hospital quarters
-
మెడికల్ కళాశాల క్వార్టర్స్‌లో టీడీపీ నేతలు
ఇది మెడికల్ కళాశాల క్వార్టర్స్‌లోని బ్లాక్–1. మొదటి ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో భీమేశ్వర నాయుడు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. టీడీపీకి చెందిన ఇతను సర్వజనాస్పత్రి ఉద్యోగి కాదు. గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి మానేశాడు. అయినా ఆస్పత్రి అధికారులు ఆయనకు వసతి కొనసాగిస్తున్నారు. దీంతో అతను రూ.1,400 అద్దె చెల్లిస్తూ రెండు పడకల గదులున్న ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఆస్పత్రి సిబ్బందికి దక్కని వసతి భీమేశ్వరనాయుడికు ఎలా దక్కిందో అధికారులకే తెలియాలి. సాక్షి, అనంతపురం న్యూసిటీ : సర్వజనాస్పత్రి ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌లో అనర్హులు పాగా వేశారు. ఉద్యోగులకు వసతి కల్పించాల్సిన ఉన్నతాధికారి.. పచ్చనోటుకు, పచ్చ కండువాలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు తిష్టవేశారు. రూ.1,400 అద్దె చెల్లిస్తూ నగరం నడిబొడ్డున వసతి పొందుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సబ్ లీజు కింద శానిటేషన్ నిర్వహణను పరిశీలించే భీమేశ్వర్ నాయుడు అనే వ్యక్తి ఏళ్ల తరబడి మెడికల్ కళాశాల క్వార్టర్స్‌లో తిష్ట వేశాడు. ఇతను గతంలో వైద్య కళాశాల, సర్వజనాస్పత్రి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలో ల్యాబ్ అటెండెంట్‌గా పని చేశాడు. శానిటేషన్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆయన.. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ క్వార్టర్స్‌లో కొనసాగుతున్నారు. గతంలో ఆస్పత్రిలోని కొందరు అధికారులు దీనిపై అభ్యంతరం తెలిపినా.. అప్పుడున్న సూపరింటెండెంట్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగి దాస్ పేరున తీసుకున్న క్వార్టర్స్‌లో ఉరవకొండకు చెందిన టీడీపీ కార్యకర్త ఉంటున్నాడు. వీరితో పాటు ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ పేరు మీద క్వార్టర్స్ తీసుకుని వారి బంధువులకు అప్పగించారు. మెడికల్ క్వార్టర్స్‌లోని నాన్ టీచింగ్ బ్లాక్‌లో 48 క్వార్టర్స్ ఉండగా.. దాదాపు 10 మంది ఇతరులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అందులో రెండు క్వార్టర్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రూ.20 వేలు ఇస్తే వసతి రూ.20 వేలు ముట్టజెబితే చాలు మెడికల్ కళాశాల క్వార్టర్స్‌లో వసతి దొరుకుతుందని ఇక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. క్వార్టర్స్ కేటాయించే ఉన్నతాధికారి చేయితడపందే వసతి దొరకదని వాపోతున్నారు. టీడీపీ హయాంలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగినికి క్వార్టర్స్ కేటాయించేందుకు అప్పుడు క్వార్టర్స్ కేటాయింపు బాధ్యతలు చూస్తున్న అధికారి రూ.20 వేలు తీసుకున్నట్లు సర్వజనాస్పత్రి ఉద్యోగులే చెబుతున్నారు. ఆమె వద్ద డబ్బు తీసుకున్న సదరు అధికారి సంవత్సరానికి క్వార్టర్స్ కేటాయించడం గమనార్హం. పర్యవేక్షణ కరువు వాస్తవానికి ఆస్పత్రి ఉన్నతాధికారులు మెడికల్ కళాశాల క్వార్టర్స్‌ను తరచూ సందర్శించాలి. ఉద్యోగులే నివాసం ఉంటున్నారా..? ఇతరులెవరైనా ఉంటున్నారా? అన్నది తెలుసుకోవాలి. ఇతరులు ఎవరైనా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తిస్తే వెంటనే ఖాళీ చేయించాలి. అయితే సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ఇప్పటికైనా సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు మెడికల్ క్వార్టర్స్‌లో ఎవరెవరు ఉంటున్నారో పరిశీలించాలని, అనర్హులను ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వాలని సర్వజనాస్పత్రి ఉద్యోగులు కోరుతున్నారు. భారీగా అద్దె బకాయిలు మెడికల్ క్వార్టర్స్‌లోని నాన్‌టీచింగ్ బ్లాక్‌లోని ఒక్కో క్వార్టర్‌కు రూ.1,400గా అద్దె నిర్ణయించారు. నగరం నడిబొడ్డున అన్ని సౌకర్యాలన్న ఇల్లు కావాలంటే బయట కనీసంగా రూ.7 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత తక్కువకు క్వార్టర్స్ ఇచ్చినా అందులో ఉంటున్న వారిలో చాలా మంది సుమారుగా 30 నెలల అద్దె బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. బయటి వ్యక్తి ఒక్కరే.. మెడికల్ క్వార్టర్స్‌లో బయటి వ్యక్తులు ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్లంతా ఉద్యోగులే. ప్రస్తుతం ఉన్న వాళ్లలో చాలా మంది బాడుగ కట్టడం లేదు. ఈ విషయమై ప్రశ్నిస్తే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. బయటి వ్యక్తులు ఉంటే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
బకాయి.. ఆపై బడాయి
సర్వజనాస్పత్రి క్వార్టర్స్‌లో అనర్హుల 'మకాం' ఏళ్లు గడుస్తున్నా అద్దె చెల్లించని వైనం బయటి వ్యక్తులకూ అద్దెకిస్తున్న తీరు పెండింగ్‌లో రూ.8.50 లక్షల బకాయి నోటీసులు జారీ చేసినా ఫలితం శూన్యం అనంతపురం మెడికల్ : అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌లో అనర్హులు పాగా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరులు అందులో ఉంటున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అద్దె బకాయిలు కొండలా పేరుకుపోతున్నా..అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదు. నామమాత్రపు అద్దె ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జీసెస్‌నగర్‌లో గృహ సముదాయాన్ని కట్టించారు. మొత్తం 35 క్వార్టర్స్ ఉన్నాయి. ఒక్కో క్వార్టర్లో కిచెన్, హాల్, బెడ్రూం సౌకర్యం ఉంది. నెలకు అద్దె రూ.1,433 మాత్రమే. నిబంధనల మేరకు ఇక్కడ ఉండాలంటే ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తప్పనిసరి. క్వార్టర్స్ కావాలనుకున్న ఉద్యోగి తాను ఆస్పత్రిలోని ఫలానా విభాగంలో.. ఫలానా హోదాలో పని చేస్తున్నానని, తనకు క్వార్టర్ కేటాయించాలని దరఖాస్తు చేయాలి. అడ్వాన్స్‌గా రూ.5 వేలు, ఒక ఖాళీ చెక్కు, ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నిబంధనలు అమలు కావడం లేదు. కొందరి నుంచి చెక్కులు, అడ్వాన్స్ తీసుకున్న అధికారులు.. మరికొందరి విషయంలో మాత్రం పట్టించుకోలేదు. రాజకీయ ఒత్తిడితో కొన్ని క్వార్టర్స్ కేటాయించేశారు. తీరా ఇక్కడ తిష్టవేసిన కొందరు ఉద్యోగులు నెలవారీగా అద్దెలు చెల్లించడం లేదు. కట్టండని అడిగే వారూ కరువయ్యారు. కొందరైతే క్వార్టర్ తీసుకుంటున్నప్పటి నుంచి అద్దె చెల్లించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మొత్తం రూ.8.60 లక్షల బకాయి ఉంది. కొందరు తమ పేరు మీద తీసుకుని ఎక్కువ అద్దెకు ఇచ్చుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు నిబంధనల ప్రకారం ఆస్పత్రి ఉన్నతాధికారులు తరచూ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఎవరికైతే కేటాయించారో వారే ఉంటున్నారా? ఇతరులు ఉంటున్నారా? అన్నది తెలుసుకోవాలి. ఉద్యోగులు కాని వారుంటే ఖాళీ చేయించాలి. అయితే అధికారులు మాత్రం ఇటువైపు చూడడమే మానేశారు. దీంతో కొందరి తీరు 'ఆడింది ఆట'గా మారిపోయింది. గతంలో కొందరు మద్యం సేవించి ఇక్కడ గొడవకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఉద్యోగులు కాకున్నా క్వార్టర్స్‌లో తిష్ట ఆస్పత్రిలోని ఓ విభాగంలో పని చేసిన ఉద్యోగి కొన్నేళ్ల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీలో పని చేశాడు. నిబంధనల ప్రకారం ఆయనకు క్వార్టర్ కేటాయించకూడదు. కానీ ఉన్నతాధికారుల అండతో ఇప్పటికీ అతను అక్కడే నివాసం ఉంటున్నాడు. సుమారు రెండేళ్లుగా అద్దె బకాయి ఉన్నాడు. మరో ఉద్యోగి తన పేరు మీద క్వార్టర్ తీసుకుని తన బంధువులకు ఇచ్చాడు. వీరు ఏకంగా ఐదేళ్ల నుంచి అద్దె చెల్లించలేదు. ఇలాంటి వారు ఐదారు మంది వరకు ఉన్నారు. అద్దె బకాయిలపై గత నెలలో అధికారులు నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని పేర్కొనగా గడువు కూడా ముగిసింది. అయినా ఫలితం లేదు. క్వార్టర్స్ వారీగా బకాయి వివరాలు (ఏడాదికి పైగా బకాయి ఉన్నవి) క్వార్టర్ నంబర్ అద్దె బకాయి మొత్తం బీ–2, జీ4 రూ.85,980 బీ–2, ఎఫ్8 రూ.85,980 బీ–2, ఎఫ్4 రూ.61,619 బీ–2, ఎస్1 రూ.67,351 బీ–2, ఎస్6 రూ.54,454 బీ–1, ఎస్8 రూ.51,588 బీ–2, జీ7 రూ.48,722 బీ–2, ఎస్4 రూ.32,959 బీ–1, ఎఫ్8 రూ.34,392 బీ–1, ఎఫ్5 రూ.31,526 బీ–2, ఎస్3 రూ.28,660 బీ–2, ఎఫ్1 రూ.27,227 బీ–2, జీ5 రూ.25,794 బీ–2, ఎఫ్2 రూ.24,361 బీ–1, ఎఫ్2 రూ.24,361 బీ–2, ఎస్5 రూ.22,928 ఖాళీ చేయిస్తాం కొన్నాళ్లుగా క్వార్టర్స్ అంశంపై కసరత్తు చేస్తున్నాం. ఉద్యోగులు కాని వాళ్లుంటే ఖాళీ చేయిస్తాం. బకాయిల వసూళ్ల విషయమై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌కు ఇప్పటికే లేఖ రాశాం. గతంలో ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం ముందుకెళ్తా. -డాక్టర్ జగన్నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్