తిరుపతికి సబ్‌కలెక్టర్
ఇమామ్‌సు శుక్లా నియామకం
మదనపల్లెకు క్రిటిక భత్రా
ఏ.మల్లికార్జున విజయవాడ
సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ
తిరుపతి మంగళం/మదనపల్లె రూరల్: తిరుపతి రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీవో స్థానంలో ఇమామ్‌సు శుక్లాను సబ్‌కలెక్టర్‌గా నియ మిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మదనపల్లె సబ్‌కలెక్టర్ మల్లికార్జునను బదిలీచేసి ఆయన స్థానంలో ఢిల్లీకి చెందిన మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రాను నియమించింది. తిరుపతి నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయనున్న నేపధ్యంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్‌ను కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్డీవో కేడర్ లేకుండా ఏకంగా సబ్‌కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆర్డీవోగా పనిచేస్తున్న వీరబ్రహ్మయ్యను తిరుపతి నుంచి బదిలీ చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు.
మదనపల్లెకు క్రిటిక భత్రా
మదనపల్లె సబ్ కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున విజయవాడ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రా నియమితులయ్యారు.