ఊళ్లు ఖాళీ
ఉపాధి లేక వలసల జోరు
ఉన్న ఊరు వదిలి దూరప్రాంతాలకు..
మిగిలిపోతున్న కదల్లేని వృద్ధులు
నగర శివారులో దయనీయత
విశాఖ నగరం.. ఈ పోర్టు సిటీకి స్మార్టు హంగులు కూడా సమకూరనున్నాయి. పేరెన్నికగన్న పరిశ్రమలు.. మెట్రో రైలు పరుగులు తీసే నగరాల జాబితాలోనూ చేరింది. అంతేనా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచాన్నే ఆకర్షించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ జరగనుంది. ఇంతటి విశిష్టత సొంతం చేసుకున్న ఈ నగరానికి శివారులో కొన్ని ఊళ్లు ఉపాధిలేక ఖాళీ అయిపోతున్నాయంటే విస్మయం కలిగించే విషయం.
అభివృద్ధికి అంచున ఇది మరో కోణం. పొట్ట కూటికోసం పిల్లాపాపలతో కుటుంబాలు వలస పోతున్నాయి. ఒకరా ఇద్దరా..ఏకంగా ఊళ్లే ఖాళీ అవుతున్నాయి. ఏమీ చేయలేని ముసలీ ముతకా మిగిలిపోతున్నారు. ఇలాంటి గ్రామాలు విశాఖనగరానికి పాతిక కిలోమీటర్ల దూరంలోపే ఉండటం గమనార్హం.