isf
-
ఉద్యోగులకు డిమాండ్..భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: కాంట్రాక్టు కార్మికులు (ఫ్లెక్సీ స్టాఫ్) 2.27 లక్షల మందికి గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఉపాధి కల్పించినట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వార్షిక నివేదిక వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్, తయారీ, హెల్త్‌కేర్, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలు ఉపాధికి దన్నుగా నిలిచాయని పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫ్లెక్సీ స్టాఫ్‌కు డిమాండ్ 3.6 శాతం పెరిగినట్టు తెలిపింది. అన్ని రంగాల్లోనూ డిజిటల్ దిశగా మార్పులను స్వీకరించడం ఉపాధికి అవకాశం కల్పించినట్టు పేర్కొంది. 2022– 23లో ఫిన్‌టెక్, ఐటీ–ఇన్ఫ్రా, ఐటీ/ఐటీఈఎస్ రంగాలు కాంట్రాక్టు కార్మికులకు ఎక్కువగా ఉపాధినిస్తాయని తెలిపింది. ఇండియన్ స్టాఫింగ్ సమాఖ్య పరిధిలోని కంపెనీలు 2021–22లో 2.27 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాయని.. దీంతో మొత్తం కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 12.6 లక్షల మందికి చేరినట్టు నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మాదిరే 2021–22లోనూ ఉద్యోగుల్లో మహిళల వాటా 27 శాతంగా ఉందని తెలిపింది. తాత్కాలిక, పరిమిత సమయం పాటు పనిచేసే వారిని ఫ్లెక్సీ స్టాఫ్‌గా పరిగణిస్తారు. యువతే ఎక్కువ ఫ్లెక్సీస్టాఫ్కు అధిక శాతం అవకాశాలు బహిరంగ విక్రయాల నుంచి, తప్పనిసరి ఉత్పత్తుల డెలివరీకి మళ్లినట్టు ఈ నివేదిక వివరించింది. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 25–30 ఏళ్ల వయసులోని వారు 40 శాతం మేర ఉన్నారు. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 31–45 ఏళ్ల వయసులోని వారి ప్రాతినిధ్యం 10 శాతం మేర పెరిగింది. ‘‘2021–22 ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమకు అసాధారణం అని చెప్పుకోవాలి. ఉద్యోగులకు డిమాండ్ 21.9 శాతం (2.27 లక్షలు) పెరిగింది.. ఉద్యోగులు, ఉద్యోగ సంస్థలు కరోనా ప్రభావం నుంచి బయటకు వచ్చి, భవిష్యత్తును నిర్మించుకునేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది’’అన ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న్పటికీ, 2022–23 ఆరంభం సంకేతాలను గమనిస్తే రానున్న మూడు త్రైమాసికాల్లోనూ ఉద్యోగుల నియామకాలకు డిమాండ్ కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేశారు. ఇతర ఉపాధి విభాగాలతో పోలిస్తే ఫ్లెక్సీస్టాఫ్కు డిమాండ్ 10 శాతం పెరుగుతుందని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. -
ఐటీలో నియామకాల జోష్..
సాక్షి, అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగ నియామకాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం తన జోరు చూపిస్తోంది. దేశంలో టాప్–4 ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ ఈ ఏడాది లక్ష మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించడం ఇందుకు నిదర్శనం. దీంతో ఐటీ పట్టభద్రులకు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. విద్యార్థులకు ఒకేసారి మూడు నాలుగు ఆఫర్లు వస్తుండటంతో కావాల్సినంత జీతం అడిగే అవకాశం లభిస్తోంది. గతేడాది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు 72,000 మందికి ఉద్యోగాలిచ్చాయి. తాజాగా చదువు పూర్తి చేసుకున్నవారిలో.. 2020లో 6 శాతం మందికి ఉద్యోగాలు దక్కితే ఇప్పుడది 15 శాతానికి పెరిగినట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) పేర్కొంది. కోవిడ్–19 అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపితే ఐటీ రంగానికి మాత్రం భారీ ప్రయోజనం దక్కింది. లాక్‌డౌన్‌తో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోకి మారుతుండటంతో దీనికనుగుణంగా ఐటీ అప్‌గ్రేడేషన్, డిజిటల్ సేవలను పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కంపెనీలు డిజిటలైజేషన్, ఆటోమేషన్ వైపు మారుతుండటంతో ఐటీ రంగంలో ఒక్కసారిగా ఉద్యోగ నియామకాలకు డిమాండ్ పెరిగిందని ఐఎస్ఎఫ్ తెలిపింది. ఈ కోర్సులు చేస్తే.. కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, ఆటోమేషన్ వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వచ్చే మూడేళ్లలో ఐటీ రంగంలో 65 నుంచి 70 లక్షల మంది ఉద్యోగులు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా మానవవనరులు అందుబాటులో లేకపోవడంతో ఐటీ కంపెనీలు సతమతమవుతున్నాయి. దీంతో ఈ కోర్సుల్లో నైపుణ్యం కలిగిన వారు గతంలో కంటే 50 నుంచి 70 శాతం అధిక జీతం డిమాండ్ చేస్తున్నారని ఏబీసీ కన్సల్టింగ్ సీనియర్ డైరెక్టర్ రతన్ గుప్తా వివరించారు. ఈ కోర్సులు చేసిన ప్రతి పది మందిలో నలుగురైదుగురు జాబ్ ఆఫర్లను తిరస్కరిస్తున్నారని చెప్పారు. చేతిలో మూడు నాలుగు ఆఫర్లు ఉంటుండటంతో.. నచ్చిన జీతం ఇచ్చిన కంపెనీని ఎంచుకోవడమే ఇందుకు కారణమన్నారు. సాధారణ ఇంజనీరింగ్ కోర్సు చేసిన వారికి ఐటీ కంపెనీల్లో ప్రారంభ వార్షిక వేతనం రూ.3 –రూ.3.5 లక్షలు ఇస్తున్నారని, అదే ప్రస్తుతం డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులు నేర్చుకుంటే ప్రారంభ వేతనమే రూ.6– రూ.8 లక్షలు వస్తోందని నెక్టŠస్ వేవ్ సంస్థ హెచ్ఆర్ హెడ్ గిరీష్ ఆకాష్ యశ్వంత్ తెలిపారు. ఇంజనీరింగ్ చదువుతూ ఈ టెక్నాలజీలపై పట్టు సాధిస్తే కోర్సు పూర్తికాగానే అందరికీ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కంపెనీలకు కత్తి మీద సాము బయట భారీ డిమాండ్ ఉండటంతో నైపుణ్యం కలిగిన వారిని కాపాడుకోవడం ఇప్పుడు కంపెనీలకు కత్తి మీద సాముగా మారింది. కొత్త టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారిని కంపెనీలు మంచి జీతం ఇచ్చి తీసుకుంటుండంతో ఉద్యోగులు కంపెనీ మారిపోతున్నారు. మొన్న ఆర్థిక ఫలితాల సందర్భంగా ఐటీ కంపెనీలు ప్రకటించిన అట్రిషన్ (ఉద్యోగులు మానేయడం) రేటే దీనికి నిదర్శనం. ఒక్క టీసీఎస్ తప్ప మిగిలిన కంపెనీల్లో అట్రిషన్ రేటు భారీగా పెరిగిపోయింది. పైగా ఈ ఏడాది ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలుంటాయన్న సంకేతాలను ఇచ్చాయి. నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ రేటు 15 శాతానికి పెరగ్గా.. వచ్చే రెండు త్రైమాసికాలు కూడా ఇదే విధంగా కొనసాగే ప్రమాదం ఉంది. విప్రోలో 12.1 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు ఈ ఏడాది మరింత పెరగొచ్చు. టీసీఎస్‌లో మాత్రం అట్రిషన్ రేటు జీవితకాల కనిష్ట స్థాయి 7.2 శాతానికి చేరుకోవడం గమనార్హం. మొత్తం మీద దేశీయ ఐటీ కంపెనీల్లో 2020–21లో అట్రిషన్ రేటు 10–12 శాతంగా ఉండగా, అది ఈ ఏడాది 20–25 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. మంచి ఆఫర్‌తో అవకాశం వస్తే గోడ దూకేయడానికి ఇండియన్ టెకీలు సిద్ధంగా ఉన్నారన్నమాట. చదవండి: Andhra Pradesh: బలంగా బడి పునాదులు ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే -
బీజేపీ, టీఎంసీలను ఓడించాలి
కోల్‌కతా: లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సంయుక్తంగా ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. మతతత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజలకు జనహిత సర్కారును అందిస్తామని హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి, ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నాయి. ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీల మధ్య పోటీ మాత్రమే కాదని, మూడో పక్షంగా తమ కూటమి కూడా బరిలో ఉందని కాంగ్రెస్ నేత ఆధిర్ చౌధురి పేర్కొన్నారు. బీజేపీ, టీఎంసీలను ఓడించి తీరుతామన్నారు. మరోవైపు, ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఎన్నికల తరువాత టీఎంసీ జీరో అవుతుందని ఐఎస్ఎఫ్ చీఫ్ అబ్బాస్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. కూటమిలో సీట్ల పంపకాలను ఉద్దేశిస్తూ.. ఐఎస్ఎఫ్ న్యాయబద్ధ వాటా సాధిస్తుందని కాంగ్రెస్, వామపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు. ‘బీజేపీ, టీఎంసీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. మతపరంగా ప్రజలను విడదీయడమే వాటి లక్ష్యం. ప్రజలకు అభివృద్ధిదాయక పాలన మా కూటమే అందివ్వగలదు’ అని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి సూర్యకాంత మిశ్రా పేర్కొన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే టీఎంసీ బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏలో చేరేందుకు కూడా వెనుకాడరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఎన్డీఏలో గతంలోనూ టీఎంసీ భాగస్వామిగా ఉందన్న విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. బీజేపీ, టీఎంసీల మధ్య ప్రస్తుతం జరిగేది ఉత్తుత్తి యుద్ధమేనన్నారు. -
జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు
పరిశ్రమ వర్గాల అంచనా న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నిరుద్యోగులకు మంచి రోజులను తీసుకురానుంది! కొత్త పన్ను వ్యవస్థ కారణంగా సత్వరమే నూతనంగా లక్షకుపైగా ఉద్యోగాలు ఏర్పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో ట్యాక్సేషన్, అకౌంటింగ్, డేటా విశ్లేషణకు సంబంధించి కూడా ఉండనున్నాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఇది ఉద్యోగ మార్కెట్ వార్షికంగా 10–13 శాతం స్థాయిలో వృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని, ఆర్థిక రంగంలోని పలు విభాగాల్లో నిపుణులకు డిమాండ్ పెంచుతుందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎఫ్) పేర్కొంది. ‘‘జీఎస్టీతో వస్తు సేకరణ, పంపిణీ మరింత వేగవంతమవుతుంది. దీంతో లాభాలు కూడా పెరుగుతాయి. వీటికితోడు నిబంధనల పారదర్శకతతో అవ్యవస్థీకృత రంగంలోని వారు సైతం వ్యవస్థీకృత మార్కెట్ దిశగా అడుగులు వేయక తప్పదు’’ అని ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ రితూపర్ణ చక్రవర్తి అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి త్రైమాసికం నుంచే లక్షకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయెల్ తెలిపారు. ఆ తర్వాత మరో 60,000 వరకు ఏర్పడతాయన్నారు. కంపెనీలు కొన్ని రకాల కార్యకలాపాలను అవుట్సోర్స్ చేసేందుకు మొగ్గుచూపుతాయన్నారు. జీఎస్టీ నిర్వహణ, సమన్వయం కోసం వ్యాపార సంస్థలు నిపుణులను నియమించుకోవాల్సి వస్తుందని, ఇది భారీ అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. ‘‘కొత్త వ్యవస్థతో వ్యాపార సులభత్వం పెరుగుతుంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లకు, కంపెనీలకు సానుకూలం. దీంతో ఉద్యోగ సృష్టికి వీలు కలుగుతుంది’’అని మాన్స్టర్ డాట్ కామ్ మిడిల్ఈస్ట్ ప్రాంత ఎండీ సంజయ్ మోదీ తెలిపారు. జీఎస్టీ తక్షణమే ప్రభావం చూపే రంగాల్లో ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్, హోమ్‌డెకార్, ఈకామర్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్, సిమెంట్, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు, బీఎఫ్ఎస్ఐ, కన్జ్యూమర్ డ్యురబుల్స్, ఫార్మా, టెలికం ఉంటాయని నిపుణుల విశ్లేషణ. ఎఫ్ఎంసీజీ సరుకులు వెనక్కి: జీఎస్టీకి ముందే డీలర్లు సరుకుల నిల్వలను కుదించుకుంటున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు అందుకు సిద్ధమయ్యాయి. సరుకులను తిరిగి వెనక్కి పంపడం, కొత్త పన్ను వ్యవస్థకు మారడం వంటివి రెండో త్రైమాసికం నాటికి సర్దుకుంటాయని భావిస్తున్నాయి. విక్రయాల స్థాయిలో నష్టాలు తగ్గించుకునేందుకు, కొత్త పన్ను వ్యవస్థకు సులభంగా మారేందుకు వీలుగా వ్యాపారులు సరుకుల నిల్వలు తగ్గించుకునే విషయంలో వారికి సహకరిస్తున్నట్టు డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ తెలిపాయి. -
యూనివర్సిటీ కన్వెన్షన్ పోస్టర్ విడుదల
బాలాజీచెరువు : భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర యూనివర్సిటీ కన్వెన్షన్ పోస్టర్ జేఎన్టీయూకేలో శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ సాయిబాబు ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ సాయిబాబు మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రపంచస్థాయి శాస్త్ర సాంకేతిక పురోగామి అభివృద్ధి చెందడానికి యూనివర్సిటీ విద్యలో కొన్ని మార్పులు తీసుకురావలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కన్వెన్షన్ సదస్సులు జయప్రదం చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్‌రాజు మాట్లాడుతూ ఈ సదస్సులో యూనివర్సిటీ విద్యలో పరిశోధన రంగం ప్రా«ధాన్యాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే టెక్నాలజీపై చర్చించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వై.సురక్షిత, ఉదయ్, రాజా, తదితరులు పాల్గొన్నారు.