విజయవాడ నుంచి సికింద్రాబాద్కు జనసాధారణ్ ఎక్స్ప్రెస్
సాక్షి,సిటీబ్యూరో: దీపావళి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ నుంచి సికింద్రాబాద్కు జనసాధారణ్ ఎక్స్ప్రెస్ నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు (02713) ఈ నెల 21వ తేదీ రాత్రి 10.15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ఖమ్మం, మహబూబ్బాద్, వరంగల్,కాజీపేట్, జనగామ,మౌలాలీ స్టేషన్లలో ఆగుతుంది.