Imperial College London study
-
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా తగ్గినా.. ఈ సమస్యలు 3 నెలలు దాటినా వదలట్లేదు
సాక్షి, హైదరాబాద్: కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు చాలామంది బాధితులను పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్‌లో భాగంగా కొన్ని వారాల పాటు ఈ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు మొదట్లో అంచనా వేసినా ఊహించిన దానికంటే మరీ ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని పోషకాహారం, మంచి నిద్ర, మానసిక ప్రశాంతతతో త్వరగానే అధిగమించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఆర్థిక, మానసిక, వృత్తి సంబంధిత సమస్యలతో ఈ సమస్యలను చాలామంది అధిగమించలేకపోతున్నారు. సర్వే తీరిది.. కరోనా నుంచి కోలుకున్న వారిలో 40 శాతం మందికి మూడు నెలలకుపైగా ఏవో సమస్యలు ఎదురవుతున్నట్లు ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ పరిశోధకులు తేల్చారు. కొందరిలో ఏళ్ల తరబడి ఆరోగ్య సమస్యలు కొనసాగడానికి కారణం కావొచ్చని చెబుతున్నారు. ‘ఇంపీరియల్స్ రియాక్ట్–2’పేరిట ఇంగ్లండ్‌లోని దాదాపు 5 లక్షల మందిపై సర్వే జరిపి నిర్ధారణకు వచ్చారు. కోవిడ్ ఎలా ప్రభావితం చేసింది.. ఆ తర్వాత ఎంతకాలం పాటు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు వంటి 29 అంశాలపై ఈ సర్వే నిర్వహించారు. దాదాపు 3, 4 నెలల పాటు కనీసం 40 శాతం మంది పలు సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వారిలో 15 శాతం మంది మూడు, నాలుగు సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. మరికొందరిలో 22 వారాల పాటు ఆయా సమస్యలు బాధిస్తున్నట్లు వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో నీరసం, ఏ పని చేయాలని అనిపించకపోవడం, ఏమీ తోచకపోవడం, కీళ్లు, కండరాల నొప్పులు, నిద్రలేమి, ఛాతీ నొప్పి, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఎదురవుతున్నట్లు తేల్చారు. మనదగ్గరా ఇలాంటి సమస్యలే.. ‘మూడు,నాలుగు నెలల తర్వాత కూడా వివిధ సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. సెకండ్ వేవ్‌లో 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. వీరిలోనే ఎక్కువ శాతం లాంగ్ కోవిడ్ సమస్యలతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడిన వారిలోనూ కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ బరువుగా ఉండటం, పనిచేస్తే ఛాతీలో నొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతి నీరసం, మానసికపరమైన ఆందోళనలు, కుంగుబాటుకు లోనవుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బతిని ‘లంగ్ ఫైబ్రోసిస్’సమస్య ఎదురైన వారికి సుదీర్ఘకాలం ఇబ్బందులు తప్పట్లేదు. డయాబెటిస్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో లాంగ్ కోవిడ్ సమస్యలు ఎక్కువ కాలం బాధిస్తున్నాయి.’ – డా.వీవీ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి -
కాఫీ? యస్, ప్లీజ్!
రోజుకు నాలుగు కప్పుల కాఫీ సేవించడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్‌ను తప్పించుకోవచ్చునని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ స్టడీ చెబుతోంది. జ్ఞాపకశక్తిని మెరుగు పర్చుకోవడానికి రోజూ గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటే లేదా గుప్పెడు వేరు శనగలు తింటే మంచిదని ది ఇన్స్టిట్యూవ్ ఫర్ రిజెనరేటివ్ మెడిసిన్(టెక్సాస్, యుయస్) చెబుతోంది.