'ఇది చరిత్రలో నిలిచే ఘట్టం'
న్యూఢిల్లీ: భారత్-ఆఫ్రికా ఫోరం మధ్య జరుగుతున్న సమావేశం ఒక చరిత్రాత్మక సంఘటన అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. 'ఇండియా ఆఫ్రికా ఫోరం మూడో సదస్సు చరిత్రలు నిలిచిపోయే కార్యక్రమం' అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. గత మంగళవారం రాత్రి స్వాజిలాండ్ రాజు ఎంఎస్ వాతి 3ని సాధర స్వాగతం పలికారు. భారత్లో తొలిసారి జరుగుతున్న సదస్సుకు వివిధా ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులను గౌరవప్రదంగా ఆహ్వానించడాన్ని సంతోషంగా భావిస్తుందని ఈ సందర్భంగా ముఖర్జీ అన్నారు.
అనంతరం భారత్ దేశ ఔన్నత్యాన్ని చాటేలా దేశంలోని విలువలను, సాంప్రదాయాలను, పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను గుర్తు చేయడంతోపాటు స్వాజిలాండ్తో బంధాన్ని అభివర్ణించారు. గత కొన్నేళ్లలోనే స్వాజిలాండ్ తో తమ అనుభందం ఎంతో పెనవేసుకుందని, ఇది ఇంకా బలపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వ డిమాండ్ కు స్వాజిలాండ్ కూడా మద్దతిచ్చిన విషయం గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆ దేశ రాజు ఎంఎస్ వతి కూడా మాట్లాడుతూ తమకు భారత్ అండదండలు ఎప్పుడూ ఉండాలని కోరారు. భారత్ నుంచి తాము ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నామని చెప్పారు. తమ లక్ష్యాలను, ఆర్థిక పురోగతిని సాధించడాని తాము భారత్ సాయం ఎప్పటికీ తీసుకుంటూనే ఉంటామన్నారు.