‘నాసా’కు పాలమూరు విద్యార్థి
వనపర్తి: నాసా పరిశోధన కేంద్రానికి వెళ్లే అవకాశం పాలమూరు విద్యార్థికి దక్కింది. ప్రతిఏటా ఇండియన్ టాలెంట్ సంస్థ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్, సైబర్ సబ్జెక్టుల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక టెస్టులు నిర్వహిస్తోంది. ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ప్రపంచంలోనే అత్యున్నత అంతరిక్ష పరిశోధన కేంద్రమైన ‘నాసా’కు తీసుకువెళ్తుంది. ఇండియన్ టాలెంట్ సంస్థ ఆధ్వర్యంలో 2015 డిసెంబర్ 2, 2016 ఫిబ్రవరి 3 తేదీల్లో జరిగిన నేషనల్ టాలెంట్ టెస్టు సైన్స్ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలోని చాణక్య హైస్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి రిషికేశ్ ప్రథమ బహుమతి సాధించాడు. ఈ మేరకు నాసా పరిశోధన కేంద్రాన్ని సందర్శించాల్సిందిగా నాసా నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.