‘జయమ్ము నిశ్చయమ్మురా’కు అపూర్వ ఆదరణ
రావులపాలెం :
ఇటీవల విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రానికి ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించడంతో చిత్రం ఘనం విజయం సాధించిందని ఆ చిత్రంలో విల¯ŒSగా నటించిన రుద్రరాజు రవివర్మ తెలిపారు. స్థానిక పద్మశ్రీ థియేటర్లో ప్రదర్శితమవుతున్న భేతాళుడు చిత్రాన్ని శనివారం రాత్రి ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగులో ఇంత వరకూ సుమారు 30 చిత్రాల్లో నటించానన్నారు. వెన్నెల, రాఖీ, బొమ్మరిల్లు, రెడీ, జల్సా, క్షణం, అసుర, తదితర చిత్రాలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు. కాలింగ్ బెల్ చిత్రంలో హీరోగా నటించానన్నారు. తెలుగులో క్షణం సినిమా విజయం సాధించడంతో తమిళంలో కూడా నిర్మిస్తున్నారని, అందులో కూడా తాను అదే పాత్రలో నటిస్తున్నానన్నారు. ఆ చిత్రానికి భేతాళుడు చిత్ర దర్శకుడు ప్రదీప్కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. గాజీ అనే తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలోనూ తాను నటిస్తునని, ఆ చిత్రానికి రాణా హీరో అని చెప్పారు. నెపోలియ¯ŒS అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సముద్ర అందాలతో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా విజయం సాధించిందని, అయితే నోట్ల రద్దు ప్రభావం కొంత మేర పడిందన్నారు. ఆ¯ŒSలై¯ŒSలో టికెట్లు విక్రయాలు జరిగిన అన్ని థియేటర్లు హౌస్పుల్గా నడుస్తున్నాయన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని తెలిసినా కథపై నమ్మకంతో సాహసోపేతంగా చిత్రాన్ని విడుదల చేశామని, దానికి తగినట్టుగానే ప్రేక్షకుల ఆదరణ లభించిందన్నారు. కాకినాడ, రాజమండ్రి, తదితర ప్రాంతాల్లో విజయోత్సవయాత్రలో భాగంగా రావులపాలెం వచ్చానన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు బంధువులు ఉన్నారని తెలిపారు. తాను ఈ కోనసీమ కుర్రోడినేనని చెప్పారు. తొలుత ఆయనకు థియేటర్ మేనేజర్ సత్తిబాబు, సిబ్బంది స్వాగతం పలికారు.