సోషల్ మీడియాలో పవన్ చాలా యాక్టివ్!
జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ పార్టీ పరంగా తన అభిమానులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. మరో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తాయని గతంలోనే ప్రకటించారు పవన్. అందుకోసం ఒక్కో మెట్టు సిద్ధం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొన్ని నెలల కిందట వరకూ, ముఖ్యంగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉన్న పవన్.. ప్రస్తుతం అంతగా స్పందించడం లేదు. కొన్ని రోజుల కిందట ఏపీకి ప్రత్యేక హోదా అంటూ రెండుసార్లు బహిరంగసభలు నిర్వహించారు.
వీటితో పాటు ప్రస్తుతం మరిన్ని సోషల్ మీడియా వెబ్ సైట్లలో ప్రచారం మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ కోసం అధినేత పవన్.. యూట్యూబ్ ఛానల్, అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ను, ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న పవన్.. కాటమరాయుడు షూటింగ్ ప్రారంభించడం.. మరోవైపు 'జనసేన మనసేన' అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన విషయాలను ఇందులో కచ్చితంగా పోస్ట్ చేస్తామని జనసేన పార్టీ నాయకులు ఓ పేర్కొన్నారు. జనసేన మనసేన పేరుతో యూట్యూబ్ లో పోస్ట్ చేసిన టీజర్ కు మంచి స్పందన రావడం గమనార్హం.