సోమ్‌దేవ్‌కు నిరాశ
సిడ్నీ: అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో సోమ్‌దేవ్ 6-2, 2-6, 3-6తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) చేతిలో ఓటమి చవిచూశాడు.
తొలి సెట్‌ను నెగ్గిన సోమ్‌దేవ్ ఆ తర్వాత తడబడి వరుస సెట్లను చేజార్చుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఈ భారత ఆటగాడు మూడుసార్లు మాత్రమే సఫలమయ్యాడు. తన సర్వీస్‌ను మాత్రం నాలుగుసార్లు కోల్పోయాడు. ఇదే టోర్నీ డబుల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత ఆటగాళ్లు లియాండర్ పేస్, రోహన్ బోపన్న వేర్వేరు భాగస్వాములతో బరిలో ఉన్నారు.