టిమ్ కుక్ ప్రేమలో పడిపోయారట!
న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ ప్రేమలో పోయాడట. ఇక్కడి కల్చర్, హిస్టరీ తనను బాగా ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా జి నారాయణమ్మ మహిళా కాలేజీ విద్యార్థినిల ప్రతిభా పాటవాలపై ప్రశంసలు కురిపించారు. ఆ విద్యార్థినులను కలవడం తనకు చాలా షంతోషాన్ని పంచిందన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. హైదరాబాదీయుల ప్రతిభకు ముగ్ధుడైపోయిన కుక్ తన ఆనందాన్ని శుక్రవారం ఆ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతోపాటుగా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
జి నారాయణమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన ఆయన హైదరాబాద్ సంస్కృతి, చరిత్రకు ముగ్ధుడినయ్యానని ఇప్పటికే నగరం ప్రేమలో పడిపోయానని వ్యాఖ్యానించారు. జీఎన్ఐటీఎస్ మహిళా కళాశాలని కొత్త మ్యాక్ ల్యాబ్ దగ్గర అత్యుత్తమ ప్రతిభ , ఉత్సాహం ఉందని ట్విట్టర్ లో తెలిపారు. మిమ్మల్ని చూసి చాలా ఆనందించానని కుక్ ట్విట్ చేశారు. గురువారం కాలేజీని సందర్శించిన కుక్ అక్కడ కంప్యూటర్ సెంటర్ ని ప్రారంభించారు. అలాగే ఆపిల్ విద్యార్ధులకు శిక్షణ కు సంబంధించిన ఒక అవగాహనా పత్రంపై సంతకం చేశారు .
కాగా భారతదేశంలో రెండో రోజు పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్ వచ్చిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇక్కడ యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. దీని ద్వారా భవిష్యత్తులో నాలుగువేలమంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Lots of talent and enthusiasm at the new Mac Lab at GNITS women’s college. Enjoyed visiting you yesterday! pic.twitter.com/ZqCnVkBpii
— Tim Cook (@tim_cook) May 20, 2016