కాలిఫోర్నియా స్కూల్లో కాల్పులు
లాస్ ఎంజెలెస్: కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినోలోని ప్రాధమిక పాఠశాలలో జరిగిన హత్నాయత్నం ఘటనలో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. రెండేళ్ల క్రితం బెర్నార్డినోలో జరిగిన ఉగ్రదాడిలో 14 మంది మరణించిన సంఘటన మరువక ముందే జరిగిన తాజా ఘటన..స్థానికులను ఆందోళనకు గురి చేసింది. అయితే తాజా ఘటన కుటుంబ కలహాల కారణంగానే జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
సెడ్రిక్ అండర్సన్ అనే 53 ఏళ్ల వ్యక్తి...అదే స్కూల్లో టీచర్‌గా వున్న తన భార్య కారెన్ ఎలైన్ స్మిత్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్య చనిపోగా, తీవ్రంగా గాయపడిన మార్టినెజ్ అనే బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడ్డ అండర్సన్...కాల్పులు జరిగిన తర్వాత అదే గన్‌తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని టార్గెట్ విద్యార్థులు కాదని, తననుంచి విడిపోయిందనే కోపంతో భార్యను చంపడానికే అతను స్కూల్ వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు చెప్తున్నారు.