internal marks
-
ఇంటర్నల్ మార్కులు.. అంతర్గత తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల మార్కులపై తనిఖీలకు విద్యాశాఖ రంగంలోకి దిగింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల నమోదుపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని ప్రతి మండల పరిధిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదు తీరును పరిశీలించి ఉన్నత కమిటీకి నివేదిక సమర్పించనున్నాయి. ఆ తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదుకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మేటివ్ టెస్టులు నిర్వహించడంతో పాటు ప్రాజెక్టులు, రికార్డులను పరిశీలించి ఆయా సబ్జెకుల ఉపాధ్యాయులు మార్కులు నమోదు చేసిన విషయం విదితమే. మూడు రోజుల పాటు.. మహానగర పరిధిలో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్, ప్రాజెక్టుల మార్కుల నమోదు పరిశీలన మూడురోజుల పాటు జరగనుంది. డీఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు మండలాల వారీగా రంగంలో దిగి క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టాయి. కరోనా ప్రభావంతో అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు రెండు ఎఫ్ఏ టెస్టులు మాత్రమే నిర్వహించారు. వీటితో పాటు ప్రాజెక్టులు, ఇతర రికార్డులను సైతం ప్రత్యేక బృందాలు పర్యవేక్షించనున్నాయి. ప్రతి ఎఫ్ఏ టెస్టుకు 5 మార్కుల చొప్పున నాలుగు టెస్టులకు 20 మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులకు ప్రత్యేక మార్కులు ఉంటాయి. రెండు ఎఫ్ఏ టెస్టులు మాత్రమే నిర్వహించిన కారణంగా మొత్తం మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మార్కులను ఎస్సెస్సీ బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది. ప్రైవేటు దూమారం ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు అశాస్త్రీయంగా అంతర్గత మార్కులు వేశాయనే ఆరోపణల దుమారం రేగింది. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లో విద్యార్థికి అతితక్కువ మార్కులు వచ్చినా, ప్రాజెక్టు వర్కే చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని తప్పుబట్టిన విద్యాశాఖ వాస్తవ పరిస్థితి కోసం ప్రైవేటుతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోనూ సైతం క్షేత్రస్థాయి విచారణ బృందాలను రంగంలోకి దింపింది. (క్లిక్: బస్తీ బడి.. దాతల ఒడి) అంతర్గత మార్కులు ఇలా.. ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో ప్రతి పేపర్ 80 మార్కులకు ఉంటుంది. మరో 20 మార్కులను తరగతి గదిలో ఆయా సబ్జెక్టుల వారీగా కనబరిచే ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్‌గా కేటాయిస్తారు. సరిగా నాలుగేళ్ల క్రితం కంటిన్యూస్ అండ్ కాంప్రెహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) విధానంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్ట్ ప్రకారం మార్కులు కేటాయిస్తూ వస్తున్నాయి. ఇలా కేటాయిస్తున్న మార్కులను ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ ద్వారా టెన్త్ పరీక్షల విభాగానికి డీఈవోల ద్వారా పంపాల్సి ఉంటుంది. కాగా.. ఇవేవీ నిర్వహించకుండానే ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం గరిష్టంగా మార్కులు వేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. (క్లిక్: సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!) -
మార్కుల మాయ.. ఇష్టానుసారంగా ఇంటర్నల్ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లు టెన్త్ విద్యార్థులకు అశాస్త్రీయంగా అంతర్గత మార్కులు వేశాయనే ఆరోపణలు రావడం, ప్రతి స్కూల్ నుంచీ ప్రతి విద్యార్థికీ గరిష్ట మార్కులు రావడంపై ఫిర్యాదులు అందడంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు ప్రైవేటుతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోనూ క్షేత్రస్థాయి విచారణకు పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలంటూ అన్ని ప్రభుత్వ స్కూళ్లు, మండల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలు పరిశీలించాకే స్కూళ్లు పంపిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. అసలేం జరిగింది? తెలంగాణలో మే 23 నుంచి టెన్త్ పరీక్షలు జరగనుండగా ప్రతి పేపర్ 80 మార్కులకే ఉండనుంది. మరో 20 మార్కులను విద్యార్థుల ప్రావీణ్యత ఆధారంగా స్కూళ్లు కేటాయించే అంతర్గత మార్కులతో పాఠశాల విద్యాశాఖ కలపాలి. ఇందుకోసం ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్ట్ ప్రకారం మార్కులు ఇవ్వాల్సి ఉంది. ఇలా గుర్తించిన మార్కులను ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ ద్వారా టెన్త్ పరీక్షల విభాగానికి డీఈవోల ద్వారా పంపాలి. కానీ ఇవేవీ నిర్వహించకుండానే ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం 20 మార్కులకు గరిష్టంగా 19 మార్కులు కూడా వేయడం, దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే పద్ధతి కనిపించడం అనుమానాలకు కారణమైంది. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లో విద్యార్థికి అతితక్కువ మార్కులు వచ్చినా, ప్రాజెక్టు వర్కే చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారని, కొన్ని ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు కూడా చేశాయంటూ ఉన్నతాధికారులకు ఆరోపణలు అందినట్లు తెలియవచ్చింది. దీంతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల తర్వాతే మార్కుల ఖరారు.. పాఠశాలలు పొందుపర్చిన ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను పరిశీలించేందుకు ప్రతి మండల పరిధిలో ఓ ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి సబ్జెక్టు నుంచి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. కేటాయించిన స్కూళ్లకు ఈ బృందం వెళ్లి విద్యార్థి ఏడాదిపాటు రాసిన నోట్‌బుక్స్ (ఇందులో రాత విధానం గుర్తిస్తారు), సమాధాన పత్రాలను తనిఖీ చేయనుంది. అవసరమైతే విద్యార్థితో ముఖాముఖి మాట్లాడి మార్కులను ఖరారు చేయనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ప్రత్యేక బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఇంటర్నల్ మార్కులను పాఠశాల విద్యాశాఖ నిర్ణయించనుంది. ప్రాజెక్టు వర్క్ ఏం చేయించారు? ఎలా చేయించారు? వాటి ఫలితాలను విద్యార్థి ఎలా విశ్లేషించారనే అంశాలకు ఈ బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ పరిశీలనపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా ఇప్పుడు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలన ఎలా వీలవుతుందని, ప్రైవేటు స్కూళ్లు తనిఖీ బృందాలను మేనేజ్ చేసుకుంటే పరిస్థితి ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది టెన్త్ విద్యార్థులుండగా 3 లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలోనే ఉన్నారు. అంత మంది విద్యార్థుల రికార్డులను ప్రత్యేక బృందాలు పరిశీలించడం ఆచరణ సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించడానికే ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లో ఎక్కడ చదివినా ఆ విద్యార్థి సామర్థ్యాన్ని నిష్పాక్షికంగా గుర్తించగలగాలి. ఇది సాధ్యం కావాలంటే మొదట్నుంచీ పూర్తిస్థాయి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. –పి. రాజభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్పొరేట్ మాయాజాలమే ప్రభుత్వ స్కూళ్లలో సామర్థ్యాన్ని బట్టే విద్యార్థులకు మార్కులొస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఇదో పెద్ద మాయాజాలం. అసెస్మెంట్ పరీక్ష పేపర్ ఇచ్చి దగ్గరుండి సమాధానాలు రాయిస్తున్నారు. పదికి పది జీపీఏ సాధించడం కోసమే ఇదంతా చేస్తున్నారు. – చావా రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
అంతా పాస్.. త్వరలోనే జీపీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. ఇక వారికి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ బుధవారం జీవో జారీచేశారు. కరోనా నేపథ్యంలో పదో పరీక్షలను రద్దుచేసి అందరినీ పాస్‌చేసిన ప్రభుత్వం ఇపుడు వారి ఇంటర్నల్ మార్కుల ప్రకారం ప్రతి సబ్జెక్టుకు గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇచ్చి, త్వరలోనే ఫలితాలను ప్రకటించ నుంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల పదో తరగతి (ఎస్ఎస్సీ, ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్) విద్యార్థులంతా పాసైనట్టేనని, వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (పరీక్ష లేకుండానే పాస్) జీపీఏ ఇచ్చేదిలా.. రాష్ట్రంలో మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రకటించడం, అదే నెల 23 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదా వేయడం తెలిసిందే. ఆ తరువాత జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించేలా హైకోర్టు మే 19న అనుమతి ఇచి్చంది. అయితే జూన్ 6న కరోనా పరిస్థితిని సమీక్షించిన హైకోర్టు.. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొంది. దీంతో ప్రభుత్వం అదే రోజు పరిస్థితిని సమీక్షించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదావేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 8న జరిగిన సమావేశంలో పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్ మార్కుల ఆధా రంగా విద్యార్థులందరికి గ్రేడింగ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే విద్యాశాఖ నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహించిందని, వాటి ఆధా రంగా ఇంటర్నల్ మార్కులను పాఠశాలలు విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేశాయని పేర్కొంది. ఆ మార్కులు ఇపుడు విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా విద్యార్ధులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా జీపీఏ ఇవ్వాలని వెల్లడించింది. విద్యాశాఖ వద్ద ఉన్న 20 శాతం ఇంటర్నల్ మార్కులను వంద శాతానికి లెక్కించాలని, విద్యార్థులకు ఆ 20శాతంలో వచి్చన మార్కుల ప్రకారం ఐదింతలు వాటికి కేటాయించాలని పేర్కొంది. వన్‌టైమ్ మెజర్ కింద ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పాసైనట్టే. ఆ విద్యార్థుల విషయంలో... పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 5,34,903 మందిలో 25 వేల మంది వరకు ప్రైవేటు విద్యార్థులున్నారు. వారికి గ్రేడింగ్ ఇచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి చెప్పా రు. వారు పరీక్ష రాసేందుకు సిద్ధమై ఫీజు చెల్లించినందున వారికీ గ్రేడింగ్ ఇవ్వక తప్పదన్నారు. అయితే వారు పాసైన ఇతర సబ్జెక్టులకు ఇప్పటికే గ్రేడ్స్, గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయా విద్యార్థులు గతంలో ఫెయిౖ లెన సబ్జెక్టు కూడా ఇపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాసైనట్లే లెక్క. ఇపుడు వారికి గ్రేడ్, గ్రేడ్ పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే మొత్తంగా జీపీఏ కేటాయించాల్సి వస్తుం ది. గతంలో పాసైన సబ్జెక్టును వదిలేసి, ఫెయిలైన సబ్జెక్టుల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్‌ను కేటాయించాలా? అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి జీపీఏ ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. విద్యార్థి ఫెయిలైన సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్నర్ మార్కుల ప్రకారమే గ్రేడ్, గ్రేడ్ పాయింట్ ఇచ్చి జీపీఏ నిర్ణయించే అవకాశం ఉంది. -
టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులు రద్దు
సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రంలో కీలక మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు. ఇంటర్నల్ మార్కుల వల్ల కార్పొరేట్ స్కూళ్లకే లబ్ధి కలుగుతోందనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అందుకే మొత్తం మార్కులకు పదోతరగతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలో ప్రత్యేకంగా ఇచ్చే బిట్ పేపర్ తొలగిస్తామని వెల్లడించారు. ఇకపై బిట్ పేపర్‌ను ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగా చేరుస్తామని వివరించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి. సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8 మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. సబ్జెక్ట్ వారీగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తాం. ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. దీనికి అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం ఇస్తాం. సమాధాన పత్రాలు గతంలో లూజ్ షీట్లు ఉండేవి. దానివల్ల కాపీయింగ్‌కు ఆస్కారం ఉండేది. అందుకే ఇప్పుడు 18 పేజీల బుక్లెట్ ఇవ్వబోతున్నాం. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తాం. మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహిస్తాం. కంప్యూటర్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తాం. దీనికి పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు’’ అని మంత్రి సురేష్ అన్నారు. పేరెంట్స్ కమిటీల పర్యవేక్షణలోనే కార్యక్రమాల అమలు రాష్ట్రంలో 46,635 పాఠశాలలకు తల్లిదండ్రుల (పేరెంట్స్) కమిటీ ఎన్నికలను సజావుగా నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు 45,390 స్కూళ్లకు కమిటీల ఎంపిక పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యాహక్కు చట్టంపై పేరెంట్స్ కమిటీలకు అవగాహన కల్పిస్తామని, పాఠశాలల పర్యవేక్షణ, నియంత్రణలో వారిని భాగస్వాములను చేస్తామని అన్నారు. ఎన్నిక వాయిదా పడిన స్కూళ్లలో 28వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ మాసాంతంలో పేరెంట్స్ కమిటీలకు శిక్షణ ఇస్తామన్నారు. యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, సైకిళ్ల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కొత్త ప్రశ్నాపత్రం ఇలా.. ►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు. ►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు. ►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు. ►1 మార్కు చొప్పున 8 మార్కులు. ►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు. ►2 మార్కులు చొప్పున 16 మార్కులు. ►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు. ►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు. -
టెన్త్ ఇంటర్నల్ మార్కులు రద్దు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు రద్దు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మంగళవారం తెలిపారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం యథాతథంగానే కొనసాగిస్తూనే పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు లేకుండా 100 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్ మార్కులు కేటాయింపు విధానంలో లోపాలు ఉన్నాయి. పాఠశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటిని రద్దు చేయాలని పలువర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఇంటర్నల్ మార్కులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంటర్నల్ మార్కుల రద్దు అమల్లోకి వస్తుందని కమిషనర్ వివరించారు. మంగళవారం ఎస్సెస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి టెన్త్ ప్రశ్నపత్రం మోడల్లో కూడా మార్పులు ఉంటాయని, దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. టెన్త్ మార్కుల్లో స్పోర్ట్సు కోటాకు కూడా కొన్ని మార్కులు కేటాయించాలని భావిస్తున్నామన్నారు. టెన్త్ ఫలితాల విడుదలలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి లోపాలు లేకుండా ధ్రువపత్రాలు జారీ కానున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జూన్ నుంచే నామినల్ రోల్స్‌ను స్కూళ్ల నుంచి తీసుకుంటామని తెలిపారు. ముందుగానే తప్పులను సవరించి ధ్రువపత్రాలు ఇవ్వడానికి వీలవుతుందన్నారు. జూన్ ఆఖరుకు డీఎస్సీ నియామకాలు డీఎస్సీ నియామకాలను జూన్ ఆఖరుకు పూర్తిచేసే అవకాశాలున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాలు ఇంతకు ముందే ప్రకటించినా.. ఎన్నికల కోడ్ వల్ల జిల్లాల వారీగా ఎంపిక జాబితాల ప్రకటన చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డీఎస్సీ నియామకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త టీచర్ల నియామకానికి ముందే బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇదివరకటి దరఖాస్తులను అనుసరించి వీటిని చేస్తారన్నారు. సాధారణ బదిలీలు ఉండవని తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పారు. -
ఇంటర్నల్ మార్కుల్లో ప్రైవేట్ పడగ
-
ఇష్టారాజ్యానికి చెక్ పడేనా..?
పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను ఇష్టమొచ్చినట్లు వేసుకునే కార్యక్రమానికి ఇక చెక్ పడే విధంగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతేడాది పది ఫలితాల్లో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు అధికంగా పదికి పది గ్రేడ్లు వచ్చాయి. ఇంటర్నల్‌లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా మార్కులను వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది కమిటీలను నియమించి ప్రైవేటు, కార్పొరేట్ దూకుడుకు కళ్లెం వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. కడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పదవ తరగతి ఇంటర్నల్ పరీక్షల్లో ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుని, అత్యధికంగా పదికి పది గ్రేడ్స్ సాధిస్తున్నాయి. దీనిపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో ఎక్కువ జీపీఏ వచ్చిన పాఠశాలలపై విచారణ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దీంతో పాటు ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తారనే ప్రచారం జరిగినా విద్యాశాఖ ఈ ఏడాది కూడా ఇంటర్నల్ మార్కులను కొనసాగిస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిటీల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో కమిటీలు వేయడంతో తూతూ మంత్రంగా పనిచేశారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి విమర్శలకు కట్టడి చేసేందుకు ఈ ఏడాది జనవరిలోనే కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈనెల 9న విద్యాశాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మూడు విభాగాలుగా కమిటీలు.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు మండలం, డివి జన్, జిల్లాస్థాయిలో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను పరిశీలించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సమ్మెటివ్–1, ఫార్మెటివ్‌కు సంబంధించి 1,2,3,4 పరీక్షల మార్కులను కమిటీలు పరిశీలించనున్నాయి. మండలస్థాయి కమిటీలో ఎంఈఓ, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, డివిజినల్ స్థాయి కమిటీ చైర్మన్లో డిప్యూటీ ఈఓ, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎస్ఏ సెక్టోరియల్ అధికారి, జిల్లాస్థాయి కమిటీలో డీఈఓ, ప్రభుత్వ పరీక్షల సహాయక కమీషనర్, డీసీఈబీ సెక్రటరీ, డైట్ ప్రిన్సిపల్ సభ్యులుగా వ్యవహరిస్తారు. నివేదికలు ఇలా.. మండలస్థాయిలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వ రకు పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను పరిశీలించి డివిజినల్ స్థాయికి కమిటీకి నివేదిక అం దించాలి. అయితే వీటిలో 80 శాతం ప్రైవేటు, అన్ ఎ యిడెడ్ పాఠశాలలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే డివిజినల్ స్థాయి కమిటీ ఫిబ్రవరి 5 నుంచి 13లోపు పరిశీలన పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటిటీ నివేదిక అం దించాలి. వారు 5 నుంచి 13లోపు మార్కులను పరిశీ లించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదిక అందించాలి. ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించకుండానే పరిశీలన.. ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు కమిటీలను ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా ఇంతవరకు పాఠశాలల్లో ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించలేదు. ఇది నిర్వహించకుండా మార్కుల పరిశీలన ఏవిధంగా జరుపుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఏ–1, పార్మెటివ్–1,2,3 పరీక్షలు మాత్రమే జరిగాయి. ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి 280 మార్కులకు 20 మార్కులుగా ఇంటర్నల్ మార్కులను వేయడం సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితిలో కమిటీలు ఇంటర్నల్ మార్కులను ఎలా తనిఖీ చేస్తారో తెలియాలి. ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహిస్తాం ఇప్పటి వరకు జరిగిన సమ్మెటివ్–1 ఫార్మెటివ్ 1,2,3 పరీక్షలకు సంబం ధించి మార్కులను కమిటీలు పరిశీలిస్తాయి. ఫార్మెటివ్– 4 పరీక్షను త్వరలో నిర్వహిస్తాం. పరీక్ష ముగియగానే అవసరమైతే ఆ మార్కులను కూడా పరిశీలిస్తారు. ఫార్మెటివ్–4 కాకుండా మిగతా వాటిని పరిశీలించగానే పరిస్థితి అర్థమవుతోంది. – జీవీ నారాయణరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ పారదర్శకంగా తనిఖీలు గతేడాది కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పదవ తగరతిలో ఇంటర్నల్ మార్కులను ఇస్టానుసారంగా వేసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిటీలను ఏర్పాటు చేసి పరిశీలించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 28లోపు కమిటీలను ఏర్పాటు చేసి పారదక్శంగా తనిఖీలు చేపడతాం. ఎవరికైనా వాస్తవ మార్కుల కంటే ఎక్కవ మార్కులు వేసినట్లు గురిస్తే చర్యలు తీసుకుంటాం.– పి. శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి. -
టెన్త్ ‘అంతర్గత’ మార్కులపై తనిఖీలు
పశ్చిమగోదావరి , నిడమర్రు: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదుపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం వెళ్లనుంది. గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కులు 20కి 20కి వేసుకోవటంతో టెన్త్ జీపీఏలు వారికే ఎక్కువగా వచ్చాయనే అభియోగాల నేపథ్యంలో ఈ సంవత్సరం పాఠశాల విద్యాశాఖ ముందుగానే అప్రమత్తమైంది. సమ్మెటివ్–1 పరీక్షతో పాటు నాలుగు ఫార్మెటివ్ పరీక్షలు పాఠశాల స్థాయిలో జరుగుతాయి. వీటిల్లో విద్యార్థులకు మార్కులు ఎలా వేశారో ప్రత్యక్షంగా విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను పరిశీలన చేయనుంది. ఈ పరిశీలన పూర్తిగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీనియర్ హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారులు, ఎస్ఎస్ఏ సెక్టోరల్ అధికారులు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో సాగుతుంది. మొత్తం మూడు స్థాయిల్లో ఈ పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనలో కూడా ఏమైనా లోపాలు ఉంటే మరో కమిటీ గుర్తించి ఆ మేరకు అప్రమత్తం చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది 20 శాతం పరిశీలన జిల్లాలో ఈ ఏడాది 50,184 మంది ఎస్ఎస్సీ పరీక్షలు రాయనున్నారు. వీరికి నిర్వహించిన సమ్మెటివ్–1 పరీక్షకు 10 మార్కులు, ఒక్కో ఫార్మెటివ్ పరీక్షకు రెండున్నర మార్కులు చొప్పున నాలుగు ఫార్మెటివ్లకు 10 మార్కులు చొప్పున మొత్తం 20 మార్కులను కుదించి నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులు ఎలా పరీక్షలు రాశారు. వారి అభ్యసన సామర్థ్యాలు ప్రాజెక్టు వర్క్, మౌఖిక ఇంటర్వ్యూలు, స్లిప్ టెస్ట్‌లో మార్కులు, క్రమశిక్షణ తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నల్ మార్కులు సంబం ధిత పాఠశాల ఉపాధ్యాయులే కేటాయిస్తారు. అయితే ఈ మార్కుల కేటాయింపులో కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు చాలావరకు టెన్ జీపీఏలే ధ్యేయంగా చదివినా, చదవకున్నా, క్రమశిక్షణ లేమి ఉన్నా 20కు 20 వేసి ఉదారతను చాటుకుంటున్నాయని గతేడాది ఫలితాలు ఆధారంగా ఒక అంచనాకు విద్యాశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్గత మార్కుల నమోదు తనిఖీలకు వెళ్లటానికి జిల్లా విద్యాశాఖ తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఈ బృందాలు సంక్రాంతి సెలవుల అనంతరం కార్యాచరణకు దిగుతాయి. 20 శాతం పేపర్లు తనిఖీలకు వెళ్లిన ప్రతి చోటా మొత్తం విద్యార్థుల్లో 20శాతం మంది పేపర్లు తీసి ఈ బృందం సభ్యులు పరిశీలన చేస్తారు. ఈ పరిశీలనలో ఏమైనా తప్పిదాలు దొర్లినా మరో కమిటీ గుర్తిస్తుంది. నిజంగా విద్యార్థులకు రాసిన సమాధానాలు ఆధారంగా మార్కులు వేసి వాటినే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీఎస్ఈ) వెబ్సైట్లో మార్కులు నమోదు చేశారా లేక ఇక్కడ ఏమైనా హెచ్చుతగ్గులుగా నమోదు చేశారా అనేది కూడా వీరు పరిశీలిస్తారు. విద్యార్థుల సమాధాన పత్రాలపై నమోదు చేసిన మార్కులు, సీఎస్ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన మార్కులు రెండూ ఒకేరకంగా ఉన్నాయా లేదా అనేది కూడా ఈ కమిటీలు ధ్రువీకరించాలి. ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే సరిదిద్దాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా మార్కులు వేస్తే చర్యలు ప్రైవేటు పాఠశాలలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అక్రమంగా మార్కులు వేసినట్టు పరిశీలనతో బహిర్గతమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 13 వరకూ అన్నిస్థాయిల్లో అంతర్గత మార్కుల పరిశీలన బృందాల నివేదికను రాష్ట్ర అధికారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి కమిటీల్లో సభ్యులు వీరే.. ♦ మండల స్థాయి కమిటీల్లో ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఆ మండలంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులు సభ్యులు. ♦ డివిజన్ స్థాయిలో డీవైఈవో, మండలంలో సీనియర్ హెచ్ఎం, ఎస్ఎస్ఏ నుంచి సెక్టోరియల్ అధికారి. ♦ జిల్లాస్థాయిలో డీఈవో, అసిస్టెంట్ కమిషనర్(ఎగ్జామినేషన్), డీసీఈబీ సెక్రటరీ, డైట్ ప్రిన్సిపాల్ సభ్యులు ♦ మండలస్థాయిలో ఈ నెల 28న ప్రారంభించి, పిబ్రవరి 4తో ముగించాలి. ♦ డివిజన్ స్థాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు ♦ జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు పరిశీలన చేయాలని కమిషనర్ షెడ్యూల్ జారీ చేశారు. -
ఉన్నట్టా.. లేనట్టా!
నెల్లూరు(టౌన్): పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు విద్యార్థులు, ఉపాధ్యాయులను అయోమయంలో పడేసింది. గత రెండేళ్లుగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 80 మార్కులకే నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా కలుపుతున్నారు. అయితే ఈ ఏడాది 100 మార్కులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పాఠశాలలను పునఃప్రారంభించి 3 నెలలు పూర్తయినా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎన్ని మార్కులు ఉంటాయన్న దానిపై ఇప్పటికీ జిల్లా విద్యాశాఖకు స్పష్టత రాలేదు. పరీక్షల్లో ఎన్ని మార్కులకు పేపరు ఉంటుందన్న ఆందోళన ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో నెలకొంది. గత రెండేళ్లుగా పరీక్షల్లో మార్పులు చేస్తూ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. అయితే ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు మాత్రం పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉండాలని మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. స్పష్టత లేక అమోమయం జిల్లాలో మొత్తం 694 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 348 ప్రభుత్వ, 346 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 35,478 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 21799 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 10254 మంది బాలురు, 11538 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 13679 మంది విద్యార్థులు చదవుతున్నారు. వారిలో 7825 మంది బాలురు, 5854 మంది బాలికలు ఉన్నారు. ప్రతి ఏటా మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే పది పరీక్షలు ఎన్ని మార్కులకు నిర్వహిస్తారో ఇప్పటికీ విద్యార్థులకు తెలియని పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. గతంలో పదో తరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు 100 మార్కులకు పరీక్ష నిర్వహించే వారు. గత రెండేళ్లుగా ఒక్కో సబ్జెక్ట్‌కు 80 మార్కులకే పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులకు పాఠశాలల్లో నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకుని మార్కులు వేస్తున్నారు. ఏడాదికి 4 ఫార్మేటివ్‌లు, 3 సమ్మెటివ్ అసెస్మెంట్లు నిర్వహించాల్సిఉంది. అయితే 2017–18లో తొలి సమ్మెటివ్ అసెస్మెంట్ పేపర్ లీకు కావడంతో ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేసి రెండు అసెస్‌మెంట్‌లనే నిర్వహించారు. 2016–17 విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలకు సంబంధించి వచ్చిన మార్కుల ఆధారంగా 8వ తరగతిలో 10 మార్కులు, 9వ తరగతిలో 10 మార్కులు తీసుకుంటామని ప్రకటించారు. కానీ కేవలం 10వ తరగతిలో 4 ఫార్మేటివ్‌లు రెండు అసెస్‌మెంట్‌ల్లో వచ్చిన 360 మార్కులను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నల్ మార్కులను కలిపారు. అయితే 2017–18 సంవత్సరంలో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు వేశారు. అయితే సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు ఒకే రకమైన ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించారు. మార్కులపై గందరగోళం పదో తరగతి మార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. పదిలో 100 మార్కులకు పరీక్షలు ఉంటాయని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించినా దీనిపై జిల్లా విద్యాశాఖకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికి తొలి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షను నిర్వహించగా, ప్రస్తుతం రెండో ఫార్మేటివ్ పరీక్ష జరుగుతోంది. తొలి సమ్మెటివ్ పరీక్షను దసరా సెలవుల అనంతరం అక్టోబర్ చివరి వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి పరీక్షల్లో 80 మార్కులు ఉండడం ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రయోజనమని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒకే ప్రశ్నపత్రం ఉండడం వల్ల లీక్ చేయడం పరిపాటిగా మారింది. గతేడాది సమ్మెటివ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడం వల్ల ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. కార్పొరేట్ వాళ్లదే.. పదిలో ఇంటర్నల్ మార్కుల కోసం కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు లాభసాటిగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు తమకు ఇష్టం వచ్చిన విధంగా విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎక్కువగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు 10కి 10 జీపీఏ రావడం సులభతరమైందంటున్నారు. దీంతోనే పదిలో ఇంటర్నల్ మార్కులు తప్పనిసరిగా ఉండాలని కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు పట్టుబడుతున్నారు. ఈ విషయంపై మంత్రి నారాయణ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పదో తరగతికి ఇంటర్నల్ మార్కులు ఉండవని, 100 మార్కులకు పరీక్షలు ఉంటాయని ప్రకటించినా ఇప్పటికీ ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. -
జీవితాలతో చెలగాటం
అనంతపురం ఎడ్యుకేషన్: గతంలో చేసిన తప్పిదాలను మళ్లీ చేశారు. చేసిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా.. పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 2017–18 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ పదో తరగతి పరీక్షలకు హాజరై ఇంటర్నల్(అంతర్గత) మూల్యాంకనంలో మార్కులు నమోదు కాని విద్యార్థులకు సంబంధించి ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో ఈ మార్కులు నమోదు కాని విద్యార్థుల వివరాలు వారి తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కమిషనర్, అమరావతి నుంచే సమాచారం చేరవేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి స్థానిక కేఆస్‌ఆర్ బాలికల పాఠశాలలో ఈ నెల 7 నుంచి గురువారం.. అంటే నాలుగు రోజల పాటు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి రికార్డులను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత మార్కులు నమోదు చేస్తూ వచ్చారు. నమోదు కాని 32 మందివిద్యార్థుల మార్కులు జిల్లాలో 137 స్కూళ్ల నుంచి 2121 మంది విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయాల్సి ఉందంటూ రాష్ట్ర అధికారుల నుంచి జాబితా వచ్చింది. గడువు ముగిసే సమయానికి 130 స్కూళ్ల నుంచి 2,089 మంది విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. ఇంకా ఏడు స్కూళ్ల నుంచి 32 మంది విద్యార్థుల మార్కులను నమోదు చేయాల్సి ఉంది. ఈ స్కూళ్లన్నీ కూడా ప్రైవేట్‌వే కావడం గమనార్హం. అనంతపురంలో రెండు, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, మడకశిరలో ఒక్కో స్కూలు ఉంది. ఇంటర్నల్ మార్కులు నమోదు చేయని అన్ని స్కూళ్లకు మోమోలు జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అవకాశం ఇచ్చినా మార్కులు నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
‘ఇంటర్నల్’ కిరికిరి!
– మీ సేవా కేంద్రాల్లో మార్కుల నమోదు అస్తవ్యస్తం – గడువు ముంచుకొస్తుండడంతో హెచ్ఎంల ఆందోళన – నగరంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి ఎస్ఏ–2 గణితం పరీక్షలో 62 మార్కులు వచ్చాయి. అయితే మీసేవా కేంద్రంలో ఆ విద్యార్థినికి కేవలం ఆరు మార్కులు వచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. అంటే 56 మార్కుల తేడా. మరో పాఠశాలలో ఏ–1 గ్రేడులో నిలిచే విద్యార్థినికి ఎస్ఏ–2 ఇంగ్లీష్‌లో ‘0’ మార్కులు వచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. అలాగే మరో అమ్మాయికి హిందీలో 47 మార్కులు వస్తే...ఆన్లైన్లో మాత్రం 37 మార్కులు కనిపిస్తున్నాయి. అలాగే బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి, రామాపురం, కొడవండ్లపల్లి పాఠశాలలకు సంబంధించి ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. ఈ ఘటనలు చాలు ఇంటర్నల్ మార్కులు ఆన్లైన్ నమోదు ఎంత అస్తవ్యస్తంగా మారుతోందో తెలుసుకునేందుకు. - అనంతపురం ఎడ్యుకేషన్ పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అయితే 20 ఇంటర్నల్ మార్కుల కేటాయింపుపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆన్లైన్లో కన్ఫర్మేషన్కు ఈనెల 20తో గడువు ముగుస్తుంది. గడువు ముంచుకొస్తుండడంతో ప్రధానోపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. అప్పటిదాకా బాగానే ఉంది... నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్ఏ)–1, 2, సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ)–1 జవాబు పత్రాలను అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, ప్రైవేట్) పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. అయితే పని ఒత్తిడి, ఇతరత్రా పనుల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం సంఘాలు ఇందుకోసం ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్కుల నమోదును మీసేవా కేంద్రాలకు అప్పగించింది. ఒక్కో విద్యార్థికి రూ.3 చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఎఫ్ఏ–3,4, ఎస్ఏ–1 జవాబు పత్రాలను నేరుగా ఆయా మీసేవా కేంద్రాల్లో అప్పగించారు. వారు ఇష్టానుసారంగా నమోదు చేశారు. మరి కొందరి విద్యార్థుల మార్కులను నేటికీ నమోదు చేయలేదు. ఒక్క విద్యార్థికీ కన్ఫర్మేషన్ ఇవ్వలేని దుస్థితి మార్కుల వివరాలను మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ఆయా స్కూళ్ల హెచ్ఎంలు వారి యూడైస్ కోడ్ ఆధారంగా ఆన్లైన్లో ఓపెన్ చేసుకుని వారు కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా జిల్లాలో మీసేవా వారు ఆన్లైన్లో పొందుపరిచిన విద్యార్థులకు సంబంధించి ఒక్క విద్యార్థికీ కన్ఫర్మేషన్ చేయలేని పరిస్థితి. దీంతో హెచ్ఎంలు కన్ఫర్మేషన్ చేయకపోవడంతో కుప్పలు తెప్పలుగా పెండింగ్ పడ్డాయి. అయితే ప్రైవేట్ పాఠశాలలకు ఆన్లైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వారే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడంతో దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ముగింపు దశకు చేరుకుంది. ఎటొచ్చి ప్రభుత్వ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎట్టకేలకు ఎడిట్ ఆప్షన్ ఇదిలా ఉండగా ఆన్లైన్లో తప్పుల తడకగా నమోదైన వాటిని సరిదిద్దుకునేందుకు హెచ్ఎంలకు అవకాశం ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వడంతో వారి వారి విద్యార్థుల మార్కుల జాబితాలను దగ్గర పెట్టుకుని సరిదిద్దుతూ కన్ఫర్మేషన్ చేసే పనిలో హెచ్ఎంలు ఉన్నారు. అయితే ప్రభుత్వం విధించిన గడువు (ఈనెల 20)లోగా అందరి పిల్లల వివరాలు నమోదు చేయడం సాధ్యం కాదని హెచ్ఎంలు స్పష్టం చేస్తున్నారు. -
ఇంటర్నల్ మార్కులు తారుమారు
- టెన్త్ ఇంటర్నల్ మార్కుల అప్లోడింగ్లో దొర్లిన తప్పు - ఇద్దరూ ఒకే పేరుతో ఉండడంతో సిబ్బంది తప్పిదం - సవరణకు ఏపీ ఆన్లైన్లో లేని ఆప్షన్ వెల్దుర్తి రూరల్ : ఒకే సెక్షన్.. ఒకే తరగతి.. ఒకే పేరు.. తేడా ఉన్నదంతా తండ్రి పేరు మాత్రమే. ఇలాంటి వారి మార్కుల నమోదు విషయంలో స్కూల్ సిబ్బంది చేసిన పొరపాటు మెరిట్ విద్యార్థికి గ్రహపాటుగా మారింది. టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదులో తారుమారు కావడం ఇందుకు కారణం. ఇందుకు వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ వేదికగా మారింది. జి. రాజేశ్ పేరుతో ఇద్దరు విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇందులో ఒకరు బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన గిడ్డయ్య కుమారుడు(ఐడీ నెంబరు 6261504) పట్టణంలోని బాలుర హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అన్నింటా ఏ1 గ్రేడ్ మార్కులు సాధించాడు. మరొకరు వెల్దుర్తికే చెందిన జి. దేవేంద్రుడి కుమారుడు జి.రాజేశ్(ఐడీ నెంబరు 6267823). ఈ విద్యార్థి మార్కుల సాధనలో పూర్. వీరి మార్కుల ఆన్లైన్ నమోదులో ఉపాధ్యాయులు, సిబ్బంది చేసిన తప్పిదం కారణంగా ఒకరి మార్కులు ఒకరికి పడ్డాయి. హాస్టల్ వార్డెన్ దొరస్వామి విజ్ఞప్తి మేరకు హెచ్ఎం మధు.. విద్యార్థుల మార్కుల సవరణకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎంఈఓ రామ్మోహన్‌ను కోరారు. అయితే సవరణ గడువు శుక్రవారంతో ముగియడంతో ఆయన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన మార్కులు తనకు వేసి న్యాయం చేయాలని బాధిత విద్యార్థి కోరుతున్నాడు. -
9, 10 తరగతుల పరీక్షల ప్రక్షాళన
ముందుగా గణితంతో పరీక్షలు మొదలు డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు హైదరాబాద్: పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు తెస్తోంది. 9, 10 తరగతుల పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు ప్రథమ భాష తెలుగుతో ప్రారంభమయ్యే పరీక్షలను గణితంతో ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే ఇష్టారాజ్యంగా వేస్తున్న ఇంటర్నల్ మార్కులకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఈవోలకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం వచ్చే నెల 3 నుంచి ప్రారంభమయ్యే సమ్మేటివ్-1 పరీక్షలు వచ్చే నెల 9 నాటికి పూర్తి కానున్నాయి. ఇక డిసెంబరు/జనవరిలో నిర్వహించే సమ్మేటివ్-2 పరీక్షల తరువాత ఇంటర్నల్ మార్కులు (20 ఇంటర్నల్స్, 80 రాత పరీక్ష) వేసే విధానంపై తనిఖీలను చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రైవేటు పాఠశాలలు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) రూపొందించిన ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. దసరా సెలవులను వచ్చే నెల 10 నుంచి 25 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. -
‘ఇంటర్నల్ మార్కుల’ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఆన్లైన్ (https://bsetelangana.org)లో నమోదు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి మంగళవారం తెలిపారు. -
‘పది’లో ప్రక్షాళన
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : పదో తరగతి విద్యావిధానాన్ని ఈ ఏడాది విద్యాశాఖ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగా పాఠ్యాంశాల మార్పుతోపాటు విద్యాబోధన, పరీక్ష విధానంలోనూ మార్పులు తెస్తోంది. జాతీయ పాఠ్యప్రణాళిక ప్రకారం రాష్ట్ర విద్య పరిశోధన మండలి 2012-13 విద్యాసంవత్సరంలో 1, 2, 3, 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చింది. 2013-14లో 4, 5, 8, 9 తరగతులకు, ఈ విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతికి సిలబస్‌ను మార్పు చేసింది. మారిన సిలబస్‌లో కృత్యాధార బోధనకు ప్రాధాన్యం లభిచింది. పాఠ్యపుస్తకాలు బట్టీకొట్టేవిగా కాకుండా విషయ అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. పాఠ్యాంశాలను విద్యార్థులు చదవడంతో పాటు ఆలోచించడం, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తీకరించడం, విశ్లేషణ చేసే విధంగా, వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ఈ పుస్తకాలను రూపొందించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం, మహిళలను గౌరవించడం, స్త్రీ సాధికారికత తదితర విషయాలకు ప్రాధాన్యనిచ్చారు. పరీక్ష విధానంలో సంస్కరణలు పాఠశాల విద్యాశాఖ దాదాపు 15 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షా విధానంలో మార్పు చేసింది. ఇప్పటి వరకు హిందీ పరీక్షకు మాత్రమే ఒక్క పేపర్ ఉండేది. మిగిలిన ఐదు పరీక్షలకు రెండేసి పరీక్షలు రాయాల్సి వచ్చేది. అయితే ఈ ఏడాది నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. మిగిలిన సైన్స్, సోషియల్, లెక్కలు సబ్జెక్టులకు రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 80 మార్కుల రాత పరీక్ష ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్నల్ మార్కులు కలిపి 35 మార్కులు తెచ్చుకుంటేనే ఆ విద్యార్థి ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణుడైనట్లు పరిగణలోకి తీసుకుంటారు. గతంలో హిందీ సబ్జెక్టులో 20 మార్కులు తెచ్చుకుంటే చాలు పాస్ చేసేవారు. ప్రస్తుత విధానంలో ఈ సబ్జెక్టులోనూ 35 మార్కులు తెచ్చుకోవాల్సిందే.