నల్లగొండ జిల్లాది ఘనమైన చరిత్ర
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ :తెలంగాణ కల సాకరమవుతున్న వేళ సంబురాలు ఘనంగా జరుపుకుం టున్నామని, ఇవి అద్భుతమైన క్షణాలని ఏజేసీ వెంకట్రావు అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సాహిత్యం, చరిత్ర, సాంస్కృతిక వైభవంపై ని ర్వహించిన చర్చావేదికను జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొం డ జిల్లాకు ఘనమైన చరిత్ర ఉన్నదని.. ఇక్కడి కవులు, రచయితలు, కళాకారులు తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు.
కార్యక్రమ అధ్యక్షుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ గత చరిత్ర, సంస్కృ తి, సాహిత్యపు పునాదులపైనే నూతన తెలంగాణ ఆవిష్కరించబడాలన్నారు. ఎందరో ప్రఖ్యాత సాహితీవేత్తలు, పరి శోధకులు, కవులు, కళాకారులు ఉద్భవించిన జిల్లా అని, తొలి తెలుగు కథా రచయిత్రి, నవలా రచయిత ఈ జిల్లా వాళ్లేనన్నారు. పరిశోధకులు సంకేటి శ్రీని వాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఏమీ తెలియదని సీమాంధ్రులు ఎద్దేవా చేస్తే, మలిదశ ఉద్యమం తెలంగాణ చరిత్ర ఘనమైనదని నిరూపించిందన్నారు. రావిచెట్టు రంగారావు, రాజనాయిని వెంకటరంగారావు, షబ్రనవీసు వెంకటనర్సింహారావు, ధవళా శ్రీనివాసరావు, ఆళ్వారుస్వామిలాంటి వారు చేసిన సాహితీ సేవ ఆంధ్రులకు కనువిప్పు కలిగించిందన్నారు.
కథా రచయిత జర్నలిస్టు కాసుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేదన్నారు. నదీజలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ముం దుగా వెలుగులోకి తెచ్చిందిపాత్రికేయులేనని గుర్తు చేశారు. దాచేపల్లి దుర్గయ్య, వేణుసంకోజు, ప్రభాకర్‌లు మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన చరిత్ర, ప్రముఖుల విశేషాలను పాఠ్య పుస్తకాల ద్వారా అం దుబాటులోకి తేవాలని కోరారు. అంతకుముందు కవి, గామకుడు అంబటి వెంకన్న పాడిన తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ ఆహుతలను ఆకట్టుకుంది. అనంతరం కవి, రచయితలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలికట్టె శంకర్రావు, భూపతి వెంకటేశ్వర్లు, గొనే లింగరాజు, మధుసూదన్‌రావు, సీపీఓ నాగేశ్వర్రావు, డీఎఫ్ఓ, డీడీ మోహన్‌రావు, డాక్టర్ నోముల సత్యనారాయణ, దశరథకుమార్, బెరైడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ కృష్ణ కౌండిన్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.