జయ కోసం అన్నా డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా?
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి చెప్పారు. రాజీనామా చేయడానికి కారణమేంటన్న విషయాన్ని వెట్రివేల్ వెల్లడించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాధాకృష్ణన్ నియోజకవర్గం నుంచి వెట్రివేల్ ఎన్నికయ్యారు. అన్నా డీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కోసమే ఆయన రాజీనామా చేసినట్టు భావిస్తున్నారు.
2011లో శ్రీరంగం నుంచి అసెంబ్లీకి ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ఎమ్మెల్యే పదవిని కోల్పోవడంతో పాటు సీఎం పదవికి రాజీనామా చేశారు. కాగా కర్ణాటక హైకోర్టు.. జయలలితను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగుగమైంది. జయలలిత ఉత్తర చెన్నైలోని రాధాకృష్ణన్ నగర్ నుంచి పోటీ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నెల 22 న జరిగే ఏఐఏడీఎంకే శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఇందులో జయలలిత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.