గొంతులో అన్నం ఇరక్కుని చిన్నారి మృతి
కాచిరాజుగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో అన్నం ఇరుక్కుని దిలీప్ అనే సంవత్సరం వయసున్న చిన్నారి మృతిచెందాడు. వివరాలు..చిన్నారి తల్లి సునీత అన్నం తినిపిస్తుండగా మెతుకులు గొంతులో అడ్డుపడ్డాయి. దిలీప్ ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.