కరాటే నేర్చిన ఉడత.. ఏం చేసిందో తెలుసా?
ఓ గద్ద మంచి ఆకలి మీద ఉంది.. గాలిలో ఎగురుతూ తనకు ఆహారం ఏం దొరుకుతుందా అని చూస్తోంది.. ఇంతలో కింద చెట్టుమీద దానికి ఓ మంచి ఉడత కనిపించింది. హమ్మయ్య.. ఈ రోజుకు లంచ్ దొరికేసిందని సంబరపడుతూ, తీక్షణంగా దానికేసి చూసి... తన పదునైన ముక్కును ఓసారి సరిచేసుకుని నేరుగా కిందకు రాసాగింది. మామూలుగా అయితే, ఆ ఉడత దానికి ఆహారం అయిపోవాల్సిందే. ఆరోజుతో దానికి భూమ్మీద నూకలు చెల్లిపోవాల్సిందే.
కానీ, అది అలాంటి ఇలాంటి ఉడత కాదు.. ఎక్కడ చూసిందో గానీ అది మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకుంది. గద్ద వస్తుండటం చూసి ఒక్కసారిగా నింజా ఫైటర్ల లెవెల్లో గాల్లోకి ఎగిరి, అక్కడి నుంచి సులభంగా తప్పించుకుంది!! కింద ఉడత ఉందని సంబరంగా దూకిన గద్ద కాస్తా నేలకు గుద్దుకుంది. ఈ ఘటన అమెరికాలోని జెర్సీ నగరంలో జరిగింది. మొదట ఓ చెట్టు కొమ్మ మీద ఉన్న ఉడతను చూసి గద్ద చాలా హ్యాపీగా ఫీలయింది. కానీ చేతిదాకా వచ్చి నోటి కాడికి రాకుండా పోయినట్లు కావడంతో గద్ద ఉసూరుమంది.