రాణించిన సోహన్, గణేశ్
జింఖానా : భరత్ క్రికెట్ క్లబ్ భదీంతో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో శాంతి ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది.
ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన శాంతి ఎలెవన్ 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన భరత్ సీసీ 4 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. మరో మ్యాచ్లో స్పోర్టివ్ సీసీ బౌలర్ ఎన్ఎస్ గణేశ్ 7 వికెట్లు పడగొట్టి డెక్కన్ బ్లూస్ జట్టును కట్టడి చేశాడు. అయితే చివరకు వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలుత బరిలోకి దిగిన డెక్కన్ బ్లూస్ 168 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదిల్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు.
స్పోర్టివ్ సీసీ బౌలర్ రాము 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన స్పోర్టివ్ సీసీ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసేంది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు రెండేసి పాయింట్లు ఇచ్చారు.