్ సమర్పించుకున్న భారత జట్టు వెంటనే తేరుకొని సమన్వయంతో ఆడుతూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఎదురుదాడులు చేసింది. తొలి గోల్ ఇచ్చిన రెండు నిమిషాలకే భారత్ కూడా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత భారత క్రీడాకారిణులు మరింత జోరు పెంచి ఆరు గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా 10–0తో థాయ్‌లాండ్‌పై, దక్షిణ కొరియా 9–0తో సింగపూర్‌పై, డిఫెండింగ్ చాంపియన్ జపాన్ 2–0తో మలేసియాపై గెలిచాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌తో భారత్; కొరియాతో చైనా తలపడతాయి. ఈ ఈవెంట్లో భారత్ ఒకసారి విజేతగా (2004), రెండు సార్లు రన్నరప్‌గా (1999, 2009), రెండు సార్లు మూడో స్థానంలో (1994, 2013), రెండు సార్లు నాలుగో స్థానంలో (1989, 2007) నిలిచింది. -
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్లు
ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని జిరాయత్ నగర్లో గల జావీద్ భాయ్ మినీ స్టేడియంలో బుధవారం హాకీ అండర్-19 బాల, బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న జిల్లా జట్లను ఎంపిక చేశారు. హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, జూనియర్ కళాశాలల ఆటల కార్యదర్శి గంగాధర్‌ల పర్యవేక్షణలో పీ ఈటీలు సురేందర్, అంజు, అప్పారావు, ఆంజనేయు లు ఈ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల క్రీడాకారులు పోటీ ప డగా అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు వారు చెప్పారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16, 17, 18 వ తేదీల్లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ జట్లకు మేనేజర్లుగా ఆంజనేయులు, రాహూల్, కోచ్‌గా అంజు వ్యవహరిస్తారన్నారు. బాలుర జట్టు.. ఎం అజయ్(శాంకరీ జూనియర్ కళాశాల, నిజామాబాద్), ఎస్ మధు(ఎస్ఆర్, ఆర్మూర్), బి చందు(శ్రీనారాయణ, నిజామాబాద్), కె రాము(ప్రభుత్వ కళాశాల, తాడ్వాయి), పి దినేష్ గోల్‌కీపర్(ఎస్ఆర్ ఆర్మూర్), జి వినయ్ కుమార్(ఏపీ మోడల్, ఆర్మూర్), ఇ దినేష్(విజయ్ ఆర్మూర్), జి మనోజ్(ఏపీ మోడల్ ఆర్మూర్), ఎండీ మాజిద్(ఏపీఆర్జేసీ నిజామాబాద్), ఐ రాము(ఏపీ మోడల్, రెంజల్), కె కళ్యాణ్(ఏపీ మోడల్, ఆర్మూర్), ఎన్ శశాంక్ చంద్ర(ఆర్యభట్ట, కామారెడ్డి), ఒ కార్తీక్(ఏపీ మోడల్,ఆర్మూర్), ఎన్ లక్ష్మణ్, బి యశ్వంత్(ఏపీ మోడల్, రెంజల్), రాజేశ్(కామధేను, సిరికొండ)లు ఎంపికయ్యారు. బాలికల జట్టు బి రోషిణి(నరేంద్ర, ఆర్మూర్), డి లావణ్య(ఏపీఎస్‌డబ్ల్యూఆర్, తాడ్వాయి), బి ప్రసన్న లక్ష్మీ, పి వినీష, ఎన్ దివ్య(విజయ్ ఆర్మూర్), పి నవ్య, జి అఖిల(ఎస్ఆర్ ఆర్మూర్), ఎం రజిత, ఎ సుస్మిత, ఎన్ శివాణి ప్రియ, (ఆర్యభట్ట, కామారెడ్డి), శ్రావణి, గౌతమి(ఏపీ మాడల్, సిరికొండ), మంజుల(కామధేను, కామారెడ్డి), సీనాబాయి(శాంతి, ఆర్మూర్)లు ఎంపికయ్యారు.